ఎంత చావగొట్టినా స్టీల్ ప్లాంట్ పైకి లేస్తోంది!

దాని పేరే ఉక్కు. దాని వెనక ఉక్కు సంకల్పం ఉంది. ఎందరో అమరుల త్యాగాలు ఉన్నాయి. అలాగే ఉదారంగా భూములు ఇచ్చిన వారి మంచితనం ఉంది. అందుకే ప్లాంట్ ని ప్రైవేటైజేషన్ ఎంతలా దిగమింగాలని…

దాని పేరే ఉక్కు. దాని వెనక ఉక్కు సంకల్పం ఉంది. ఎందరో అమరుల త్యాగాలు ఉన్నాయి. అలాగే ఉదారంగా భూములు ఇచ్చిన వారి మంచితనం ఉంది. అందుకే ప్లాంట్ ని ప్రైవేటైజేషన్ ఎంతలా దిగమింగాలని చూసినా మూడేళ్ళుగా అది సాగడం లేదు. విశాఖ స్టీల్ ప్లాంట్ కి ఊపిరి పోసింది నిధులు ఇచ్చి ఆదుకున్నది అంతా కాంగ్రెస్ ప్రభుత్వాలే.

ఇప్పటికి యాభై ఏళ్ళ క్రితం ఇందిరాగాంధీ విశాఖ స్టీల్ ప్లాంట్ ని ఏర్పాటు చేస్తున్నట్లుగా పార్లమెంట్ లో ప్రకటించారు. ఆ తరువాత ఆమె స్వయంగా విశాఖ వచ్చి శంకుస్థాపన చేశారు. ఆమె మూడోసారి ప్రధాని అయినపుడు నిర్మాణ పనులు ప్రారంభం అయ్యాయి. మరో కాంగ్రెస్ ప్రధాని పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్నపుడు విశాఖ ఉక్కు ఉత్పత్తిని ప్రారంభించింది.

విశాఖ స్టీల్ ప్లాంట్ దేశంలోనే చాలా పేరు గడించింది. నాణ్యమైన స్టీల్ తయారీలో అంతర్జాతీయంగా పేరు ఉంది. అయితే సొంత గనులు లేకపోవడం పాలకుల ఉదాశీనత కారణంగానే ప్లాంట్ తిప్పలు పడుతోంది. గత మూడేళ్ళుగా ప్లాంట్ ప్రైవేటైజేషన్ అనే వధ్య శిల మీద నిలబడి ఉన్నా సమయం వచ్చినపుడల్లా తన సత్తాను చాటుకుంటోంది.

లేటెస్ట్ గా చూస్తే ప్లాంట్ ఉత్పత్తిలో మరో రికార్డు సాధించి కేంద్ర పాలకుల ప్రైవేటీకరణ విధానాలు తప్పు అని చాటి చెప్పింది. వంద మిలియన్ టన్నులను ఉత్పత్తి చేయడం ద్వారా స్టీల్ ప్లాంట్ పాత రికార్డులు బద్ధలు కొట్టి కొత్త రికార్డులు నెలకొల్పింది. కేవలం రెండు బ్లాక్ ఫర్నేస్ లతోనే ప్లాంట్ ఈ రికార్డుని సాధించింది.

ఇది ఒక శాంపిల్ మాత్రమే అని స్టీల్ ప్లాంట్ ఈ ఆర్ధిక సంవత్సరం ముగిసేలోగా 300 మిలియన్ టన్నుల ఉత్పత్తి సాధించడానికి కూడా టార్గెట్ పెట్టుకుంది అని అంటున్నారు. ఆ విధంగా కేంద్ర పాలకుల ఆలోచనలు తప్పు అని ప్లాంట్ తన ఉత్పత్తులతో బెంచ్ మార్క్ ని కొత్తగా క్రియేట్ చేస్తూ ముందుకు సాగుతోంది అని అంటున్నారు. వీలైతే 7.2 మిలియన్ టన్నులను ఉత్పత్తి చేయడానికి కూడా ప్లాంట్ రెడీగా ఉందని అంటున్నారు. ఈ రికార్డులు చూసి అయినా కేంద్ర ప్రభుత్వం మనసు మార్చుకుంటుందా అని కార్మిల లోకం ఆశగా ఎదురుచూస్తోంది.

13 Replies to “ఎంత చావగొట్టినా స్టీల్ ప్లాంట్ పైకి లేస్తోంది!”

  1. నిజమే GA….పాపం steel plant ను ఎత్తేసి అక్కడ capital పెడదామనే ముష్టి తెలివి కూడా చూపించారట అప్పట్లో …..మహానుభావులు….😂😂

      1. ex CM ని పట్టుకొని ఎర్రిహుక గిర్రి హూక అనటం చాలా బాగోలేదు సర్ !!

  2. It’s also bcoz of great visionary CBN garu, with in a months time he got the central minister kumaraswamy come rolling to make the announcement!!

  3. మోసగాని ..అడగండి ఎప్పడు 2024 మేనిఫెస్ట్ అమలు చేసినాడు అని

    TDP 2024 మెనెఫెస్టో

    మెగా డీఎస్సీపై మొదటి సంతకం

    సామాజిక పింఛన్లు రూ.4 వేలకు పెంపు (2024 ఏప్రిల్‌ నుంచే వర్తింపు)

    ఏడాదికి మూడు గ్యాస్‌ సిలిండర్లు ఉచితం

    మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం

    దివ్యాంగులకు పింఛను రూ.6 వేలకు పెంపు

    బీసీలకు 50 ఏళ్లకే రూ.4 వేలు పింఛను

    18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1,500

  4. అది పైకి లేచిన కొద్దీ, నష్టాల జెష్ట దరిద్రాన్ని ప్రజలు మోయాల్సిన దరిద్రం

Comments are closed.