జ‌గ‌న్‌పై సానుకూల‌త‌.. ర‌ఘురామే నిద‌ర్శ‌నం!

టీడీపీ సీనియ‌ర్ నేత‌, ఉండి ఎమ్మెల్యే ర‌ఘురామ‌కృష్ణంరాజు రోజురోజుకూ వార్త‌ల్లో వ్య‌క్తిగా నిలుస్తున్నారు. వైఎస్ జ‌గ‌న్ పేరు విన‌డానికి కూడా ర‌ఘురామ సహించేవారు కాదు. న‌ర్సాపురం లోక్‌స‌భ స్థానం నుంచి 2019లో వైసీపీ త‌ర‌పున…

టీడీపీ సీనియ‌ర్ నేత‌, ఉండి ఎమ్మెల్యే ర‌ఘురామ‌కృష్ణంరాజు రోజురోజుకూ వార్త‌ల్లో వ్య‌క్తిగా నిలుస్తున్నారు. వైఎస్ జ‌గ‌న్ పేరు విన‌డానికి కూడా ర‌ఘురామ సహించేవారు కాదు. న‌ర్సాపురం లోక్‌స‌భ స్థానం నుంచి 2019లో వైసీపీ త‌ర‌పున ర‌ఘురామ గెలుపొందారు. ఆ త‌ర్వాత కాలంలో జ‌గ‌న్‌తో ఆయ‌న‌కు విభేదాలొచ్చాయి. జ‌గ‌న్ కోట‌రీలోని న‌లుగురైదుగురు తాము త‌ప్ప‌, మ‌రెవ‌రూ నాయ‌కుడికి ద‌గ్గ‌ర కాకూడ‌ద‌నే కుట్ర‌లో భాగంగానే ర‌ఘురామ దూర‌మ‌య్యార‌ని వైసీపీ నాయ‌కులు చెబుతుంటారు.

సాధార‌ణంగా అధికార పార్టీలోకి ప్ర‌తిప‌క్ష పార్టీ నాయ‌కులు వెళుతుంటారు. కానీ ర‌ఘురామ ఇందుకు రివ‌ర్స్‌. ర‌ఘురామ‌ను వైసీపీకి దూరం చేయ‌డంతో పాటు ఆయ‌న‌పై కేసుల వ‌ర‌కూ జ‌గ‌న్ ప్ర‌భుత్వం వెళ్లింది. త‌న‌ను చంపాల‌ని చూశార‌ని ర‌ఘురామ ఎన్నోసార్లు వాపోయారు. దీంతో జ‌గ‌న్‌ను అభ్యంత‌ర‌క‌ర భాష‌లో ఆయ‌న తిడుతూ వ‌చ్చారు. ఇవ‌న్నీ గ‌తం.

వ‌ర్త‌మానంలోకి వ‌స్తే, రెండు రోజుల నాడు అసెంబ్లీ స‌మావేశాల ప్రారంభం సంద‌ర్భంగా జ‌గ‌న్‌ను ర‌ఘురామ ఆత్మీయంగా ప‌ల‌క‌రించారు. అసెంబ్లీ స‌మావేశాల‌కు రావాల‌ని కోరాన‌ని, ఇందుకు ఆయ‌న స‌మ్మ‌తించార‌ని ర‌ఘురామ చెప్పారు. టీడీపీ అనుకూల చాన‌ల్ నిర్వ‌హించిన డిబేట్‌లో జ‌గ‌న్‌ను ట‌చ్ చేసిన‌పుడు ఆయ‌న ఫీలింగ్స్ ఏంట‌ని ప్ర‌జెంట‌ర్ ప్ర‌శ్నించ‌గా, మామూలుగానే ఉన్నార‌ని ర‌ఘురామ చెప్పారు.

ఈ నేప‌థ్యంలో ర‌ఘురామ‌కృష్ణంరాజు సోష‌ల్ మీడియాలో ఒక వీడియో విడుద‌ల చేశారు. గ‌తంలో జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిని వాడు, వీడు అని తాను అన్న‌ట్టు ర‌ఘురామ చెప్పుకొచ్చారు. త‌న‌ను చంపాల‌న్న విష‌యం గుర్తుకొచ్చి ఆవేశంతో, మ‌రో కార‌ణంతోనో అలా మాట్లాడిన‌ట్టు ఆయ‌న తెలిపారు. ఇప్ప‌టి నుంచి జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి గారు అని పిలుస్తాన‌న్నారు. వ‌య‌సులో త‌న‌కంటే జ‌గ‌న్ చిన్న‌వాడైనా, స్నేహితుడి కుమారుడు, అలాగే ఐదేళ్లు ముఖ్య‌మంత్రిగా ప‌ని చేసిన కార‌ణంగా గౌర‌వంగా పిలుస్తాన‌ని ఆయ‌న తెలిపారు.

ర‌ఘురామ‌కృష్ణంరాజు వైఖ‌రి టీడీపీ, ఆ పార్టీ అనుకూల మీడియాకు జీర్ణం కావ‌డం లేదు. జ‌గ‌న్‌ను నిత్యం తిడుతూ వుండాల‌నేది వారి కోరిక‌. పైపెచ్చు ఇటీవ‌ల ఒక ఇంట‌ర్వ్యూలో చంద్ర‌బాబు త‌న సామాజిక వ‌ర్గానికి పెద్ద‌పీట వేస్తార‌ని న‌ర్మ‌గ‌ర్భ కామెంట్స్ చేశారు. జ‌గ‌న్‌పై సానుకూల ధోర‌ణి, ఇదే సంద‌ర్భంలో చంద్ర‌బాబుపై వ్య‌తిరేక‌త ర‌ఘురామ‌లో చూడొచ్చు. టీడీపీ ఎమ్మెల్యే అయిన ర‌ఘురామ‌లోనే ఇంత త‌క్కువ స‌మ‌యంలో భారీ మార్పు క‌నిపిస్తే, ఇక జ‌నం మాటేంటి? అనే ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మైంది. జ‌గ‌న్‌పై సానుకూల ధోర‌ణి ఏర్ప‌డుతోంద‌నేందుకు ర‌ఘురామ‌లో వ‌చ్చిన మార్పే నిద‌ర్శ‌నంగా వైసీపీ ప్ర‌చారం చేస్తుండ‌డం విశేషం.

17 Replies to “జ‌గ‌న్‌పై సానుకూల‌త‌.. ర‌ఘురామే నిద‌ర్శ‌నం!”

  1. రోజూ అసెంబ్లీ కి రా రా leven రెడ్డి.. అంటూ వెటకారం తో మీద చెయ్యి వేసి కేవలం చూపులతోనే Jeggulu మహిళని గర్భం చేసి వదిలేశాడు

  2. అంతే…అంతే….అసలు మన అన్నయ్య దిక్కుమాలిన పరిపాలన ఇప్పుడు లేదే అని… జనం గుక్కపెట్టి ఏడుస్తున్నారు అని కూడా చెప్పు GA…. అన్నియాకి mileage కూడా పెరుగుతుంది….😂😂

  3. అంటే చాలా ఎక్కువ డబ్బే ఇరుక్కుంది RRR ది జగన్ దగ్గర? అది రాబట్టు కోవాలి కదా!

  4. 60 weeks ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్ ఫ్రీ కోర్సు పూర్తిగా తెలుగులో.

    ఇంట్రెస్ట్ ఉన్నవారు, మా యూట్యూబ్ ఛానెల్ ఫాలో అవ్వండి

    YouTube లో

    Cloud Computing in Telugu

    అని సెర్చ్ చెయ్యండి

  5. హైకోర్టును ఆశ్రయించిన జగన్ తనకు ప్రతిపక్ష నేత హోదా ఇచ్చేలా స్పీకర్‍ ని ఆదేశించాలని హైకోర్టును కోరిన జగన్ ప్రతిపక్ష నేత హోదా కోసం లేఖ రాసినా ఇవ్వలేదని పిటిషన్‍లో పేర్కొన్న జగన్ అరేయ్ నీ గు కి సి’/గ్గుందా రా..ప్రజలు ఛీ కొట్టి 11 సీట్లు ఇచ్చి ప్రతిపక్షహోదా లేకుండా చేశారు..

  6. సాంతం పిచ్చెక్కినట్టుందిగా, ఇక కష్టమే, లండన్ డాక్టరు కూడా బాగుచెయ్యలేడు!

  7. Lets not get too far ahead of ourselves or predict the future. It is a good sign that both sides are cooling down which is the need of the hour and must appreciate RRR for taking the initiative.

  8. ఇలాంటి పిట్ట కబుర్లు పిల్లి శకునాలు ఎన్ని రాసారో గుర్తు లేదా ???2019-24 మధ్యలో దెబ్బకి 151 నుండి 11 కి పడిపోయారు

Comments are closed.