మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు ప్రతిపక్ష నేత హోదా కూడా లేకుండా చేయడం ఒక్కటే తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యంగా ఉన్నదా? అందుకోసం ఎన్ని రకాల వ్యూహాలను, ఎత్తుగడలనైనా అనుసరించడానికి వారు సిద్ధంగా ఉన్నారా? అనే అనుమానాలు ఇప్పుడు కలుగుతున్నాయి. అందితే జుట్టు అందకుంటే కాళ్లు అనే సిద్ధాంతం తరహాలో లొంగితే పార్టీలో చేర్చుకోవడం.. లొంగకపోతే ఏకంగా వారి ఎమ్మెల్యే సభ్యత్వాలనే రద్దు చేయించడం అనే ఎక్స్ట్రీమ్ నిర్ణయానికి రేవంత్ సర్కారు సిద్ధపడుతున్నదా? అనే అనుమానం కలుగుతోంది.
రేవంత్ రెడ్డి బుధవారం సాయంత్రం ఏర్పాటుచేసిన ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ కొందరు ఎమ్మెల్యేల శాసనసభ సభ్యత్వాలను రద్దు చేసే అవకాశం లేకపోలేదని ప్రకటించారు. 2018లో సభలో నిరసన తెలియజేయడంలో దూకుడుగా వ్యవహరించినందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ ల సభ్యత్వాలను రద్దుచేశారు. వారి సభ్యత్వాల రద్దు విషయంలో కాంగ్రెస్ పలుమార్లు ఆందోళనలు చేసినా.. వారందరూ సస్పెండ్ అయ్యారే తప్ప ఏం సాధించలేకపోయారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆ వ్యవహారాన్ని గుర్తు చేస్తున్నారు.
గతంలో మా వాళ్ల సభ్యత్వాలను రద్దు చేయలేదా అని అడుగుతున్నారు. కేసీఆర్ కొన్ని సాంప్రదాయాలను నెలకొల్పారు. ఏ రోజూ నన్ను సభలో కూర్చోనివ్వలేదు.. అని రేవంత్ గుర్తు చేస్తున్నారు. ఎమ్మెల్యేల సభ్యత్వాలను రద్దు చేయడం ద్వారా రేవంత్ రెడ్డి బదులు తీర్చుకోవాలని అనుకుంటున్నట్టుగా ఉంది.
గతంలో ఏకంగా 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తమలో కలిపేసుకుని ఆ పార్టీని ఖాళీ చేయించడానికి భారాస ప్రయత్నించిన సంగతి తెలిసిందే. రేవంత్ రెడ్డి ఇప్పుడు అందుకు బదులు తీర్చుకుంటున్నారు. కేసీఆర్ కు ప్రతిపక్ష నేత హోదా కూడా దక్కకుండా పోయేలాగా.. ఆ పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెసులో కలుపుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.
తమ ఆఫర్లకు లొంగిన వారినందరినీ పార్టీలో చేర్చుకుంటున్నారు. అలాగే ఇద్దరు ఎమ్మెల్యేల సభ్యత్వాన్ని అప్పట్లో రద్దుచేసినందుకు బదులుగా.. ఇప్పుడు తమ ఆఫర్లకు లొంగని గులాబీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తారా? అనే అభిప్రాయం పలువురిలో కలుగుతోంది.
KARMA RETURNS…
yes, Karma returned to congress between 2014 – 2023 for their deeds to snap MLAs from TRS and splitting that party between 2004-2009. Karma will again return to congress from 2028 for all the deeds they do between 2023-2028. KARMA RETURNS!!!
ప్రజాసంక్షేమం గాలికి వదిలేసి మ్యూజిక్ చైర్’స్ ఆట అనుకుంటున్నారు తెలుగు రాష్ట్రాలలో.
Now ppl really understand KTR capacity.. he is not eligible as CM candidate .
If there is no power then he cannot run the Party and KCR will come every 3 months once, and give one speech and he will disappear. Public will remember everything. cong party no need to do anything if BRS behave like this soon this party will disappear, and BJP will come to 2nd position until next elections.
ఆ తాగుబోతు పోశెట్టి గాడు, పుల్లగా తాగి ఫామ్ హౌస్ ఇడిసి రాడు,
ఇంకా ట్విట్టర్ టిల్లు గాడు రకుల్ రావు బాధల ట్విట్టర్ లోనే ఉంటాడు.
ఇక లిక్కర్ రాణి తీహార్ లానే ఉందిపోయిలా ఉందీ..పార్టీ బీజేపీ లో విలీనం అయ్యేలా ఉంది