పవన్ కల్యాణ్ తో వీవీ వినాయక్

ఇప్పటికే పవన్ కల్యాణ్ చేతిలో చాలా సినిమాలున్నాయి. మరోవైపు సురేందర్ రెడ్డి, అనీల్ రావిపూడి లాంటి దర్శకులు వెయిటింగ్ లో ఉండనే ఉన్నారు. ఇలాంటి టైమ్ లో సడెన్ గా తెరపైకొచ్చాడు దర్శకుడు వీవీ…

ఇప్పటికే పవన్ కల్యాణ్ చేతిలో చాలా సినిమాలున్నాయి. మరోవైపు సురేందర్ రెడ్డి, అనీల్ రావిపూడి లాంటి దర్శకులు వెయిటింగ్ లో ఉండనే ఉన్నారు. ఇలాంటి టైమ్ లో సడెన్ గా తెరపైకొచ్చాడు దర్శకుడు వీవీ వినాయక్. వినాయక్ కు ఆల్రెడీ ఛాన్స్ కూడా ఇచ్చాడు పవన్ కల్యాణ్.

అయితే అంతా అనుకుంటున్నట్టు ఇది డైరక్షన్ ఛాన్స్ కాదు. పవన్ తో కలిసి నటించే ఛాన్స్. అవును.. అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ లో వినాయక్ ఓ చిన్న ప్రత్యేక పాత్ర చేశాడు. దీనికి సంబంధించి ఆల్రెడీ అల్యూనియం ఫ్యాక్టరీలో షూటింగ్ కూడా పూర్తయింది.

సినిమాలో కథ ప్రకారం వచ్చే ఓ కీలక సన్నివేశంలో ఓ తెలిసిన ముఖం ఉంటే బాగుంటుందని యూనిట్ భావించారు. సరిగ్గా అప్పుడే దర్శకుడు సాగర్ చంద్ర, వినాయక్ పేరు చెప్పడం, పవన్ వెంటనే ఓకే చేయడం చకచకా జరిగిపోయాయి. అలా అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ లో వినాయక్ కూడా భాగమయ్యాడు.

వినాయక్ కు నటించడం కొత్తకాదు. తను తీసిన ఠాగూర్ తో పాటు మరో 2 సినిమాల్లో అతిథి పాత్రలు పోషించాడు. అంతెందుకు.. తనే హీరోగా శీనయ్య అనే సినిమా కూడా స్టార్ట్ చేశాడు. కాకపోతే మధ్యలోనే అది ఆగిపోయింది. అది వేరే విషయం. మళ్లీ ఇన్నాళ్లకు పవన్ సినిమా కోసం ముఖానికి రంగేసుకున్నాడు ఈ దర్శకుడు.

గమ్మత్తైన విషయం ఏంటంటే… ఓ దర్శకుడు (సాగర్ చంద్ర) ఈ సినిమాను డైరక్ట్ చేస్తుంటే, మరో దర్శకుడు (త్రివిక్రమ్) ఈ సినిమాకు స్క్రీన్ ప్లే-డైలాగ్స్ అందిస్తున్నాడు. ఇప్పుడు ఇంకో దర్శకుడు (వినాయక్) ఇందులో అతిథి పాత్రలో కనిపిస్తున్నాడు. ఇలా ఒకే సినిమాకు ముగ్గురు దర్శకులు పనిచేస్తున్నారన్నమాట. 

మెగాఫ్యామిలీ మొత్తానికి నచ్చేసింది

గెట‌ప్ శీను యాక్టింగ్ సినిమాకే హైలెట్