జలవిహార్, నెక్లస్ రోడ్ కూల్చేస్తున్నారా?

తాము ఉంటున్న ఇల్లో, అపార్ట్మెంటో చెరువు స్థలమా, లేక భుత్వ భూమా అని వాకబు చేసుకుంటున్నారు.

కరోనా వచ్చినప్పుడు మొదట్లో లాక్ డౌన్ అనగానే చాలామంది సంబరపడి ఇంట్లో ఎంజాయ్ చేసారు. ఆ వైరస్ తమనేం చేయదులే అనే ధీమాలో ఉన్నారు కొన్ని రోజులు. తమ ఊళ్లో కరోనా చావు వార్త విని కొందరు భయపడ్డారు. అయినా తమదాకా రాదులే అని కొందరు ఎంజాయ్మెంట్ అలాగే కంటిన్యూ చేసారు. తమ పేటలోకి, వీధిలోకి, తమ ఇంటి పక్కకి కూడా కరోనా వ్యాపించేసరికి అందరూ భయంతో వణికిపోయారు. ఇక సెకండ్ వేవ్ అయితే చెప్పక్కర్లేదు. కామెడీగా మొదలైన సీన్ హారర్ గా మారింది.

ప్రస్తుతం హైదరాబాద్ వాసులకి హైడ్రా వార్తలు తప్ప మిగతావి పెద్దగా పట్టడంలేదు. తొలుత నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ పడగొట్టినప్పుడు అదేదో సరదా వార్తలా చూసిన జనం నెమ్మదిగా విషయం బోధపడి అనుమానాలతోనూ, భయంతోనూ నిద్రలేకుండా ఉంటున్నారు.

తాము ఉంటున్న ఇల్లో, అపార్ట్మెంటో చెరువు స్థలమా, లేక దశాబ్దాల క్రితం ప్రభుత్వ భూమా అని వాకబు చేసుకుంటున్నారు. నేటి వరకు ఎటువంటి లిటిగేషన్ లేని ల్యాండ్ అని వారికి తెలిసినా అకస్మాత్తుగా అధికారులు వచ్చి ఏదో మ్యాపో, రికార్డో చూపించి ఇది ప్రభుత్వస్థలం అంటారేమోనన్న భయాలు మొదలయ్యాయి. తాజా పరిణామాలు అలానే ఉన్నాయి మరి.

దానికి తోడు కొన్ని వార్తా చానల్స్ ప్రజల్ని మరింత భయభ్రాంతులకి గురిచేస్తున్నాయి. “ఏ సమయాన్నైనా మీ వీధిలోకి బుల్డోజర్లు రావచ్చు. ఇప్పటి వరకు మీ ఇల్లు సమస్యలో ఉందని మీకు తెలియకపోవచ్చు. మిమ్మల్ని ఇంట్లోంచి బయటికి లాగి, సామాన్లు పాడేసి ఇల్లు కూల్చేయొచ్చు” అనే విధంగా వార్తలు చదువుతున్నాయి కొన్ని చానల్స్. రాయదుర్గంలో 1943 నుంచి ఉంటున్న ఇల్లని చెప్పుకుంటున్న ఒక దానిని అధికారులు నేలమట్టం చేసారు. అక్కడ బాధితులు చెప్పింది ఇదే. పొద్దున్నే 7 గంటలకి పోలీసులు, బుల్డోజర్లు, అధికారులు వచ్చి నిద్రలేపి..నిద్రపోతున్న పిల్లలని కూడా బయటకు రమ్మని, సామాను బయట పాడేసి కళ్ల ముందే ఇల్లు కూల్చేసారని చెప్తున్నాడు బాధితుడు.

ఇలాంటి సీన్లు చూసి, “సత్వరన్యాయం అంటే ఇదే”..అని ఈ సమస్యలో లేని వాళ్లు చాలామంది అనుకోవచ్చు. కానీ ఇలాంటి చర్యలతో సత్వరన్యాయం మాట అటుంచి శాశ్వత అన్యాయం జరిగే అవకాశం కూడా లేకపోలేదు. ఎందుకంటే ఏళ్ల తరబడి ఆస్తిపన్ను కడుతూ, వాటర్ బిల్ కడుతూ, ఇంటి ముందు ప్రభుత్వమే రోడ్లేస్తుంటే మురిసిపోతూ ఉన్న సగటు సామాన్య పౌరులకి ఒక్కసారిగా అదే ప్రభుత్వం వచ్చి ఇల్లు కూలుస్తానంటే ఎలా ఉంటుంది? తాను ఫ్లాట్ లేదా స్థలం కొన్నప్పుడు అన్ని శాఖలూ క్లీన్ చిట్ ఇచ్చాక కొని ఉంటాడు. దశాబ్దాలుగా అక్కడొక ఇల్లు కట్టుకుని ఉంటాడు. ఇప్పటికిప్పుడు వచ్చి ఆ అనుమతులన్నీ అక్రమమైనవి, ఇక్కడి నుంచి పో..కూల్చేయాలి అంటోంది ప్రభుత్వం. నిజమైన, ఉద్దేశపూర్వకమైన కబ్జాల కన్నా ఇటువంటి దయనీయ గాధలే ఎక్కువుంటాయి.

ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా నమ్ముకునేది న్యాయస్థానాలనే. ఇంతకీ న్యాయస్థానం ఏమంటుంది? పోరాడితే ఫలితముంటుందా? అసలు పోరాడేంత సమయముంటుందా?

నాగార్జునకి కూడా కొంప కూలాక స్టే ఆర్డర్ వచ్చింది. హైడ్రా దూకుడు ఆ రేంజులో ఉంది. నాగార్జునది కబ్జా అని హైడ్రా అన్నా, ప్రజలంతా అనుకున్నా… కోర్ట్ గతంలో ఇచ్చిన తీర్పు ప్రకారం ఒక్క అంగుళం కూడా కబ్జా కాలేదని. మరి అలాంటప్పుడు హైడ్రా చర్య తప్పా, ఒప్పా అనేది తేల్చాసింది కోర్టే తప్ప మీడియా చానల్సో, ప్రజలో కాదు.

ఇంతకీ తాజాగా హైకోర్ట్ హైడ్రాకు కొన్ని నిర్దేశకాలు చేసింది.

కూల్చే ముందు కబ్జాదారుల టైటిల్ పరిశీలించాలట. ఆ తర్వాత అక్రమంగా జీ.హెచ్.ఎం.సి, గ్రామ పంచాయత్, మునిసిపాలిటీల నుంచి తెచ్చుకున్న అనుమతుల తాలూకు కాగితాలన్నీ సేకరించాలట. 60 నుంచి 100 చదరపు గజాల కబ్జాదారుల్ని, ఎకరాల లెక్కలో కబ్జా చేసిన వారిని ఒకేలా పరిగణించాలట. 19.7.2024 నాటి ప్రభుత్వ జీవో నంబర్ 99 లో ఉన్న నిబంధనలు పాటించాలట. అన్ని పద్ధతులు పాటించే చర్యలు తీసుకుంటున్నారు అని ప్రజలు అనుకుని, రాష్ట్రంపై నమ్మకం కలిగి ఉండేలా వారినుంచి ముందుకు వెళ్లాలట.

స్థూలంగా కోర్ట్ చెప్పిన అంశాలు ఇవి. అంటే, బడా బాబుల్ని, సామాన్య పౌరుల్ని అందర్నీ ఒకేలా ట్రీట్ చేసి కూలగొట్టమని చెప్పినట్టే అర్ధమవుతోంది. ఇంతకీ పైన చెప్పుకున్న అంశాల్లో జీవో 99లో ఏముందంటే జీ.హెచ్.ఎం.సి, రెవెన్యూ, ఇరిగేషన్ శాఖలతో అనుసంధానంలో ఉంటూ చర్యలు తీసుకోమని ఉంది.

ఎలా చూసుకున్నా న్యాయస్థానం కూడా ఈ విషయంలో కఠినంగానే ఉందని తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో ఎవరైనా కేసులు వేసినా అసలు కోర్ట్ తీసుకుంటుందో తీసుకోదో కూడా తెలియడంలేదు చాలామందికి.

ఈ లెక్కలో హైదరాబాదులో ఇల్లు కొనాలన్నా భయపడే పరిస్థితి నెలకొని ఉంది. కొనేవరకు అన్ని కాగితాలు చేతిలో ఉండి, కొన్నాక అధికారులొచ్చి అవన్నీ అక్రమమైన అనుమతులు అంటే చేసేదేంలేదు.

ఇంటి ఓనర్లు పడే టెన్షన్లని చూస్తూ అద్దెలకి ఉంటున్న వాళ్లు ఎంజాయ్ చేస్తున్న సమాజం కూడా కనిపిస్తోంది. ఒకడి కష్టం మరొకడికి వినోదం అన్నట్టుగా తయారయింది. కబ్జాలని కచ్చితంగా అరికట్టాలి. కానీ అమాయక బాధితులకి ప్రత్యామ్నాయం చూపాలి. కనీసం ఆ విషయంలోనైనా ప్రభుత్వం, న్యాయస్థానం బాధితులపై కరుణ చూపుతుందేమో అని కొందరు ఆశిస్తున్నారు.

ఇదిలా ఉంటే ఎఫ్.టి.ఎల్ పరిధిలో ఉన్న నెక్లెస్ రోడ్ మొత్తం కొట్టేయాలని ఒవైసి అంటున్నాడు. అంతే కాదు సంజీవయ్య పార్క్, జలవిహార్ (ఎన్ కన్వెన్షన్ లాంటి ఫంక్షన్ హాల్), లుంబిని పార్క్, థ్రిల్ సిటీ, కొత్తగా కట్టిన సెక్రటేరియేట్, ఎన్.టి.ఆర్ సమాధి, అంబేద్కర్ విగ్రహం, పీవీ సమాధి..ఇవన్నీ కూడా ఎఫ్.టి.ఎల్ లేదా బఫర్ జోన్ లో ఉంటాయట పాత హుసేన్ సాగర్ లెక్కల ప్రకారం. మరి అవన్నీ కూడా కూల్చేస్తారా అని ప్రజలు అడుగుతున్నారు. ఏం జరుగుతుందో చూడాలి.

శ్రీనివాసమూర్తి

28 Replies to “జలవిహార్, నెక్లస్ రోడ్ కూల్చేస్తున్నారా?”

  1. BRS built Hyderabad brand image for 10 years. RR damaging it totally. Arey Congress luchas, name one project you built in the last 10 months? Emanna panikocche pani okatanna chesarra? Ee Hydra commissioner ni chooshte jaali vesthundi. Poorvam Stalin gaadu ilane nacchollani andarini lepese pani okadi icchi chivariki vaadu tappu gaa lepesadu ani mudra esi vaadine lepesadu. chivariki bali ka bakra ayyedi ee officers ye.

  2. BRS built Hyderabad brand image for 10 years. RR damaging it totally. Arey Congress jokers, name one project you built in the last 10 months? Emanna panikocche pani okatanna chesarra. Ee Hydra commissioner ni chooshte jaali vesthundi. Poorvam Stalin gaadu ilane nacchollani andarini lepese pani okadi icchi chivariki vaadu tappu gaa lepesadu ani mudra esi vaadine lepesadu. chivariki bali ka bakra ayyedi ee officers ye.

  3. BRS built Hyderabad brand image for 10 years. RR damaging it totally. Ee Hydra officers ni chooshte jaali vesthundi. Poorvam Stalin gaadu ilane nacchollani andarini lepese pani okadi icchi chivariki vaadu tappu gaa lepesadu ani mudra esi vaadine lepesadu. chivariki bali ka bakra ayyedi ee officers ye.

      1. Ponds kabja is the not the main issue. Main issue and the reason for hyderabad’s overflowing roads during monsoon are musi river kabja and no drain infrastructure to take all the water to musi or other rivulets to dump and make sure that water flows outside the city. If you are still thinking of using ponds for water management then you are living in stone ages. Hyderabad is now a city of 1.5 crore people, it is no longer some 60000 resident living upgraded village of the early 18th century. Now sit in your car and cry.

        1. అనేక చోట్ల సముద్రం ఉన్న ముంబై లో ఈ వానలు, వరదలు ముంపు సమస్య వస్తున్నది. ఇక చెరువులు ఉంటే సమస్య రాకుండా పోతుందా?

  4. మధ్యం దొర ఫార్మ్ హౌస్ కూడా చెరువు మీదనే కట్టారు అంట కదా. దాని నీ అంటుకుంటే , ఆ సాకుతో మర్ల రాజకీయంగా బలపడతాడు ముక్కు దొర. అందుకే ఆ ఫార్మ్ హౌస్ జోలికి వెళ్ళడం లేదు.

  5. నిజమే కదా..ప్రస్తుత నిబంధనల ప్రకారం హుస్సేన్ సాగర్ చుట్టుపక్కల అన్నీ అక్రమ నిర్మాణలే. బోట్స్హో క్లబ్, మారియట్,ఐమాక్స్,మక్త,, ఫ్లై ఓవర్ ఇవేవీ ఇందుకు మినహాయింపు కాబోవు.

  6. We have to amend registration act which is no way useful to public it is only for paying registration fee they are not where concerned with clarity of title. By taking additional amount of fee they have to ensure correctness of title before registration, this will avoid these things.

  7. Koolchaka enti.. main common man paristiti enti.. ex. N convention permissions Anni congress govtlone ayyai. Mari a misisters and officers meeda emaina charyalu untaya.. clarity lekunda media focus kosam Mr note for vote chestunna drama la undi.. idi cinema kadu ani telusukovli.. public lo clarity tho unna statements ivali on plan of action.

  8. Lot of ponds were cruelly occupied by greedy man.as a result for small rain the water coming on to roads. Govt doing right thing.Revanth ahs guts to face this.Revanth is true leader . Just wait and watch

  9. Govt doing right thing .we must protect our ponds and rebuilt them.not only that we need to penalize the officers who gave permissions . Right move great move by revanth

    1. తన దాకా వచ్చే దాకా కాని తెలియదు ఇలాంటి వాటి విషయం! ఇప్పుడు పదేళ్ల లోపు కొనుక్కున్న వాడికి అక్కడ చెరువు ఉందో ఇంకో లి్టిగేషన్ ఉందో ఎలా తెలుస్తుంది?

  10. ఒకప్పుడు హైదరాబాద్ మొత్తం చాలా చెరువులు ఉండేవి.. ఈ రోజు చాలా మాయం అయిపోయాయి.. మిగిలినవి 90 శాతం ఆక్రమించబడ్డాయి… ఈ డిజిటల్ యుగం లో అన్నీ ఆన్లైన్ లో పెట్టి అసలు ఏ స్థలం ఎటువంటిది అన్నది స్పష్టం చెయ్యాలి.. కానీ వాటికి పర్మిషన్ అన్నది లేకుండా చూడాలి…

    1. Appudu population entha ippudu population entha? 1980 India population 70 kotlu. Ippudu 150 kotlu. Mari intha mandiki illu vakili kaavali ante land ekkada vundi raa abbai. forests kottakoodadu, ponds alane vundaali ante mundu population control lo vundaali. adi lekunda edisthe emiti labham ra sunta.

  11. As per my opinion it’s impossible to demolish all illegal buildings……oka 10 to 20 big shots buildings touch cheste they will start lobbying from Delhi then CM Revanth can’t do much…no one can fight against this system 😃

  12. నిన్ననే కదా ఇంకేముంది రేవంత్ హీరో అయ్యాడు, హైదరాబాద్ ఏరియాలో ఫాలోయింగ్ పెంచుకుంటున్నాడు అని మురిసిపోయారు.

  13. No one is innocent. All land buyers know at the time of purchase on the litigations. They just don’t care because most of the land is like that. Revant is still ZERO until he touches Owaisi properties

Comments are closed.