చాలామంది ఎమ్మెల్యేల మాదిరిగానే గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గులాబీ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరాడు. ఈ కాలంలో పార్టీ ఫిరాయింపులను ఎవరూ తప్పుపట్టడం లేదు కాబట్టి ఈయన చేసిందీ తప్పుకాదు. కానీ కాంగ్రెస్ పార్టీలో చేరిన ఇరవై నాలుగు రోజుల్లోనే తాను తప్పు చేశానని అనుకున్నాడో ఏమో మారు మనసు పొంది తిరిగి గులాబీ పార్టీలోకి వెళ్ళాడు.
గుడ్… బాగానే ఉంది. పార్టీ నుంచి వెళ్ళిపోయినవారిని మళ్ళీ పార్టీలో చేర్చుకునే ప్రసక్తే లేదని కీలక నాయకులు గంభీరంగా ప్రకటించారు. వాళ్ళు అలా ప్రకటించారుగానీ వెళ్ళినవారు తిరిగొస్తే బాగుంటుంది అని అనుకుంటారు.
అలాగే గద్వాల ఎమ్మెల్యే తిరిగి గులాబీ పార్టీలో చేరినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. తిరిగి బీఆర్ఎస్ లో చేరినట్లు ఆయన ప్రకటించాడట! కానీ ఆయన విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు. గులాబీ పార్టీలో చేరినట్లు ప్రచారం జరిగాక అసెంబ్లీకి రాలేదు. తన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసుకొని ఉన్నాడు.
మరి ఆయన ఇలా ఎందుకు వ్యవహరిస్తున్నాడో అర్థం కాక ఆయన అనుచరులు, కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నారట. ఆయన భయపడుతున్నాడా? మరేదైనా వ్యూహం ఉందా? ఏదో ఒక పార్టీలో స్థిరంగా ఉండొచ్చు కదా. పార్టీ మారిన నెల రోజుల్లోగానే మళ్ళీ వెనక్కి రావడం ఏమిటో! రాజకీయ నాయకులు చిత్ర విచిత్రంగా వ్యహరిస్తుంటారు.
beram kudaraledu………. Auction lo pettaari ee MLA ni. TRS or Congress, evaru ekkuva padukunte aa party ki vellipovadame.
బాగుంది “భో” gandi
Vyuham ledhu bokka ledhu gadwal lo aayana party maraadu kaani cadar maaraledhu grama sthayilo meeting jarupu kunnaru cadar
Congress lo saritha lead chestundhi akkada aame allow cheyatledhu
Atu itu kakunda potha ani malli brs vachadu this is truth