‘హైడ్రా’పై కాషాయం నాయకుల భిన్న వైఖరులు!

రాజకీయ పార్టీలు తమకు కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయని చెప్పుకుంటాయి. కానీ నిజానికి అవేమీ ఉండవు. ఒకప్పుడు సిద్ధాంత బలం ఉన్న పార్టీ అని చెప్పుకున్న కాషాయం పార్టీ అంటే బీజేపీకి కూడా మోడీ, అమిత్…

రాజకీయ పార్టీలు తమకు కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయని చెప్పుకుంటాయి. కానీ నిజానికి అవేమీ ఉండవు. ఒకప్పుడు సిద్ధాంత బలం ఉన్న పార్టీ అని చెప్పుకున్న కాషాయం పార్టీ అంటే బీజేపీకి కూడా మోడీ, అమిత్ షా హయాంలో అవేం లేకుండా పోయాయి.

పార్టీకి ఒక సిద్ధాంతం, ఏదైనా అంశంపై ఒక అభిప్రాయం ఉన్నప్పుడు నాయకులు రకరకాలుగా ఎలా మాట్లాడతారు? కానీ ఇప్పుడు తెలంగాణలో ప్రధానంగా సంచలనంగా మారిన, ప్రకంపనలు సృష్టిస్తున్న “హైడ్రా” (డిజాస్టర్ రెస్పాన్స్ ఆసెట్స్ ప్రొటెక్షన్ మానిటరింగ్ ఏజెన్సీ) మీద బీజేపీ నాయకులు భిన్న వైఖరులు వ్యక్తం చేస్తున్నారు.

ఎవరికీ తోచిన అభిప్రాయం వారు చెబుతున్నారు. అంటే దీని మీద పార్టీకి ఒక విధానం లేదని అర్థమవుతోంది. భిన్న వైఖరులు వ్యక్తం చేస్తున్న నాయకులు కేంద్రమంత్రి, పార్టీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అండ్ మెదక్ ఎంపీ కమ్ లాయర్ అయిన రఘునందనరావు. హైడ్రా అనేది పెద్ద డ్రామా అని కిషన్ రెడ్డి అంటున్నాడు.

అక్రమ నిర్మాణాలు కూలగొడుతూ హైడ్రా చేస్తున్న పని మంచిదేనని రఘు అంటున్నాడు. గతంలో అక్రమ నిర్మాణాలు అనుమతులు ఇచ్చిన ప్రభుత్వమే ఇప్పుడు వాటిని కూల్చేస్తోందని కిషన్ రెడ్డి తప్పు పడుతున్నాడు.

కానీ ఇప్పటివరకు కూల్చిన చాలా నిర్మాణాలకు అనుమతులు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినవే. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కాదు కదా. గులాబీ పార్టీ పదేళ్ల పాలనలో అనేక అక్రమ నిర్మాణాలు జరిగాయి. అనేక అక్రమాలు జరిగాయి. తెలంగాణ ఏర్పడగానే అధికారంలోకి వచ్చిన కేసీఆర్ తానో పెద్ద నిజాయితీపరుడిలా బిల్డప్ ఇచ్చాడు.

అయ్యప్ప సొసైటీలో అక్రమ నిర్మాణాలను కూల్చిపారేస్తానని పెద్ద హడావిడి చేశాడు. అక్రమాలను సహించనన్నాడు. కానీ ఏమీ చేయలేదు. చెరువులను కాపాడలేదు. ఇప్పుడు కూల్చేసిన నాగార్జున ఎన్-కన్వెంక్షన్ అక్రమ నిర్మాణమని కేసీఆర్ దృష్టికి వచ్చినా అటువైపు చూడలేదు.

దాన్ని కూల్చడం కరెక్టేనని రఘునందన్ రావు సమర్ధించాడు. హైడ్రాకు పూర్తిగా మద్దతు పలికాడు. కానీ కిషన్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం మీద వ్యతిరేకత చూపించాడు. సరే …ఎవరి అభిప్రాయాలు ఎలా ఉన్నా ప్రజలు మాత్రం హైడ్రాకు బ్రహ్మరథం పడుతున్నారు.

9 Replies to “‘హైడ్రా’పై కాషాయం నాయకుల భిన్న వైఖరులు!”

  1. 2014 ఎన్నికల ఫలితాల ముందు, గుజరాత్ లో జరిగిన అభివృద్ధి అకస్మాత్తుగా గుర్తుకొచ్చి, నాగార్జున అక్కడ పర్యటించి అభినందించాడు, అందుకే కాబోలు కోర్ బీజేపీ ‌నేతలకు అక్కడ అక్రమణ కనిపించడం లేదు. రఘునందన్ కి ఇలాంటి బ్యాగేజీ ఏమీ లేనట్లుందు, అందుకే లాజికల్ గా మాట్లాడాడు.

  2. రఘునందన్ ఒక typical తెలంగాణా వాది, అన్నీ ఆ అద్దాల తోనే చూస్తాడు.

  3. కాంగ్రెస్ పార్టీ తెలంగాణా లో హైదరాబాద్ లో అక్రమంగా నిర్మించాడని నాగార్జున N కన్వెన్షన్ సెంటర్ ని కూలగొట్టింది, వెరీ గుడ్, వెల్ డన్, మరి మన రామోజీ ఫిలిం సిటీ కూడా అదే category అని కెసిఆర్ 2014 ముందు చెప్పేవాడు. ఇలానే 2015 లో కెసిఆర్ హడావిడి చేసి సినిమా వాళ్ళ దెగ్గర , రియల్ ఎస్టేట్ వాళ్ళ దెగ్గర, drug dealers దెగ్గర settlement చేసుకున్నారని అందరు అనేవారు , ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా సమె రూట్ లోనే వెళ్తుందా లేక రామోజీ ఫిలిమ్ సిటీ, ఇంకా ఓల్డ్ సిటీ లో చాల ఉన్నాయట వాటి సంగతి కూడా చూస్తారా ? చూద్దాం !

Comments are closed.