పీపుల్స్ మీడియా సంస్థ నిర్మిస్తున్న రవితేజ సినిమా మిస్టర్ బచ్చన్. సినిమా విడుదల తేదీ ప్రకటించేశారు ఇప్పటికే. కానీ డిజిటల్ అమ్మకాలు జరగలేదు, ఇదే సంస్థ గతంలో నిర్మించిన ఈగిల్ సినిమాను ఏ హక్కులు అమ్ముడు కాకుండానే విడుదల చేశారు. దాని వల్ల నిర్మాతలు కొంత నష్ట పోయారు, అందుకే ఈసారి అన్ని హక్కులు అమ్ముడు పోయాక కానీ విడుదల చేయకూడదని ముందే డిసైడ్ అయ్యారు.
మొత్తానికి అనుకున్నట్లే డిజిటల్ అమ్మకాలు క్లోజ్ చేశారు. నెట్ ఫ్లిక్స్ సంస్థ కు సౌత్ ఇండియా డిజిటల్ హక్కులు ఇచ్చేశారు. 20 కోట్లకు కాస్త అటు ఇటుగా ఇచ్చారని ఇండస్ట్రీ టాక్. ఇదిలా ఉంటే ఇప్పటికే హిందీ హక్కులు 25 కోట్లకు పైగా మొత్తానికి ఇచ్చేశారు. ఇక శాటిలైట్ హక్కులు మిగిలాయి.
థియేటర్ హక్కులు బేరాలు సాగుతున్నాయి. థియేటర్ నుంచి 35 కోట్ల వరకు ఆశిస్తున్నారు నిర్మాతలు. ఏ మేరకు వస్తాయో చూడాలి. సినిమా నిర్మాణానికి 90 కోట్ల వరకు ఖర్చు అయిందని టాక్. అందులో నిజమెంతో నిర్మాతలకు తెలియాలి. అదే కనుక నిజమైతే సినిమా డెఫిషిట్ లో విడుదల చేస్తున్నట్లే.
అంటే హిందీ సినిమా ని రీమేక్ చేసిన తర్వాత మళ్లీ హిందీ డబ్బింగ్ కి అంత పెట్టారు అంటారు! అలాగే కాని!
అయితే నెట్ ఫ్లిక్స్ లోనే చూస్తాం