ఇండస్ట్రీలో ఇగోలు బయటపెట్టిన హీరోలు

ఇగోలు లేని ఇండస్ట్రీ ఉండదు. టాలీవుడ్ లో అది కొండంత ఉంది. ప్రతి హీరోకు ఇగో ఉంటుంది. దాన్ని పక్కనపెట్టి బంధాల్ని బలోపేతం చేసుకోవాలనుకునే ఆలోచన అతి కొద్దిమందికి మాత్రమే ఉంటోంది. Advertisement ఇండస్ట్రీలో…

ఇగోలు లేని ఇండస్ట్రీ ఉండదు. టాలీవుడ్ లో అది కొండంత ఉంది. ప్రతి హీరోకు ఇగో ఉంటుంది. దాన్ని పక్కనపెట్టి బంధాల్ని బలోపేతం చేసుకోవాలనుకునే ఆలోచన అతి కొద్దిమందికి మాత్రమే ఉంటోంది.

ఇండస్ట్రీలో ఇగోల గురించి నాని-రానా మాట్లాడుకున్నారు. కేవలం ఇగోల వల్ల హీరోలుగా ఉన్న ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ విడిపోయారని సంచలన వ్యాఖ్యలు చేశాడు రానా. వాళ్ల మధ్య పెద్ద శత్రుత్వం లేదని, కేవలం సిల్లీ రీజన్స్ వల్ల విడిపోయారని చెప్పుకొని బాధపడ్డాడు.

ఇదే విషయాన్ని నాని కూడా అంగీకరించాడు. “నేను 15 ఏళ్ల నుంచి పరిశ్రమలో ఉన్నాను. ఓ క్లాస్ రూమ్ లో ఇన్నేళ్లు ఉంటే చాలా గట్టి బంధాలు ఏర్పడేవి. మరి ఇండస్ట్రీలో కూడా అలాంటి బలమైన బంధాలు ఏర్పడాలి కదా?” అంటూ స్పందించాడు.

80-90ల నాటి హీరోలు బాగా కలిసిపోతున్నారని, తమవాడు అనే ఫీలింగ్ లో వాళ్లున్నారని, ఇప్పుడున్న హీరోల్లో అలాంటి ఐక్యత కనిపించడం లేదని అంటున్నాడు నాని. ఈ సందర్భంగా రామానాయుడు చెప్పిన మాటల్ని గుర్తుచేసుకున్నాడు రానా.

బయట వ్యక్తుల కంటే ఇండస్ట్రీ జనాలు ఎవరైనా వస్తే వాళ్లతో మాట్లాడ్డానికి రామానాయుడు ఎక్కువ ఆసక్తి చూపించేవారట. దానికి కారణం ఏంటంటే, వృత్తిగతంగా గతంలో చిన్నచిన్న తగాదాలు, సమస్యలు వచ్చి ఉండొచ్చని, అవకాశం దొరికినప్పుడు కలిసి మాట్లాడితే కలిసిపోతే అవకాశం ఉంటుందని అన్నారట. మరి ఈతరం హీరోలు ఎంతమంది ఆ పని చేస్తున్నారు?

30 ఏళ్ల పాటు పరిశ్రమలో కొనసాగాలని ఫిక్స్ అయినప్పుడు, స్నేహితుల్ని కూడా పరిశ్రమ నుంచే సంపాదించుకోవాలనేది రామానాయుడు ఫిలాసఫీ. ప్రస్తుత హీరోలు కలవడానికే ఆసక్తి చూపించడం లేదనేది నాని కంప్లయింట్.

ఇప్పుడొస్తున్న యంగ్ జనరేషన్ హీరోలైతే మరింత ఘోరంగా ఉన్నారని అభిప్రాయపడ్డాడు తేజ సజ్జ. కనీసం నాని-రానా జనరేషన్ హీరోలే బెటరని, కనీసం రాబోయే రోజుల్లోనైనా కలుస్తారనే ఆశ ఉందని, ఇప్పుడొస్తున్న యంగ్ హీరోలను చూస్తే ఆ ఆశ కూడా ఉండడం లేదని అన్నాడు.

7 Replies to “ఇండస్ట్రీలో ఇగోలు బయటపెట్టిన హీరోలు”

  1. అబ్బో ఈ నాని గాడు చెబితే వినాలి. వీడికి విజయ్ దేవరకొండ మీద ఎంత ఏడుపో వాడి వరుస హిట్స్ పడ్డాయని. ఇప్పుడు ఇగో వదిలేసినట్టున్నాడు వాడికి ఫ్లాపులు పడేసరికి.

Comments are closed.