ల‌క్ష‌ల ఎక‌రాల్లో పంట సాగే లేదు!

పంట న‌ష్టం కరువు కాదు.. ఈ సారి ఏకంగా పంటే సాగు చేయ‌లేని ప‌రిస్థితులు క‌నిపిస్తూ ఉన్నాయి రాయ‌ల‌సీమ‌లో! రుతుప‌వ‌నాల సీజ‌న్ మొద‌లై అటు ఇటుగా రెండు నెల‌లు గ‌డుస్తున్నా.. చినుకు జాడ లేదు…

పంట న‌ష్టం కరువు కాదు.. ఈ సారి ఏకంగా పంటే సాగు చేయ‌లేని ప‌రిస్థితులు క‌నిపిస్తూ ఉన్నాయి రాయ‌ల‌సీమ‌లో! రుతుప‌వ‌నాల సీజ‌న్ మొద‌లై అటు ఇటుగా రెండు నెల‌లు గ‌డుస్తున్నా.. చినుకు జాడ లేదు సీమ‌లో. ఫ‌లితంగా ఈ సారి విత్త‌నం వేయ‌డానికి కూడా అదును లేకుండా పోయింది. జూన్ రెండో వారంలో సాగు కావాల్సిన విత్త‌నానికి జూలై నెలాఖ‌రుకు కూడా మార్గం లేకుండా పోయింది. రాయ‌ల‌సీమ చ‌రిత్ర‌లోనే ఈ ఏడాది రికార్డు స్థాయిలో బీడు భూమ‌లు క‌నిపిస్తూ ఉన్నాయి. చ‌క్క‌గా పంట సాగుతో ఉండాల్సిన ప‌రిస్థితులు కాస్తా.. ఎర్ర‌టి మ‌ట్టి బీడు భూమిగా వెక్కిరిస్తూ ఉంది. చినుకు జాడ లేక రైతులే కాదు, పంట సాగు లేక జీవ వైవిధ్యం కూడా దెబ్బ‌తినే ప‌రిస్థితి ఈ ఏడాది రాయ‌ల‌సీమ క‌రువులో ప్ర‌త్యేక‌త గా క‌నిపిస్తూ ఉంది.

ఉమ్మ‌డి అనంత‌పురం జిల్లాలో పంట సాగుకు అనుకూలంగా ఉన్న భూ విస్తీర్ణం అటు ఇటుగా ఆరున్న‌ర ల‌క్ష‌ల హెక్టార్లు! ఒక హెక్టార్ రెండున్న‌ర ఎక‌రాకు స‌మానం. ఉమ్మ‌డి ఏపీలోనే అతి పెద్ద జిల్లాగా ఉండేది అనంత‌పురం జిల్లా. అక్క‌డ సాగు భూమి విస్తీర్ణం కూడా ఇలా భారీ స్థాయిలోనే ఉంటుంది. మ‌రి ఈ ఏడాదికి పెద్ద విడ్డూర‌మైన విశేషం ఏమిటంటే.. ఉమ్మ‌డి అనంత‌పురం జిల్లాలో ఖ‌రీఫ్ లో సాగు చేసిన భూమి రెండు ల‌క్ష‌ల హెక్టార్ల లోపే కావ‌డం! ఆరున్న‌ర ల‌క్ష‌ల హెక్టార్ల సాగు భూమి అంటే.. అందులో రెండు ల‌క్ష‌ల హెక్టార్ల‌లో కూడా పంట సాగు కాలేదంటే ప‌రిస్థితిని అంచ‌నా వేసుకోవ‌చ్చు!

అందుకు ప్ర‌ధాన కార‌ణం.. అదునులో వ‌ర్షం కుర‌వ‌డం పోవ‌డం! అదునులోనే కాదు.. ఈ సారి సీమ మీద మ‌రోసారి వ‌రుణుడు ప‌గ‌బ‌ట్టాడు. గ‌త నాలుగైదేళ్లుగా మెరుగైన స్థాయి వ‌ర్ష‌పాతం న‌మోదు అయ్యింది. భారీ వ‌ర్షాలు కురిశాయి. దీంతో సాగు బాగా సాగింది. అయితే ఈ సారి అనంత‌పురం జిల్లా వ‌ర‌కే చూసుకుంటే.. కనీవినీ స్థాయి ఎర‌గ‌ని క‌రువు నాట్యం చేస్తూ ఉంది. ప‌ల్లెలకు వెళ్లి చూస్తే.. ఎర్ర‌టి బీడు భూములు ద‌ర్శ‌నం ఇస్తున్నాయి. ప్ర‌తి యేటా ఈ భూముల్లో వేరుశ‌నగ‌, కంది వంటి పంట‌లు ప్ర‌ధానంగా సాగు అయ్యేవి. అయితే ఈ సారి వర్షాధార వేరుశ‌నగ వేసిన నాథుడే లేడంటే ఆశ్చ‌ర్యం క‌ల‌గ‌క‌మాన‌దు.

అనంత‌పురం అంటే వేరుశన‌గ సాగు, వేరుశ‌న‌గ సాగు అంటే అనంత‌పురం అన్న‌ట్టుగా ఉండేది ద‌శాబ్దాల నుంచి ప‌రిస్థితి. గుజ‌రాత్ త‌ర్వాత అత్యంత ఎక్కువ‌గా వేరుశ‌న‌గ సాగ‌య్యేది రాయ‌ల‌సీమ ప్రాంతంలోనే. ప్ర‌త్యేకించి వ‌ర్షాధారంగా వేరుశ‌నగ సాగు ఇక్క‌డ సంప్రదాయం. కొన్ని మండలాల‌కు మండలాల్లో పంట అంటే వేరుశ‌న‌గ మాత్ర‌మే అన్న‌ట్టుగా ఉంటుంది ప‌రిస్థితి. అదొక్క పంటే సాగు చేసుకుంటూ జీవ‌న‌ధారం సాగించే కుటుంబాలు అనేకం ఉంటాయి. అలాంటి చోట‌.. ద‌శాబ్దాల్లో తొలి సారి అస‌లు విత్త‌న‌మే వేయ‌కుండా అదును దాటిపోవ‌డం గ‌మ‌నార్హం.

జూన్ మొద‌టి వారంలో వేరుశ‌న‌గ విత్త‌నానికి సేద్యాలు చేసుకుంటారు. ఈ సారి మే నెల‌లోనే వ‌ర్షాలు కురిశాయి. దీంతో సేద్యాల‌ను పూర్తి చేసుకున్నారు. ఆ త‌ర్వాత వ‌రుణుడు మొహం చాటేశారు. రుతుప‌వ‌న కాలం మొద‌లై ఇప్ప‌టికే న‌లభై రోజులు గ‌డిచిపోయాయి. అయితే ఒక్క‌రోజంటే ఒక్క రోజు కూడా చాలా చోట్ల చెప్పుకోద‌గిన వాన లేదు! దీంతో విత్త‌నం వేయ‌డానికి అనువు లేక రైతులు ఈ సారి క్రాప్ హాలిడే ప్ర‌క‌టించుకున్న‌ట్టుగా అయ్యింది. ఇది రైతులు ప్ర‌క‌టించిన క్రాప్ హాలిడే కాదు, ప్ర‌కృతే ప్ర‌క‌టించిన క్రాప్ హాలిడే అని చెప్పాలి!

అయితే గ‌త నాలుగేళ్ల‌లో విస్తారంగా కురిసిన వ‌ర్షాల పుణ్యాన చాలా మందికి క‌నీసం గ్రౌండ్ వాట‌ర్ అయినా ఉన్నాయి. బోర్ల ద్వారా పంట‌ల సాగు చేసే వాళ్లు విత్త‌నాల‌ను వేయ‌డంతో క‌నీసం కొంత మేర అయినా పంట సాగు జ‌రిగింది. అయితే ఈ ఏడాది ఇప్ప‌టి వ‌ర‌కూ క‌నీసం వ‌ర్ష‌పాతం లేక‌పోవ‌డం.. గ‌త రెండు నెల‌ల్లో రెండు సెంటిమీట‌ర్ల వ‌ర్షం కూడా లేక‌పోవ‌డంతో.. భూగ‌ర్భ‌జ‌లం విష‌యంలో కూడా ఇప్పుడు భ‌యాందోళ‌న‌లు మొద‌ల‌వుతూ ఉన్నాయి. అదునులో వ‌ర్షం లేదు. దీంతో ల‌క్ష‌ల హెక్టార్ల‌లో అస‌లు పంట సాగే లేదు. కనీసం ఇప్పుడైనా భారీ వ‌ర్షాలు కురిస్తే.. భూగ‌ర్భ‌జ‌లం అయినా పెంపొందుతుంద‌నే ఆశ‌ల‌తో ఉన్నారు రైతులు. మ‌రి లేటుగా అయినా భారీ వ‌ర్షాలు ప‌డటం మీదే ఇప్పుడు ఆశ‌ల‌న్నీ నెల‌కొన్నాయి! అది కూడా జ‌ర‌గ‌క‌పోతే మాత్రం సీమ‌లో ప‌రిస్థితి భ‌యాన‌కంగా ఉంటుంది. ప‌శువుల‌కు గ‌డ్డి దొర‌క‌డం కూడా క‌ష్ట‌మ‌య్యే ప‌రిస్థితి క‌నిపిస్తోంది.

క‌ర్నూలు జిల్లాలోనూ అదే ప‌రిస్థితి!

క‌ర్నూలు జిల్లాలో కూడా పంట‌ల సాగు దారుణ‌మైన స్థితిలోనే ఉంది. ఖ‌రీఫ్ మొద‌లై రెండు నెల‌లు గ‌డుస్తున్నా క‌ర్నూలు జిల్లాలో కూడా పంట‌ల సాగు శాతం కేవ‌లం 42 మాత్ర‌మే! నాలుగు ల‌క్ష‌ల హెక్టార్ల సాగుభూమి ఉన్న క‌ర్నూలు జిల్లా ప‌రిధిలో 1.80 ల‌క్ష‌ల హెక్టార్లలో పంట సాగు జ‌రిగింది. ప్ర‌ధానంగా వ‌ర్షాధారంగా సాగు అయ్యే క‌ర్నూలు జిల్లాలో కూడా ఈ ప‌రిస్థితి క‌నిపిస్తూ ఉంది. పంటే సాగు లేకుండా భూములు బీడు బారిన ప‌రిస్థితి కనిపిస్తోంది ఈ సీమ జిల్లాలో కూడా.

12 Replies to “ల‌క్ష‌ల ఎక‌రాల్లో పంట సాగే లేదు!”

  1. చేసుకున్నవాడికి చేసుకున్నంత మహాదేవా అని సామెత…

    బొల్లిగాడిని తెచ్చిపెట్టుకున్నారు…ఇక మంచినీళ్లు కూడా దొరకవు…

    బొల్లిగాడి ఐస్ క్రీం తినండి….సీమ ప్రజలారా.

  2. అక్కరకురాని వాన కురుస్తుంది అడవిలో…

    వాన లేని వరదలు ముంచెత్తుతాయి ఇలలో…

    రోగికి పట్టం కట్టి తెచ్చుకుంటారు చోటు యమపురిలో…

    చూపులే!ని వాడి పథకాల వేటలో ప్రజలు వంచనలో…

    తప్పదు ఈ ఖర్మ ఇంకో అర్థ దశాబ్ద కాలంలో…

  3. అక్కరకురాని వాన కురుస్తుంది అడవిలో…

    వాన లే!ని వరదలు ముంచెత్తుతాయి ఇలలో…

    రోగికి పట్టం కట్టి తెచ్చుకుంటారు చోటు య!మపు!రిలో…

    చూపులే!ని వాడి పథకాల వే!ట!లో ఆంధ్రులు వంచనలో…

    తప్పదు ఈ ఖ!ర్మ ఇంకో అర్థ దశాబ్ద కాలంలో…

Comments are closed.