బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుపై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావ్ కాంగ్రెస్‌లో చేరిన సంగతి తెలిసిందే. వీరిలో దానం నాగేందర్ కాంగ్రెస్ తరపున ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగారు. ఈ నేపథ్యంలో ముగ్గురిపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ న్యాయపోరాటానికి దిగింది.
గత నెల 7న వాదనలు ముగిశాయి. తెలంగాణ హైకోర్టు సోమవారం వెలువరించిన తీర్పులో కీలక ఆదేశాలు ఇచ్చింది. నాలుగు వారాల్లో స్టేటస్ రిపోర్ట్ ఇవ్వాలని అసెంబ్లీ సెక్రటరీని హైకోర్టు ఆదేశించింది. అనర్హత పిటిషన్లను స్పీకర్ ముందు ఉంచాలని సెక్రటరీని ఆదేశించింది. లేని పక్షంలో కేసును సుమోటోగా స్వీకరించి విచారిస్తామని హైకోర్టు హెచ్చరించింది.
ఈ నేపథ్యంలో స్పీకర్ ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. దానం నాగేందర్ ఒక్కడే కాంగ్రెస్ తరపున ఎంపీ అభ్యర్థిగా బరిలో వుండడంతో సాంకేతికంగా దొరికిపోయారనే చర్చ జరుగుతోంది. మిగిలిన ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారనేందుకు ఎలాంటి ఆధారాలు లేవని కాంగ్రెస్ నేతలు అంటున్నారు.
ఇప్పటికే స్పీకర్‌కు బీఆర్ఎస్ నేతలు అనర్హత వేటు వేయాలని ఫిర్యాదు చేశారు. అయితే స్పీకర్ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో న్యాయపోరాటం చేయాల్సి వస్తోందని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు.
mari sabitha (2018) talasani srinivas (2014) manthruluga ayyaru kada appudu enduku ee court anarhatha vetu veyaledu?
appatiki ippatiki maarpu entante shivasena vishayamlo supreme court teerpu. Eppatiki pending pettakunda 3 months lo decision teesukovalani cheppjindi.
Good decision by TG high court.