‘అధీర’ మళ్లీ వార్తల్లోకి

నిర్మాత దానయ్య తనయుడు కళ్యాణ్ చేయాల్సిన సినిమా అధీర. ఈ సినిమా ఎప్పటి నుంచో వార్తల్లో వుంది. ప్రశాంత్ వర్మ.. కథ, స్క్రీన్ ప్లే అందించిన సినిమా ఇది. దర్శకత్వం కూడా ప్రశాంత్ వర్మ…

నిర్మాత దానయ్య తనయుడు కళ్యాణ్ చేయాల్సిన సినిమా అధీర. ఈ సినిమా ఎప్పటి నుంచో వార్తల్లో వుంది. ప్రశాంత్ వర్మ.. కథ, స్క్రీన్ ప్లే అందించిన సినిమా ఇది. దర్శకత్వం కూడా ప్రశాంత్ వర్మ నే చేయాలి. కానీ హనుమాన్ తరువాత లెక్కలు మారాయి. దాంతో ఈ ప్రాజెక్ట్ వుండదేమో అనుకున్నారు. కానీ సెప్టెంబర్ నుంచి తెర మీదకు వెళ్లబోతోందీ సినిమా. హనుమాన్ సినిమా నిర్మాత నిరంజ‌న్ రెడ్డి నిర్మించబోతున్నారు.

దానయ్య తనయుడు కళ్యాణ్ హీరో. దర్శకత్వ బాధ్యతలను నా సామి రంగా సినిమాతో దర్శకుడిగా మారిన విజ‌య్ బెన్నీ చేపడుతున్నారు. ఈ మేరకు అన్నీ లాంఛనాలు పూర్తయ్యాయి. సెప్టెంబర్ నుంచి ప్రారంభించి ఓ షెడ్యూలు పూర్తి చేసే సన్నాహాల్లో వున్నారు. దర్శకుడు ప్రశాంత్ వర్మ పూర్తి స్క్రిప్ట్ ఇస్తే చేసేయడాని దర్శకుడు విజ‌య్ బెన్నీ రెడీగా వున్నారు.

అయితే ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ ఎంత బలమైనదో, విలన్ క్యారెక్టర్ కూడా అంతకు అంతా బలమైనది. ఈ పాత్రకు సరైన నటుడు కావాలి. ఎస్ జె సూర్య లేదా అలాంటి రేంజ్ నటుడి కోసం చూస్తున్నారు. అది ఫిక్స్ అయితే మిగిలిన కాస్టింగ్ చకచకా సాగిపోతుంది.

దాదాపు పదేళ్లుగా ఎదురుచూస్తున్నాడు దానయ్య కుమారుడు కళ్యాణ్ హీరోగా మారాలని. కానీ తండ్రి దానయ్యకు సీరియస్ నెస్ లేదో, లేక మరే కారణాలు వున్నాయో, అలా అలా వెనక్కు వెళ్తూనే వుంది సినిమా.

2 Replies to “‘అధీర’ మళ్లీ వార్తల్లోకి”

Comments are closed.