అక్టోబర్ నెలాఖరుకు పుష్ప 2 పూర్తి

అల్లు అర్జున్- సుకుమార్ కాంబినేషన్ లో మైత్రీ నిర్మిస్తున్న పుష్ప2 సంగతేమిటి అని అభిమానులు ఎదురుచూస్తూనే వుంటారు. విడుదల వరకు ఇది ఇలా కొనసాగుతూనే వుంటుంది. ప్రస్తుతం పుష్ప 2 సినిమా షూట్ రామోజీ…

అల్లు అర్జున్- సుకుమార్ కాంబినేషన్ లో మైత్రీ నిర్మిస్తున్న పుష్ప2 సంగతేమిటి అని అభిమానులు ఎదురుచూస్తూనే వుంటారు. విడుదల వరకు ఇది ఇలా కొనసాగుతూనే వుంటుంది. ప్రస్తుతం పుష్ప 2 సినిమా షూట్ రామోజీ ఫిల్మ్ సిటీలో జ‌రుగుతోంది. హీరో కు సంబంధించిన ఫైట్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. టోటల్ టీమ్ అంతా ఈ షూట్ లో పాల్గొంటున్నారు.

సినిమాను తప్పని సరిగా డిసెంబర్ ఫస్ట్ వీక్ లో థియేటర్ ల్లోకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. సినిమా షూట్ అయితే కంఫర్టబుల్ గా అక్టోబర్ చివరకు పూర్తి అవుతుంది. ఒక్క ఐటమ్ సాంగ్ చిత్రీకరించాల్సి వుంది. మిగిలిన మూడు పాటలు చిత్రీకరించేసారు. రెండు పాటలు విడుదల చేసారు. సినిమా విడుదల లోగా ఐటమ్ సాంగ్ కూడా విడుదల చేసేస్తారు. కానీ జాతర పాట మాత్రం సినిమాలో విని, సినిమాలో చూడాల్సిందే.

సినిమాకు భారీగా ఖర్చు చేస్తున్నారు. అంతకు రెట్టింపు లెవెల్ లో మార్కెట్ చేస్తున్నారు. ఒక్క అంధ్ర (సీడెడ్ కాకుండా)నే 90 కోట్ల మేరకు థియేటర్ హక్కులకు కోట్ చేస్తున్నారు అంటే ఏ రేంజ్‌ లో మార్కెట్ చేస్తున్నారో అర్థం అవుతుంది. సినిమా మీద భారీ అంచనాలు వున్నాయి. దేవీశ్రీప్రసాద్ సంగీతం పెద్ద అస్సెట్.

One Reply to “అక్టోబర్ నెలాఖరుకు పుష్ప 2 పూర్తి”

Comments are closed.