దేవర.. ఆ ప్రచారంలో నిజం లేదు

ఆ మధ్య లియో సినిమా ఓటీటీలోకి వచ్చింది. థియేటర్ లో చూసిన కంటెంట్ కు భిన్నంగా ఓటీటీలో కాస్త కొత్త కంటెంట్ రిలీజ్ చేశారు. దీన్నే ఎక్స్ టెండెడ్ వెర్షన్ అని కూడా అంటారు.…

ఆ మధ్య లియో సినిమా ఓటీటీలోకి వచ్చింది. థియేటర్ లో చూసిన కంటెంట్ కు భిన్నంగా ఓటీటీలో కాస్త కొత్త కంటెంట్ రిలీజ్ చేశారు. దీన్నే ఎక్స్ టెండెడ్ వెర్షన్ అని కూడా అంటారు. ఓటీటీలో అది పెద్ద హిట్టయింది. ఎడిటింగ్ లో కట్ చేసిన కొన్ని సన్నివేశాల్ని యాడ్ చేసి ఓటీటీ వెర్షన్ రిలీజ్ చేయడం కామన్. ఇప్పుడు దేవర విషయంలో కూడా అదే జరగబోతోందంటూ ప్రచారం నడుస్తోంది.

ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర సినిమా మరికొన్ని రోజుల్లో ఓటీటీలో స్ట్రీమింగ్ కు రాబోతోంది. సెకెండాఫ్ లో కొన్ని మార్పుచేర్పులు చేసి, అదనంగా మరికొన్ని సన్నివేశాలు యాడ్ చేసి ఓటీటీలోకి తీసుకొస్తున్నారనే ప్రచారం నడుస్తోంది. అయితే ఇందులో నిజం లేదు.

థియేటర్లలో ప్రేక్షకులు చూసిన సినిమానే యథాతథంగా ఓటీటీలో కూడా స్ట్రీమింగ్ కు తీసుకొస్తున్నారు. మధ్యలో యాడ్ చేసిన దావూదీ సాంగ్ కూడా స్ట్రీమింగ్ లో ఉంటుంది.

దేవర థియేటర్లలోకి వచ్చిన కొత్తలో ఈ సాంగ్ లేదు. మొదటి వారం పూర్తయిన తర్వాత, సినిమాకు మరింతమంది ఆడియన్స్ ను రప్పించేందుకు, వ్యూహాత్మకంగా దావూదీ సాంగ్ యాడ్ చేశారు. అలా యాడ్ చేసిన సాంగ్ ను స్ట్రీమింగ్ లో కూడా ఉంచుతున్నారు.

ప్రస్తుతానికి 8వ తేదీకి తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ వెర్షన్లు మాత్రం అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఆ తర్వాత మరో డేట్ సెట్ చేసి హిందీ వెర్షన్ ను స్ట్రీమ్ చేస్తారు.

3 Replies to “దేవర.. ఆ ప్రచారంలో నిజం లేదు”

Comments are closed.