బాబు ఎఫెక్ట్ః త‌మిళ‌నాడులో త‌నిఖీలు!

తిరుమ‌ల ప్ర‌సాదంలో క‌ల్తీ జ‌రిగింద‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు వివాదాస్ప‌ద కామెంట్స్ దేశ వ్యాప్తంగా ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా త‌మిళ‌నాడులో బాబు కామెంట్స్ తీవ్ర దుమారం రేపుతున్నాయి. త‌మిళ‌నాడులోని ఏఆర్ డైరీ స‌ర‌ఫ‌రా చేసిన నెయ్యిలో…

తిరుమ‌ల ప్ర‌సాదంలో క‌ల్తీ జ‌రిగింద‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు వివాదాస్ప‌ద కామెంట్స్ దేశ వ్యాప్తంగా ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా త‌మిళ‌నాడులో బాబు కామెంట్స్ తీవ్ర దుమారం రేపుతున్నాయి. త‌మిళ‌నాడులోని ఏఆర్ డైరీ స‌ర‌ఫ‌రా చేసిన నెయ్యిలో క‌ల్తీ జ‌రిగింద‌ని ఈవో శ్యామ‌లారావు వెల్ల‌డించిన సంగ‌తి తెలిసిందే.

ఈ క్ర‌మంలో త‌మిళ‌నాడు ఫుడ్ సేప్టీ అధికారులు ఏఆర్ డైరీ ఫుడ్స్ కంపెనీలో త‌నిఖీలు చేప‌ట్టారు. దిండిగ‌ల్‌లోని ఏఆర్ డైరీలో అధికారులు త‌నిఖీలు చేప‌ట్ట‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. శాంపిల్స్‌ సేకరించారు. శాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపారు. ఏఆర్ డైరీ నెయ్యి సరఫరా చేసే ఆలయాల ప్రసాదాలను పరిశీలించారు. పంపిణీ చేసే ప్రసాదాలను కూడా నిలిపివేశారు.

ఏఆర్ డైరీ త‌మిళ‌నాడులోని ప‌లు ఆల‌యాల‌కు నెయ్యి స‌ర‌ఫ‌రా చేస్తోంది. ప‌ళ‌ని ఆల‌యంలో ఏఆర్ నెయ్యిని వాడుతున్నారని భక్తులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పళణి సుబ్రమణ్యం ఆలయంలోని పంచామృతం ప్రసాదంలోనూ ఆ కంపెనీ నెయ్యినే వాడుతున్నార‌ని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

అయితే ఇదంతా త‌ప్పుడు ప్ర‌చార‌మ‌ని, భ‌క్తులు న‌మ్మొద్ద‌ని త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం పేర్కొంది. నెయ్యిలో ఎలాంటి క‌ల్తీ జ‌ర‌గ‌లేద‌ని ఏఆర్ డైరీ టీటీడీకి వివ‌ర‌ణ ఇచ్చింది. త‌మ‌పై కుట్ర జ‌రుగుతున్న‌ట్టు ఆ సంస్థ పేర్కొన‌డం గ‌మ‌నార్హం.

12 Replies to “బాబు ఎఫెక్ట్ః త‌మిళ‌నాడులో త‌నిఖీలు!”

  1. కల్తీ జరగలేదు అని చెప్పటానికి 3 రోజులు పట్టిందా ? ఈ లోపు నెయ్యి మార్చేశారా ? హేమ కూడా సొంత ల్యాబ్ లో టెస్ట్ చేయించుకుని డ్రగ్స్ వాడలేదు అని చెప్పి బాన్ ఎత్తివేయించుకుంది కానీ బెంగళూరు పోలీస్ నిజాలు చెప్పారు

  2. ముందు వీడు 320 రూపాయలకె నెయ్యి ఎలా ఇస్తున్నడొ చెపితె పాపం చాలా మంది నిరుద్యొగ యువత కి ఉప్పది కల్పించినొదు అవుతాడు.

    .

    అయినా అత్యాసె కాని… మన జగన్ మాత్రం ఇలా వెల కొట్లు 5 ఎల్లలొ ఎలా సంపాదించాడొ చెప్పమంటె చెపుతాడా ఎమిటి?

  3.  రామ్ మనోహర్ దాస్ గారు చెప్పినట్టు గుడికి వెళ్లకుండా ఇంటిదగ్గర గుడి సెట్టు వేసుకున్న గుడిసేటోడి పాలనలో ఇలాంటివి జరక్కుండా ఉంటాయా..

  4. టీటీడీ న్యూస్ బయటకు వచ్చిన 3 రోజుల తర్వాత తనిఖీలు చేస్తే ఏమి లాభం? దొంగలు పడ్డ ఆర్నెల్లుకి కుక్కలు మొరిగినట్టు. ఎక్కడివక్కడ సర్దేస్తారు

Comments are closed.