దేవర స్పెషల్ షో లు.. సింగిల్ స్క్రీన్ ల్లోనే?

నైజాంలో దేవర స్పెషల్ షో ల వ్యవహారం ఇంకా తేలలేదు. తొలిసారి బెనిఫిట్ లేదా స్పెషల్ షో ను అఫీషియల్ చేసి, ప్రభుత్వ జీవో తెచ్చి వెయ్యి రూపాయల టికెట్ పెట్టాలన్నది డిస్ట్రిబ్యూటర్ ప్లాన్.…

నైజాంలో దేవర స్పెషల్ షో ల వ్యవహారం ఇంకా తేలలేదు. తొలిసారి బెనిఫిట్ లేదా స్పెషల్ షో ను అఫీషియల్ చేసి, ప్రభుత్వ జీవో తెచ్చి వెయ్యి రూపాయల టికెట్ పెట్టాలన్నది డిస్ట్రిబ్యూటర్ ప్లాన్. ఈ మేరకు ప్రభుత్వం నుంచి జీవో తెప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఇక్కడ మరో చిన్న రాజ‌కీయం జ‌రుగుతోందని తెలుస్తోంది.

ఇలా వెయ్యి రూపాయల టికెట్ పెట్టి వేసే షో లు కేవలం సింగిల్ స్క్రీన్ ల్లో మాత్రమే అనే అలోచన చేస్తున్నారట. ఎందుకంటే, మల్టీ ఫ్లెక్స్ ల్లో షో వేస్తే వెయ్యి రూపాయల్లో అయిదు వందలు వాళ్లకే ఇచ్చేయాలి. ఎందుకంటే మల్టీ ఫ్లెక్స్ లు అన్నీ ఫిఫ్టీ.. ఫిఫ్టీ షేరింగ్ మీద సినిమాలు వేస్తాయి. అదే సింగిల్ స్క్రీన్ లు అయితే అలా ఇవ్వనక్కరలేదు. వెయ్యి రూపాయల్లో మూడువంతులకు పైగా డిస్ట్రిబ్యూటర్ కే వస్తాయి.

అయితే ఇది ఒక పక్క ఇలా వుండగానే అర్థరాత్రి ఒంటి గంట షో లకు అనుమతి ఇవ్వడం పై ఇంకా పోలీసు శాఖ ఏ నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. అలాగే అసలు ఒంటి గంటకు కాకుండా నాలుగు గంటల తరువాత వేస్తేనే బెటర్ అని దేవర సినిమా యూనిట్, పంపిణీ దారులు భావిస్తున్నారు. దీని వల్ల రాంగ్ టాక్ జ‌నాల్లోకి వెళ్లకుండా వుంటుందని అనుకుంటున్నారు. మొత్తం మీద ఈ రోజు గడిస్తే అన్నీ క్లారిటీ వస్తాయి.

6 Replies to “దేవర స్పెషల్ షో లు.. సింగిల్ స్క్రీన్ ల్లోనే?”

  1. 500, 1000 రూ….అవ్వ. అదే జగన్ ప్రభుత్వంలో కేవలం 250-300రూ.

    ఇప్పుడు జనాలు బాగా ఉంది

    1. బలె ఉందిరా! వాడెదొ వూహించి రాస్తున్నడు! నువ్వు తాలం వెస్తున్నవ్!

      అదికూడా బెనిఫిట్ షొ అంటున్నడు.

    2. అరే వెర్రిపప్ప…వాడు చెప్పింది నైజాం గురుంచి అంటే తెలంగాణ గురుంచి…నువ్వేమో కళ్ళు మూసుకుని అన్న బజన చేస్తున్నావ్…మీ దరిద్రం ఇంకా AP ని వదల్లేదు కర్మ 🤦

Comments are closed.