క‌డ‌ప సిటీపై ప‌ట్టుకు ష‌ర్మిల ప‌క‌డ్బందీ వ్యూహం!

క‌డ‌ప సిటీ మొద‌టి నుంచి వైసీపీకి కంచుకోట‌. అయితే అంజాద్‌బాషా డిప్యూటీ సీఎం అయిన త‌ర్వాత ఆయ‌న త‌మ్ముడు, ఇత‌ర కుటుంబ స‌భ్యుల పెత్త‌నం పెరిగి, వైసీపీపై తీవ్ర వ్య‌తిరేక‌త‌కు దారి తీసింది. ముస్లిం,…

క‌డ‌ప సిటీ మొద‌టి నుంచి వైసీపీకి కంచుకోట‌. అయితే అంజాద్‌బాషా డిప్యూటీ సీఎం అయిన త‌ర్వాత ఆయ‌న త‌మ్ముడు, ఇత‌ర కుటుంబ స‌భ్యుల పెత్త‌నం పెరిగి, వైసీపీపై తీవ్ర వ్య‌తిరేక‌త‌కు దారి తీసింది. ముస్లిం, క్రిస్టియ‌న్ మైనార్టీలు గెలుపోట‌ముల‌ను దిశానిర్దేశం చేసే క‌డ‌ప సిటీలో టీడీపీ అభ్య‌ర్థి ఆర్‌.మాధ‌వీరెడ్డి గెలుపొంద‌డం ఓ చ‌రిత్రే. క‌డ‌ప‌లో టీడీపీ గెలుపు అనే దానికంటే, వైసీపీ ఓడిపోయింద‌న‌డ‌మే స‌రైంది.

క‌డ‌ప‌పై ప‌ట్టు సాధించేందుకు ఏపీ కాంగ్రెస్ అధ్య‌క్షురాలు ష‌ర్మిల ప‌క‌డ్బందీ వ్యూహంతో ముందుకెళుతున్నారు. క‌డ‌ప న‌గ‌ర కాంగ్రెస్ అధ్య‌క్షుడిగా అప్జ‌ల్ అలీఖాన్‌ను నియ‌మించారు. మొన్న‌టి ఎన్నిక‌ల్లో ఈయ‌న క‌డ‌ప అసెంబ్లీ నుంచి కాంగ్రెస్ అభ్య‌ర్థిగా బ‌రిలో నిలిచారు. కాంగ్రెస్ 13 శాతం ఓట్లు… అంటే 24,500 ఓట్లు ద‌క్కాయి. వైసీపీకి 34 శాతం ఓట్లు వ‌చ్చాయి. వైసీపీ, కాంగ్రెస్ అభ్య‌ర్థులిద్ద‌రూ ముస్లింలే కావ‌డం గ‌మ‌నార్హం.

ఇప్పుడు అప్జ‌ల్‌ఖాన్‌కు కాంగ్రెస్ న‌గ‌ర అధ్య‌క్ష ప‌ద‌వి ఇవ్వ‌డంతో మ‌రింత బ‌ల‌ప‌డే అవ‌కాశం వుంది. మ‌రోవైపు వైసీపీ క‌డ‌ప ఇన్‌చార్జ్ అంజాద్‌బాషాను కొన‌సాగించ‌డం, కాంగ్రెస్‌కు క‌లిసొచ్చే అంశం. అంజాద్‌బాషా, ఆయ‌న త‌మ్ముడి వ్య‌వ‌హార శైలి వైసీపీ శ్రేణుల్లో కూడా తీవ్ర వ్య‌తిరేక‌త నింపింది. అందుకే ఎన్నిక‌ల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోయింది. అంజాద్‌బాషా కుటుంబానికి చెడ్డ‌పేరు ఉంద‌ని తెలిసినా, ఆయ‌న్నే ఇంకా కొన‌సాగించ‌డం ద్వారా కాంగ్రెస్ వైపు ముస్లిం మైనార్టీలు వెళ్లే అవ‌కాశం లేక‌పోలేదు.

మ‌రీ ముఖ్యంగా జాతీయ‌స్థాయిలో బీజేపీకి వ్య‌తిరేకంగా పోరాడే పార్టీగా కాంగ్రెస్‌ను మాత్రం ముస్లింలు చూస్తారు. బీజేపీతో వైసీపీ లోపాయికారి ఒప్పందంలో వుంద‌ని ముస్లింలు అనుమానించ‌డ‌మే కాదు, న‌మ్ముతున్నారు. అయితే ఇటీవ‌ల పార్ల‌మెంట్‌లో వ‌క్ఫ్‌బిల్లుకు వ్య‌తిరేకంగా వైసీపీ గ‌ళం విప్పింది. దీంతో వైసీపీపై వ్య‌తిరేక‌త త‌గ్గింది. అయిన‌ప్ప‌టికీ క‌డ‌ప సిటీ వ‌ర‌కూ అంజాద్ బాషా వైసీపీకి నాయ‌క‌త్వం వ‌హించినంత వ‌ర‌కూ, ఆ పార్టీ ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ముస్లింల ఆద‌ర‌ణ పొంద‌లేదు. ముస్లింల‌లోనే మ‌రొక‌రికి నాయ‌కత్వం అప్ప‌గిస్తేనే, కాంగ్రెస్‌ను నిలువ‌రించొచ్చు. లేదంటే ష‌ర్మిల వ్యూహం ఫ‌లిస్తుంది.

క‌డ‌ప‌లో వైసీపీ త‌ప్పిదాలే ష‌ర్మిల‌కు క‌లిసి వ‌స్తున్నాయి. అంజాద్‌బాషాపై వ్య‌తిరేక‌త‌ను ప‌సిగ‌ట్టిన ష‌ర్మిల‌, వ్యూహాత్మ‌కంగా అప్జ‌ల్‌కు సిటీ బాధ్యత‌లు అప్ప‌గించారు. రానున్న రోజుల్లో అప్జ‌ల్‌కు ముస్లింల ఆద‌ర‌ణ ల‌భి్ంచే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారో చూడాలి.

4 Replies to “క‌డ‌ప సిటీపై ప‌ట్టుకు ష‌ర్మిల ప‌క‌డ్బందీ వ్యూహం!”

  1. అ లు,.,,చ్చా జగన్ గా,…డి గర్వానికి మరొ నిదర్సనం .. అ అంజాద్ బాషా గా,…డ్ని వా.,,డి తమ్ముడ్ని ఇంకా కొనసాగించడం

  2. ఈ ఫ్యామిలీ కి ఎంత దూరంగ ఉంటే అంత మంచిది. అందరూ డ్రామా ఆర్టిస్టులు.

Comments are closed.