పాపం.. స్వీట్లు పంచుకోలేని విజయం ఇది!

కొన్ని రోజుల కిందట కల్వకుంట్ల కవితకు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బెయిలు లభించింది. గులాబీ శ్రేణలు పండగ చేసుకున్నాయి. న్యాయమే గెలిచింది. నిజాయితీ గెలిచింది.. లాంటి డైలాగులు చాలా వినిపించాయి. ఆమె కేసు…

కొన్ని రోజుల కిందట కల్వకుంట్ల కవితకు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బెయిలు లభించింది. గులాబీ శ్రేణలు పండగ చేసుకున్నాయి. న్యాయమే గెలిచింది. నిజాయితీ గెలిచింది.. లాంటి డైలాగులు చాలా వినిపించాయి. ఆమె కేసు నుంచి విముక్తురాలు కాలేదు. కేవలం బెయిల్ మీద జైలు నుంచి బయటకు వచ్చారు అంతే. దానికే ఆ రేంజిలో వారు సెలబ్రేట్ చేసుకున్నారు.

ఇప్పుడు భారాస వారు మళ్లీ తమ సంతోషాన్ని వ్యక్తం చేయడానికి ఇంకో కోర్టు తీర్పు వచ్చింది. రాష్ట్రంలో ముగ్గురు ఎమ్మెల్యేల అనర్హత గురించి ఆదేశాలివ్వాలని వేసిన పిటిషన్లో హైకోర్టు తీర్పు చెప్పింది. వాళ్లు పిటిషన్ వేసినది ముగ్గురు ఎమ్మెల్యేల అనర్హత గురించి. కానీ, ఈ తీర్పు దెబ్బతో మొత్తం పది ఎమ్మెల్యే స్థానాల్లో ఉప ఎన్నికలు వచ్చేస్తాయంటూ.. ప్రెస్ మీట్లలో రెచ్చిపోయి ప్రకటనలు చేస్తున్నారు. కానీ.. తమాషా ఏంటంటే.. న్యాయం గెలిచింది.. రాజ్యాంగం గెలిచింది.. లాంటి మాటలు లేవు. స్వీట్లు పంచుకునే మూడ్ వారికి రాలేదు. కేవలం ఆర్భాటంగా ‘ఉపఎన్నికలు తప్పవు’ అనడం తప్ప!

హైకోర్టు ఇచ్చిన తీర్పు భారాసకు అనుకూలంగా ఏం రాలేదు. ఇది ఊహించిన తీర్పే. కానీ.. ఇక్కడితో అంతా అయిపోయినట్టుగా, ఆ ముగ్గురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడిపోయినట్టుగా భారాస వారి ఆర్భాటం కనిపిస్తోంది.

కోర్టు చెప్పినదెల్లా.. అనర్హత గురించి భారాస చేసిన ఫిర్యాదులను నాలుగువారాల్లోగా స్పీకరు ఎదుట పెట్టాలని మాత్రమే. నాలుగు వారాల్లోగా స్పీకరు తదుపరి కార్యచరణ షెడ్యూలుపై నిర్ణయం తీసుకోవాలని మాత్రమే. ఒకవేళ నాలుగువారాల్లోగా స్పీకరు నిర్ణయం తీసుకోకపోతే.. మళ్లీ తామే కేసును సుమోటోగా స్వీకరించి విచారిస్తామని కూడా హైకోర్టు తెలియజేసింది. ఇందులో స్పీకరు షెడ్యూలు ఎలా? ఎంత వ్యవధిలో పూర్తిచేయాలి.. అని సూచించే మార్గదర్శకాలు ఏమీ లేవు.

పైగా, షెడ్యూలు ప్రకటించి, సదరు ఎమ్మెల్యేల నుంచి వివరణలను కూడా తీసుకుని.. అంతా పూర్తయిన తరువాత.. అనర్హతకు స్పీకరు నో చెబితే ఏం జరుగుతుంది? అప్పుడు హైకోర్టు ఎలా జోక్యం చేసుకోగలుతుంది? ఇవన్నీ సందేహాలే. ప్రస్తుతానికి బయటపడ్డం లేదుగానీ.. ఏమైనా తేడా వస్తే సుప్రీం కోర్టుకు వెళ్లడానికి కూడా తాము సిద్దం అని అనడం ద్వారా.. ఈ తీర్పు వలన తేలేదేమీ లేదని భారా నాయకులే భావిస్తున్నట్టుగా అర్థమవుతోంది.

అందుకే పాపం వారికి ఈ హైకోర్టు తీర్పు.. స్వీట్స్ పంచుకునే మూడ్ కూడా ఇవ్వని తీర్పుగా మారింది. ఇదికూడా ఒక విజయంగా వారు డాంబికంగా ప్రకటించుకుని ఆనందిస్తున్నారంతే.. అని ప్రజలు అనుకుంటున్నారు.

5 Replies to “పాపం.. స్వీట్లు పంచుకోలేని విజయం ఇది!”

  1. ఒకవేళ స్పీకర్ కానీ సుప్రీం కోర్ట్ కానీ ఫిరాయించిన MLA లను disqualify చేస్తే ఎన్నికలు ఎదుర్కోవాలి . ఇప్పుడు BRS ఎన్నికలు ఎదుర్కునే పరిస్థితిలో లేదు . అదీ అసలు భయం.

  2. నువ్వు ఒక పక్షపాతివి..BRS అనగానే ఏ విషయం కాని అది negative అంతే కదా..ఏం జర్నలిజం రా బై..షేమ్

Comments are closed.