ఎట్టకేలకు మీడియా ముందుకొచ్చిన రాజ్

రాజ్ తరుణ్ తనతో సహజీవనం చేసి, ఆ తర్వాత పెళ్లి చేసుకొని, గర్భం చేసి, అబార్షన్ కూడా చేయించాడంటూ లావణ్య అనే మహిళ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ వివాదం మొదలైన తర్వాత ఒక్కసారి…

రాజ్ తరుణ్ తనతో సహజీవనం చేసి, ఆ తర్వాత పెళ్లి చేసుకొని, గర్భం చేసి, అబార్షన్ కూడా చేయించాడంటూ లావణ్య అనే మహిళ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ వివాదం మొదలైన తర్వాత ఒక్కసారి మీడియా ముందుకొచ్చాడు రాజ్ తరుణ్. తను చెప్పాల్సింది చెప్పి వెళ్లిపోయాడు.

ఆ రోజు నుంచి ఈరోజు వరకు మళ్లీ మీడియా ముందుకు రాలేదు ఈ హీరో. చివరికి తన సినిమా పురుషోత్తముడు ప్రచారానికి కూడా డుమ్మా కొట్టాడు. ఎట్టకేలకు తన కొత్త సినిమా తిరగబడరా సామి ప్రచారం కోసం మీడియా ముందుకొచ్చాడు.

మొత్తం వివాదానికి కేంద్రబిందువైన హీరోయిన్ మాల్వి మల్హోత్రాతో కలిసి మీడియా ముందుకొచ్చిన రాజ్.. వివాదానికి సంబంధించి ఏం మాట్లాడాలనే అంశంపై ఫుల్ గా ప్రిపేర్ అయి వచ్చాడు. తను హిట్ కొట్టినప్పుడు కూడా ఇంతమంది మీడియా రాలేదని జోక్ చేసిన రాజ్.. దాదాపు గంట సేపు మీడియాతో మాట్లాడాడు. వివాదానికి సంబంధించి ఏం మాట్లాడాడో యథాతథంగా చూద్దాం..

– మన అమాయకత్వాన్ని అడ్వాంటేజ్ గా తీసుకునేవాళ్లు చాలామంది ఉంటారు. నేను ఎవ్వరికీ వ్యతిరేకంగా మాట్లాడ్డం లేదు. ఈ వివాదంపై లీగల్ గానే ప్రొసీడ్ అవుతా.

– నేను మనిషినే. నాక్కూడా బాధేస్తుంది. అన్ని ఆరోపణలు చేస్తే ఎవరికైనా బాధేస్తుంది. అందుకే పురుషోత్తముడు ప్రచారానికి రాలేకపోయాను. నా దగ్గర కూడా సాక్ష్యాలున్నాయి. లీగల్ గా ప్రొసీడ్ అవుతా.

– నిజజీవితంలో నాకు పెళ్లి, అమ్మాయిలు వద్దు. పొరపాటున పెళ్లి జరుగుతుందేమో నాకు తెలియదు. నాకు మాత్రం పెళ్లిపై అస్సలు ఆసక్తి లేదు. ఈమాట నేను ఇప్పుడు చెప్పడం లేదు, నా పాత ఇంటర్వ్యూల్లో కూడా మీకు కనిపిస్తుంది.

– నేను హైపర్ సెన్సిటివ్. చిన్న దానికి కూడా చాలా బాధపడతాను. ఈ వివాదంలో మొదటి రోజు నుంచి చాలా బాధపడుతున్నాను. నేను చాలా ఎఫెక్ట్ అయ్యాను. నా తల్లిదండ్రులు కూడా బాధపడుతున్నారు.

– నేను గర్భం చేసి అబార్షన్ చేయించానని ఆరోపిస్తున్నారు. మరి ఆ విషయాన్ని ఎఫ్ఐఆర్ లో ఎందుకు పెట్టలేదు? అన్ని ఆరోపణలు నిజం కావు, ఆ మాటకొస్తే అవన్నీ ఆరోపణలే. నిజాలు కావు. నా దగ్గర కూడా ప్రూఫ్స్ ఉన్నాయి. కానీ నేను వాటిని బయటపెట్టను. నా లాయర్ ద్వారా కోర్టుకు సమర్పిస్తాను.

– ఈ వివాదం నా సినీ కెరీర్ పై ఎలాంటి ప్రభావం చూపించదు. పర్సనల్ గా నేను ఎఫెక్ట్ అయ్యాను. కెరీర్ పరంగా ఎలాంటి ఇబ్బంది లేదు. నా పారితోషికంపై కూడా ఈ వివాదం ఎలాంటి ప్రభావం చూపించదు.

5 Replies to “ఎట్టకేలకు మీడియా ముందుకొచ్చిన రాజ్”

  1. రేట్ తగ్గించను , “చిల”కోట్టుడు ఆపను అని భలే బాగా సెలవిచ్చారు సారూ

  2. — పెళ్లి అనే వ్యవస్త మీద నమ్మకం లేదు..

    — వేళాపాళా వావివరసా లేకుండా పడుకుంటాం..

    — చిత్తకార్తి కుక్కకి మాకు తేడా లేదు..

    1. సుప్రీం కోర్టు వారే చెప్పారు, ఇద్దరు పెళ్లి అయినా వాళ్ళు కూడా కావాలి అంటే తమకి ఇష్టం అయిన వేరే వాళ్ళతో కలిసి వుండొచ్చు అని.

      వాళ్ళే అలా చెప్పేస్తే, జనాలు ఊరకనే వింటారా ?

      1. పెళ్లి చేసుకుంటా అని మభ్యపెట్టి కడుపులు చేస్తే అది నేరం.. అందుకే ఆమె కూడా ఆ చట్ట పరంగానే ముందుకువెళ్తోంది…

Comments are closed.