విశాఖ ఉక్కు ప్రైవేట్ కు.. బీజేపీని ప్ర‌శ్నించే ద‌మ్ములేక‌!

విశాఖ ఉక్కును ప్రైవేట్ ప‌రం చేసే ఉద్దేశాన్ని వ్య‌క్త ప‌రిచింది కేంద్ర ప్ర‌భుత్వం. అది కూడా కేంద్ర బ‌డ్జెట్ ప్ర‌క‌ట‌నలో ఆ అంశాన్ని ప్ర‌క‌టించారు. ఉక్కు ఫ్యాక్ట‌రీ పూర్తిగా కేంద్ర ప్ర‌భుత్వ ఆధీనంతో ఉంది.…

విశాఖ ఉక్కును ప్రైవేట్ ప‌రం చేసే ఉద్దేశాన్ని వ్య‌క్త ప‌రిచింది కేంద్ర ప్ర‌భుత్వం. అది కూడా కేంద్ర బ‌డ్జెట్ ప్ర‌క‌ట‌నలో ఆ అంశాన్ని ప్ర‌క‌టించారు. ఉక్కు ఫ్యాక్ట‌రీ పూర్తిగా కేంద్ర ప్ర‌భుత్వ ఆధీనంతో ఉంది. వ‌ర‌స పెట్టి ప్ర‌భుత్వ రంగ వ్య‌వ‌స్థ‌ల‌ను అమ్మ‌డం, పెట్టుబ‌డుల ఉప‌సంహ‌ర‌ణ పేరుతో తూకానికి అమ్ముతూ ఉండ‌టం మోడీ ప్ర‌భుత్వ విధానంగా మారింది.

ఇప్పుడు కాదు.. 2015 బ‌డ్జెట్ ద‌గ్గ‌ర నుంచి ఇదే విధానం కొన‌సాగుతూ ఉంది. ఇప్ప‌టికే ఎల్ఐసీ వంటి అత్యంత లాభాల్లో ఉన్న వ్య‌వ‌స్థ‌ను కూడా అమ్మ‌కానికి ఉంచిన ఘ‌న‌త మోడీ స‌ర్కారుది. మోడీ ప్ర‌భుత్వం వ‌చ్చాకా బీఎస్ఎన్ఎల్ గ‌ల్లంత‌యిపోయింది. అలాంటి వ్య‌వ‌స్థ‌ల‌నే భ్ర‌ష్టుప‌ట్టించేసిన వాళ్ల‌కు విశాఖ ఉక్కు ఒక లెక్క‌? ఈ క్ర‌మంలో సొంత గ‌నులు లేవు అనే ఉద్దేశంతో మోడీ ప్ర‌భుత్వం విశాఖ ఉక్కు క‌ర్మాగారాన్ని అమ్మ‌కానికి రెడీ చేస్తోంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

మ‌రి కేంద్ర ప్ర‌భుత్వం తీసుకున్న ఈ నిర్ణ‌యంపై ఎవ‌రిని ప్ర‌శ్నించాలి?  కేంద్ర ఆర్థికా శాఖా మంత్రిని, ప్ర‌ధాన‌మంత్రిని, కేంద్ర ప్ర‌భుత్వాన్ని, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీని. ఇంగిత జ్ఞానం ఉన్న ఎవ‌రైనా ఇదే అనుకుంటారు! అయితే విశాఖ ఉక్కుపై తీవ్ర ప్రేమ‌ను వ్య‌క్తం చేస్తున్న తెలుగుదేశం నేత‌ల‌కు మాత్రం ఈ మాత్రం ఇంగితం ఉన్న‌ట్టుగా లేదు!

విశాఖ ఉక్కు క‌ర్మాగారంపై విప‌రీత ప్రేమ‌ను వ్య‌క్తం చేస్తున్న టీడీపీ నేత‌లు అయ్య‌న్న‌పాత్రుడు, కొల్లు ర‌వీంద్ర ఇత‌రులు… ఈ విష‌యంపై రాష్ట్ర ప్ర‌భుత్వంపై దుమ్మెత్తి పోశారు! ఒక్క మాటంటే ఒక్క మాట అయినా కేంద్రాన్ని ప్ర‌శ్నించింది కానీ, ఆ నిర్ణ‌యాన్ని వెన‌క్కు తీసుకోవాల‌ని కోరింది కూడా లేదు!

ఏ1 ఏ2లు విశాఖ ఉక్కు క‌ర్మాగారాన్ని కొట్టేయాల‌ని చూస్తున్నారంటూ అయ్య‌న్న తేల్చారు. ఎవ‌రైనా ఆ క‌ర్మాగారాన్ని కొనుక్కోవాల‌నే అని అనుకుంటున్నార‌నుకుందాం, అమ్ముతున్న‌ది ఎవ‌రు?  ముందు ప్ర‌జ‌ల వ్య‌వ‌స్థ‌ను అమ్ముతున్న వాళ్లను నిల‌దీయాలి. ఆ ద‌మ్ము లేక‌.. అన్నింటికీ ప‌దేళ్ల కింద‌టి నాటి మాట‌లనే మాట్లాడేస్తే స‌రిపోతుంద‌ని టీడీపీ నేత‌లు అనుకుంటున్నారు. టీడీపీకి నిజంగానే ద‌మ్ముంటే, విశాఖ ఉక్కుపై ప్రేమ ఉంటే.. ఇప్పుడు పెట్టాలి ఢిల్లీలో స‌భ‌లు, స‌మావేశాలు, నిర‌స‌న కార్య‌క్ర‌మాలు. 

ఇక అయ్య‌న్న ఇచ్చిన మ‌రో ఉచిత స‌ల‌హా.. విశాఖ ఉక్కును రాష్ట్ర ప్ర‌భుత్వం కొనేయాల‌ట‌. జ‌స్ట్ వెయ్యి కోట్లే క‌దా.. ఆర్టీసీనే ప్ర‌భుత్వం ప‌రం చేసిన వాళ్ల‌కు ఇదేం పెద్ద‌ది కాదు క‌దా.. అని ప్ర‌శ్నిస్తున్నారు! అంటే.. కేంద్రం అమ్మేస్తుంటే రాష్ట్రం కొని కాపాడుకోవాలి. ప్ర‌తిగా కేంద్రాన్ని ప్ర‌శ్నించే ద‌మ్ములేదు కానీ, రాష్ట్ర ప్ర‌భుత్వంపై దుమ్మెత్తి పోస్తారు.

ఇలాంటి మాట‌లు మాట్లాడే టీడీపీ 23 సీట్ల‌కు ప‌డిపోయిందని ప‌చ్చ నేత‌లు ఎప్ప‌టికి గుర్తిస్తారో.  కేంద్రాన్ని ప్ర‌శ్నించే ద‌మ్ములేక‌..చేవ లేక‌.. ఇలాంటి విష‌యాల్లో కూడా ఇలా మాట్లాడి.. తెలుగుదేశం పార్టీ రోజురోజుకూ పాతాళానికి కూరుకుపోతోంది.

మనకి బూతులు జనాలకు కాదు

చంద్రబాబు వచ్చే వరకూ టీవీల్లో మాట్లాడిన పట్టాభి..