తెర మీద తానొక పెద్ద స్టార్. రైటర్స్ ఇచ్చే డయాలగుల్ని బట్టీ కొట్టి చెప్పి జనాల చేత చప్పట్లు కొట్టించుకోవడం వృత్తిపరంగా అలవాటైన విషయం.
రాజకీయాల్లోకిచ్చినా వేదిక మీద మాట్లాడేటప్పుడు ముందుగానే రైటర్ల చేత రాయించుకుని ఏవో నాలుగు పడిగట్టు సింగిల్ లైనర్లు చెప్పి మళ్లీ ఆ సభలో ఉన్న ఫ్యాన్స్ చేత ఈలలు వేయించుకోవడం అలావాటైన ప్రాణానికి సడెన్ గా మూతి ముందు మైకు పెట్టి ఫలానా దాని గురించి ఏమంటారని అడిగితే అసలు బండారం బయటపడుతుంది.
రాజకీయనాయకుడికి సమయస్ఫూర్తి, చెప్పే విషయంలో క్లారిటీతో పాటు పంచ్ కూడా ఉండాలి.
తాజాగా పవన్ కల్యాణ్ ఇలాంటి మైకు ముందు మాట్లాడుతూ, “నన్ను సీబీయన్ కి దత్తపుత్రుడంటే, నేను జగన్ ని సీబీఐ కి దత్తపుత్రుడు అనాల్సొస్తుంది” అన్నాడు. ఇదెక్కడి పోలిక? “దత్తపుత్రుడు” అనే పదానికి అర్థం తెలుసా పవన్ బాబూ?!
ఎవరైనా దత్తపుత్రుడిని ప్రేమగా దువ్వి బాగోగులు చూసుకుంటారు. అంతే కానీ జైల్లో పెట్టి టార్చర్ పెట్టరు. చంద్రబాబు పవన్ మీద చూపిస్తున్నది దత్తపుత్ర ప్రేమ. సీబీయై వాళ్లు జగన్ మీద చూపించింది కౄరత్వం.
పంచ్ పేలకపోగా సీబీయన్ అసలు పుత్రుడు లోకేష్ బాబు డయలాగులాగ ఉందిది. వెనక రాసిపెట్టే వాడు లేకపోతే ఇలాగుంటుందన్నమాట.
అంబటి రాంబాబుగానీ, పేర్ని నాని గానీ, కోడాలి నాని గానీ ఇలాంటి సందర్భాల్లో ఎలా పేలతారు? ముందు పంచ్ పడిపోతుంది. తర్వాత మ్యాటర్.
జనాలెప్పుడూ పవర్ఫుల్ గా మాట్లాడేవాడి వెనుక ఉంటారు. పవర్ఫుల్ అంటే వాల్యూం పెంచడం కాదు. తిప్పికొట్టడంలో నేర్పరితనం, తెగువ. ఇవి లేనప్పుడు ఎప్పటికీ జనం వెనక జేరరు. వెనుకున్న అభిమానుల్ని అశేషమైన ఓటర్లనుకోవడం అమయాకత్వమే అవుతుంది.
ఇలా పసలేని కౌంటర్ల వల్ల న్యూట్రల్ ఓటర్స్ ని ఎప్పటికీ తనవైపు తిప్పుకోలేడు పవన్ కళ్యాణ్.
డయలాగులో పంచ్ లేకపోవడం, ఒంటరిగా పోరాడే తెగువ చూపకపోవడం, బీజేపీతోనో- తెదేపాతోనో అంటకాగాలనుకోవడం, పార్ట్ టైం పాలిటిక్స్- ఫుల్ టైం సినిమా జీవితం గడపడం…ఈ లక్షణాల కారణంగా రానున్న 2024 ఎన్నికల్లో పవన్ కి మరోసారి ఘోర పరాభవం తప్పేలా లేదు.
ఇప్పటికైనా కళ్లు తెరిచి పద్ధతి మార్చుకుంటే సరి. కాదు..అసలు ఎజెండానే కాలక్షేపం చేస్తూ నమ్ముకున్నవాళ్లని వెర్రివెంగళాయల్ని చేయడమనుకుంటే ఇలాగే కానివ్వచ్చు.
హరగోపాల్ సూరపనేని