ఆంధ్ర కు పాకుతున్న థియేటర్ల ఉద్యమం

థియేటర్ల కు సినిమాలను రెంటల్ సిస్టమ్ మీద కాకుండా పర్సంటేజ్ పద్దతిపై ఇవ్వాలనే డిమాండ్ ఊపందుకుంటోంది. నైజాంలో మొదలైన ఈ డిమాండ్ ఆంధ్రకు, సీడెడ్ కూ పాకింది. సీడెడ్, కృష్ణ, ఈస్ట్ ల్లో ఈ…

థియేటర్ల కు సినిమాలను రెంటల్ సిస్టమ్ మీద కాకుండా పర్సంటేజ్ పద్దతిపై ఇవ్వాలనే డిమాండ్ ఊపందుకుంటోంది. నైజాంలో మొదలైన ఈ డిమాండ్ ఆంధ్రకు, సీడెడ్ కూ పాకింది. సీడెడ్, కృష్ణ, ఈస్ట్ ల్లో ఈ పద్దతికి మద్దతు వస్తోంది. 

ఈ పద్దతిని వ్యతిరేకిస్తున్న దిల్ రాజుకు పట్టు వున్న ఉత్తరాంధ్రలో ఈ నినాదం చెల్లడం లేదు. ఈ విధానానికి మద్దతు ఇస్తున్న సురేష్ బాబు కు పట్టు వున్న ఈస్ట్, కృష్ణ, సీడెడ్ ల్లో షేర్ ల మీద ఆడతామనే ధోరణి వినిపిస్తోంది.

వెస్ట్ లో మాత్రం డిస్ట్రిబ్యూటర్లు అంతా ఓ మాట మీదకు వచ్చి షేరింగ్ మీద అయితే సినిమాలు ఇవ్వకూడదని డిసైడ్ అయ్యారు. గుంటూరు, నెల్లూరు ల్లో ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. దిల్ రాజు తో కలిసి వున్న, ఆయన తో బంధాలు వున్న నిర్మాతలు షేరింగ్ పద్దతిని వ్యతిరేకిస్తున్నారు. 

సురేష్ బాబు ఆయన మద్దతు దారులు షేరింగ్ పద్దతిని ఎలాగైనా తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు. మరి ఈ థియేటర్ల ఉద్యమం ఈ నెల 12న విడుదలయ్యే సినిమాల మీద ఏమైనా ప్రభావం చూస్తుందా? చూపించదా? అన్నది మాత్రం ఇంకా క్లారిటీ లేదు. 

షేరింగ్ మీద అయితే సినిమాలు ఇవ్వకూడదని, నష్టం వచ్చినా ఆపుకునే వుండాలని, దిల్ రాజు ఆయన అనునాయులు గట్టిగా పట్టుకుని కూర్చున్నట్లు తెలుస్తోంది. 

ష‌ర్మిల 'ప్ర‌త్యేక'  స‌మావేశం వెనుక మాస్ట‌రు ప్లాన్ ?

తెలంగాణలో పార్టీ వద్దన్నదే జగన్ భావన