అనిల్- వెంకీ.. సూపర్ స్పీడ్

అనిల్ రావిపూడి.. విక్టరీ వెంకటేష్ సినిమా నిన్న మొన్న మొదలైనట్లుంది. అప్పుడే సగానికి పైగా పూర్తయిపోయింది. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ సినిమా షూట్ జ‌రుగుతోంది. ఈ సినిమాకు సంక్రాంతికి వస్తున్నాం అనే…

అనిల్ రావిపూడి.. విక్టరీ వెంకటేష్ సినిమా నిన్న మొన్న మొదలైనట్లుంది. అప్పుడే సగానికి పైగా పూర్తయిపోయింది. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ సినిమా షూట్ జ‌రుగుతోంది. ఈ సినిమాకు సంక్రాంతికి వస్తున్నాం అనే టైటిల్ తాత్కాలికంగా ఫిక్స్ చేసారు.

ఈ సినిమా అన్నీ లాంగ్ షెడ్యూల్స్ నే చేస్తూ వస్తున్నారు. పోలాచ్చిలో ఇరవై రోజులకు పైగా షూట్ చేసారు. ఇక్కడ లోకల్ గా 15 రోజులు చేసారు. దాంతో సగానికి పైగా వర్క్ పూర్తయింది.

అక్టోబర్ 1 నుంచి నాన్ స్టాప్ గా మరో లెంగ్తీ షెడ్యూలు ప్లాన్ చేసారు. నవంబర్ నెలాఖరు లోపు పాచ్ వర్క్ లు, పాటలతో సహా అంతా పూర్తి కావాలన్నది టార్గెట్. డిసెంబర్ అంతా ప్రశాంతంగా పోస్ట్ ప్రోడక్షన్ చేసుకుని, జ‌నవరిలో విడుదలకు రెడీ అవుతారు.

వెంకీ సరసన ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్నారు. అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైన్ మెంట్ మాత్రమే అనే థియరీతో కాకుండా యాక్షన్ కూడా మిక్స్ చేస్తున్నారు. రిటైర్డ్ పోలీస్ అఫీసర్ గా వెంకీ నటిస్తున్నారు. దిల్ రాజు నిర్మాత ఈ సినిమాకు.

2 Replies to “అనిల్- వెంకీ.. సూపర్ స్పీడ్”

Comments are closed.