దర్శకుడు డిజాస్టర్ ఇచ్చాడు. ప్రశ్నిస్తే ఫ్రెండ్ అంటున్నారు. బయ్యర్లు ఆరిపోయారు. అడిగితే వాళ్లను ఆదుకుంటాం అంటున్నారు. కోట్లు నష్టపోయినా మీరుమీరు బాగానే ఉన్నారు. మరి ఎండ్-యూజర్ పరిస్థితేంటి? అదేనండి, ప్రేక్షకుడి సంగతేంటి?
మీరు సినిమాలు తీస్తూనే ఉంటారు, ఫ్లాపులు ఇస్తూనే ఉంటారు. అది మీ ఇష్టం. మీ దగ్గర డబ్బుంది తీస్తారు, ప్రేక్షకుల మీదకు వదుల్తారు. కానీ అలాంటి సినిమాలన్నింటినీ చూసేంత డబ్బు ప్రేక్షకుడి దగ్గర ఉండాలి కదా.
మీరు పోగొట్టుకున్న డబ్బు ఏదో ఒక రూపంలో తిరిగి మీ దగ్గరకొస్తోంది. మరి ప్రేక్షకుడు పోగొట్టుకున్న డబ్బు తిరిగి అతడి జేబులోకి రావడం లేదేంటి? అంటే… ఫ్లాపులు తీసి మీరు పాఠాలు నేర్చుకుంటారు, అలా మీరు నేర్చుకోవడానికి ప్రేక్షకుడు ఖర్చయిపోతుంటాడు. ఇదే కదా మేజిక్కు.
నేర్చుకోవడానికి కూడా ఓ హద్దు ఉంటుంది. మార్చి నెల వస్తే పరీక్షలు పెట్టి పిల్లాడు ఎంత నేర్చుకున్నాడో అంచనా వేస్తారు. ఇంక్రిమెంట్ టైమ్ వచ్చేసరికి ఉద్యోగి ఎంత పనితీరు కనబరిచాడో అంచనా వేస్తారు. మరి ఫ్లాపులు తీసి నేర్చుకునే ప్రక్రియలో అంచనా కట్టడం ఎలా?
ఇన్ని ఫ్లాపులు తీస్తే ఇంత నేర్చుకోవచ్చు అనడానికి ఏమైనా కొలమానం ఉందా? లేక ఎవరు ఎక్కువ ఫ్లాపులు తీస్తే వాళ్లు ఎక్కువ నేర్చుకున్నట్టా..? అలా అయితే వరుసగా హిట్లు ఇస్తున్న రాజమౌళి కంటే, ఏకథాటిగా ఫ్లాపులిస్తున్న కొంతమంది దర్శక-నిర్మాతల దగ్గరే జ్ఞానం ఎక్కువ ఉందన్నమాట.
మరి అలా కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి, ఫ్లాపులు తీసి సముపార్జించిన ఆ జ్ఞానంతో వాళ్లు ఏం చేస్తున్నారు? అలా నేర్చుకున్న విషయాలతో ఓ బ్లాక్ బస్టర్ తీయొచ్చు కదా… ఆ పని మాత్రం చేయరు. ఇంకా ఫ్లాపులిస్తూనే ఉంటారు.. నేర్చుకుంటూనే ఉంటారు. ఎంత నేర్చుకుంటే అంత జ్ఞానం, హిట్ సినిమా ఎవడిక్కావాలి!
బొత్స , జగన్ రెడ్డి , నంద్యాల శిల్పా రెడ్డి వంటి బినామీలు ఉన్నంత కాలం నేర్చుకుంటూనే ఉంటారు
Anni cheppi asalaina perlu chandram tata, lokesh, pawanam perlu chala convenient ga marchipoyaru…..
Call boy jobs available 8341510897
same logic elections ki kuda apply chesko…
Elections lo voters dabbulu techhukuntunaru, cinemalaki dabbulu karchu pedatarau…… Both are not same bro
Meeku logic ardham kaaledhu le bro… Leave it…
vc estanu 9380537747
waste
జనాలు థియేటర్ లో సినిమా చూడడం మానేసి… OTT లో చూస్తే సరి. అయినా ఎవడూ ప్రేక్షకుడి తల మీద గన్ పెట్టి చూస్తావా ఛస్తావా అని అడగట్లేదుకదా…
ఎదో ఒక ఏడుపు ఏడవకపోతే తిన్నది ఎలా అరుగుతుంది
ప్రతీ సినిమా థియేటర్ ఎక్స్పీరియన్స్ అవసరంలేదు . సినిమా మింగినా తీసినవాళ్ళకేం ఉడలేదన్నావ్ . పోయి పూరీ గారిని కదిలించు ఎంత బాకీ ఉన్నాడో కూడా చెప్పలేడు . ప్రతీ సినిమా బాగుందిద్దేమోనని ప్రేక్షకుడు వెళ్ళడు
హ హ హ…
జనాలకి జ్ఞానం వచ్చింది. కాబట్టే థియేటర్లో చూడట్లేదు
ఎవడు చూడమన్నాడు సినిమా. ఆడియన్స్ ఎగేసుకెళ్ళి వందల రూపాయిలు తగలేసి సినిమాలు చూస్తున్నారు కాబట్టే ఆ చెత్త ఎదవలు సినిమాల పేరుతో వ్యాపారం చేస్తున్నారు.