ఏం ప‌వ‌న్ ఆరోగ్యం ఎలా వుంది?

ఏం ప‌వ‌న్ ఆరోగ్యం ఎలా వుంది? అని డిప్యూటీ సీఎంను సీఎం చంద్ర‌బాబు నాయుడు ఆరా తీశారు. మూడు రోజులుగా ప‌వ‌న్‌క‌ల్యాణ్ వైర‌ల్ ఫీవ‌ర్‌తో బాధ‌ప‌డుతున్న‌ట్టు జ‌న‌సేన వ‌ర్గాలు చెప్పాయి. విజ‌య‌వాడ‌ను వర‌ద‌లు ముంచెత్తిన…

ఏం ప‌వ‌న్ ఆరోగ్యం ఎలా వుంది? అని డిప్యూటీ సీఎంను సీఎం చంద్ర‌బాబు నాయుడు ఆరా తీశారు. మూడు రోజులుగా ప‌వ‌న్‌క‌ల్యాణ్ వైర‌ల్ ఫీవ‌ర్‌తో బాధ‌ప‌డుతున్న‌ట్టు జ‌న‌సేన వ‌ర్గాలు చెప్పాయి. విజ‌య‌వాడ‌ను వర‌ద‌లు ముంచెత్తిన సంగ‌తి తెలిసిందే. అయిన‌ప్ప‌టికీ వ‌ర‌ద బాధితుల్ని ప‌రామ‌ర్శించ‌డానికి ప‌వ‌న్ వెళ్ల‌క‌పోవ‌డం తీవ్ర విమ‌ర్శ‌ల‌కు దారి తీసింది. ప‌వ‌న్ స్పందిస్తూ… తాను ప్ర‌త్యేక ప‌రిస్థితుల్లో ఉన్న‌ట్టు చెప్పుకొచ్చారు.

ముఖ్యంగా తాను టాలీవుడ్ అగ్ర‌హీరో కావ‌డం, వ‌ర‌ద బాధిత ప్రాంతాల‌కు వెళితే స‌హాయ‌క చ‌ర్య‌ల‌కు ఆటంకం ఏర్ప‌డుతుంద‌ని అధికారులు చెప్పార‌ని, అందుకే వెళ్ల‌లేక‌పోయాన‌ని ఆయ‌న వివ‌ర‌ణ ఇచ్చారు. ఆ త‌ర్వాత ఆయ‌న జ్వ‌రంబారిన ప‌డ‌డంతో అటు వైపు వెళ్ల‌లేక‌పోయారు.

ఈ నేప‌థ్యంలో వ‌ర‌ద బాధితుల స‌హాయార్థం త‌న వంతు బాధ్య‌త‌గా సీఎం చేతికి కోటి రూపాయిల చెక్కును ఇవాళ ప‌వ‌న్ అంద‌జేయ‌డం విశేషం. ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్ ఆరోగ్యం గురించి బాబు అడిగి తెలుసుకున్నార‌ని తెలిసింది. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న‌ట్టు ప‌వ‌న్ స‌మాధానం ఇచ్చిన‌ట్టు జ‌న‌సేన నేత‌లు తెలిపారు.

అంత‌కు ముందు మంగ‌ళ‌గిరిలోని జ‌న‌సేన కేంద్ర కార్యాల‌యంలో మ‌ట్టి వినాయ‌క విగ్ర‌హానికి ప‌వ‌న్ పూజ‌లు చేశారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా రాష్ట్రాభివృద్ధికి దైవం ఆశీస్సులు వుండాల‌ని ప‌వ‌న్ ఆకాంక్షించారు.

7 Replies to “ఏం ప‌వ‌న్ ఆరోగ్యం ఎలా వుంది?”

  1. Pawan వెళ్ళక పోవడం తీవ్ర విమర్శలకు దారి తీసింది….baaboru వెళ్ళడం మాత్రం తీవ్రమైన కడుపు మంటకు దారి తీసింది….😂😂…అంతేనా ఏడుపు గొట్టు GA….

  2. ప్రజలు కష్టాల్లో వుంటే.,.. మన దండుపాళ్యం బ్యాచ్ దోచుకున్న వేల కోట్ల నుంచి ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోవడం తీవ్రమైన ఆనందానికి దారితీసింది….అంతేనా GA….

    1. Ganer pappu అధికారం లో గానే ప్రజల మధ్య చిరుగాలి అని గుర్తొచ్చి నట్టు, చిన్న నాన్న నీ చెప్పిన జగత్ కిలాడి కి సపోర్ట్ చేస్తున్నావు అంటే నువ్వు కూడా….?

Comments are closed.