ఏం చేసినా… రెడ్‌బుక్ ఖాతాలోకే!

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రాజ‌కీయ హ‌త్య‌ల్ని ఆప‌లేరా? ఇంకా ఎంత కాలం ఇలాంటి హింసాయుత ఘ‌ట‌న‌లు? ఒక‌వైపు ఏపీలో రెడ్‌బుక్ రాజ్యాంగం ప్ర‌కారం పాల‌న సాగుతోంద‌ని దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశ‌మైన ద‌శ‌లో, ప్ర‌భుత్వ తీరులో మార్పు రాక‌పోవ‌డం…

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రాజ‌కీయ హ‌త్య‌ల్ని ఆప‌లేరా? ఇంకా ఎంత కాలం ఇలాంటి హింసాయుత ఘ‌ట‌న‌లు? ఒక‌వైపు ఏపీలో రెడ్‌బుక్ రాజ్యాంగం ప్ర‌కారం పాల‌న సాగుతోంద‌ని దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశ‌మైన ద‌శ‌లో, ప్ర‌భుత్వ తీరులో మార్పు రాక‌పోవ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది. రాయ‌ల‌సీమ‌లో రాజ‌కీయ హ‌త్య‌ల్ని మ‌రిచిపోయిన నేప‌థ్యంలో వైసీపీ కార్య‌క‌ర్త సుబ్బ‌రాయుడి చావును ఎలా చూడాలి?

పైగా అడ్డ‌మొస్తే పెట్రోల్ పోసి త‌గ‌ల‌బెడ‌తామ‌ని పోలీసుల్ని టీడీపీ నాయ‌కులు హెచ్చ‌రించ‌డం శాంతిభ‌ద్ర‌త‌ల‌పై భ‌య‌పెడుతోంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. గ‌తంలో చంద్ర‌బాబునాయుడి పాల‌నలో శాంతిభ‌ద్ర‌త‌ల‌కు పెద్ద‌పీట వేసేవారనే పేరు వుంది. ఇప్పుడు బాబు వైఖ‌రిలో మార్పు వ‌చ్చిందా? లేక ఆయ‌న చేతుల్లో అధికారం లేదా? అనే అనుమానం త‌లెత్తుతోంది. బాబు పేరుతో మ‌రెవ‌రో పాలిస్తున్నారనే చ‌ర్చ జ‌రుగుతోంది.

చాలా కాలంగా లోకేశ్ రెడ్‌బుక్ గురించి మాట్లాడుతున్నారు. కూట‌మి అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి రెడ్‌బుక్ పాల‌న ప్రారంభ‌మైంద‌నే మాట వినిపిస్తోంది. పేరుకే చంద్ర‌బాబు సీఎం, పెత్త‌నం అంతా లోకేశే చేస్తున్నార‌ని టీడీపీ నాయ‌కులు అంటున్నారు. అందుకే శాంతిభ‌ద్ర‌త‌ల విష‌యంలో బాబు పాల‌న విమ‌ర్శ‌ల్ని ఎదుర్కోవాల్సి వ‌స్తోంద‌ని టీడీపీ నాయ‌కులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.

లోకేశ్ రెడ్‌బుక్ నినాదాన్ని కొంద‌రు టీడీపీ నాయ‌కులు వ్య‌క్తిగ‌త క‌క్ష తీర్చుకోడానికి వాడుకుంటున్నారు. ఏం చేసినా రెడ్‌బుక్ ఖాతాలోకే వెళ్తాయ‌నేది వారి ఎత్తుగ‌డ‌. ప్ర‌స్తుతం అదే జ‌రుగుతోంది. కూట‌మి స‌ర్కార్‌కు చెడ్డ‌పేరు వ‌స్తోంది. నిలువ‌రించే ఆలోచ‌న కూడా లేన‌ట్టుంది. పోలీసులు ఏమీ చేయ‌లేని నిస్స‌హాయ స్థితిలో వుండిపోతున్నారు.

గ‌తంలో వైసీపీ ప్ర‌భుత్వంలో వారు అలా చేశారు, ఇలా చేశార‌నే వాద‌న తెర‌పైకి వ‌స్తోంది. అందుకే వైసీపీ దారుణ ప‌రాజ‌యాన్ని పొందార‌నే సంగ‌తిని మ‌రిచిపోతున్నారు. తాము కూడా వైసీపీ మార్గంలో ప‌య‌నించాల‌ని అనుకుంటే , వాళ్లిష్టం. కానీ ప్ర‌స్తుతం అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌లు చోటు చేసుకుంటున్నాయి. ఎంత త్వ‌ర‌గా వీటికి ముగింపు ప‌లికితే టీడీపీకి అంత మంచిది.

20 Replies to “ఏం చేసినా… రెడ్‌బుక్ ఖాతాలోకే!”

  1. కర్మ is returning back.. RED BOOK మీద చాలా మంది, చాలా లేకి గా మాట్లడి, ఇప్పుడు కనిపించకుండా ఎక్కడెక్కడో దాక్కోన్నారు . RED బుక్ లో ఇంకా first పేజీ కూడా open చేయలేదు, అప్పుడే 11 అధినేతే లంగాగాడిలా గగ్గోలు పెడుతు, ఆర్తనాదాలు చేసుకుంటూ ఢిల్లీ, బెంగళూరు కి పారిపోతున్నాడు.. ఇక పార్టీ క్యాడర్ కి ఏమీ భరోసా ఇస్తాడు ల0గా’ నాకొ’డుకు.

    అసలైన నాకొ’డుకు లు ఎక్కడ daakkunnaaru రా??

  2. అదేనయ్యా, సినిమా లో వెయ్యరు – “అయిదు ఏళ్ళ తరువాత అని”, కానీ గత రెండు నెలల నుండి ఎంతో ప్రశాంతంగా ఉంది రాష్ట్రం. ఐయిదు ఏళ్ళ ఫ్లాష్ బ్యాక్ గుర్తు చేసి అల్లకల్లోలం సృస్టించకు జిఎ.

  3. గత 5 సంవత్సరాలుగా, GA ఎప్పుడూ ఇలా వ్రాయలేదు. పైగా జగన్‌కు మద్దతిచ్చింది.

    .

    RRRని చావ బాదినప్పుడు.. మీరు RRR ని ఎగతాళి చేసారు, పరోక్షంగా ఆ పనిని సమర్దించారు.

    .

    ఈరోజుకీ TDP వైసీపీ మాజీ ఎమ్మెల్యేలను, మంత్రులను ఇతర నేతలను వేధించలేదు!

    .

    సిబిఎన్, అచ్చం నాయుడు, దూళిపాళ నరేంద్ర కుమార్, కూన రవీంద్ర, కోడెల శివ ప్రసాద్, అయ్యన్న పాత్రుడు, నారాయణ, జెసి సోదరులు, బోండా ఉమ, పట్టాబి, సుబ్బం హరి, జివి హర్ష కుమార్, ఆంధ్రజ్యోతి, రామోజీ, జర్నలిస్టు మూర్తి, వెంకట కృష్ణ, డాక్టర్ సుధాకర్‌ , రంగనాయకమ్మలను చూడండి. ఎంత గా వెదించారొ తెలుసుంది.

  4. శవం లేచింది..మరి A1 రాబందు ఎప్పుడు వాలుతుంది??

    పులి రా.. పులి పులి.. పులి రా..RED BOOK భయం తో Bangalore పారిపోయిన పులి రా..

  5. నాన్న పులి కథ గుర్తుందా G .A . ..? అబద్దాలు చెప్పేవాడి మాటలు ఒకసారే నమ్ముతారు జనాలు ..

  6. 5 ఏళ్లుగా మానభంగాలు , పెట్రోల్ పోసి తగల పెట్టటలు హ త్య లు చేసింది వై చీపి నాయకులు, డోర్ డెలివరీ లు చేయించారు, 1ఇయర్ అవ్వి రిటర్న్ ఇచ్చేసి తరువాత మైంటైన్ చేస్తాము లా అండ్ ఆర్డర్ .. ముసుకు కూర్చోండి రా ప్రెటీమ్ డా గ్స్

  7. ఇది కూడా 36 హ త్యల లాంటిదేనా లేక పోలీసు రిపోర్ట్, fir లాంటివేమ8న వున్నాయి. ఫేక్ పార్టీ, ఫేక్ న్యూస్…

  8. వై చీపి అధికారంలో ఉందని రెచ్చిపోయిన వాళ్లకి ఇప్పుడు అధికారం మాది అని రెచ్చిపోయి ఇలా చేసుకుంటున్నారు దీనికి పార్టీలతో సంబంధం లేదు ఎవరు చేసిన కర్మ వాళ్ళు అనుభవించక తప్పదు.

  9. వాడు లేపేసిన బాబాయి హ త్య నే టీడీపీ ఖాతాలో వేసాడు. ఇంకా సామాన్య కార్యకర్తల చా వు లు కూడా టీడీపీ/రెడ్ బుక్ ఖాతాలో చూపించారని ఎవరు అనుకున్నారు..

  10. ఇది కొచం లోకేష్ గారికి చెడ్డ పేరు తెచ్చేలా వుంది. లోకేష్ ఎం చెప్పారు- రెడ్ బుక్ అనేది చట్ట బద్దమైన శిక్ష కోసం అని. ఇలా టీడీపీ క్యాడర్ చేసే పనులు అన్ని లోకేష్ గారి ఖాతా లో వెయ్యటం మంచిది కాదు.

Comments are closed.