1). వైసీపీ నాయకుడి కామెంట్ – కోళ్లకి కత్తులిచ్చాడు మా జగన్, ఇక పార్టీలో సంక్రాంతి పండగే
2). రజని అభిమాని – ఇంటి పేరులోనే విడుదల వున్న మా మేడంకి జైళ్లశాఖ ఇచ్చి వుండాలి
3). వైసీపీలో మంట రేగితే చలి కాచుకోడానికి చాలా మంది వెయిటింగ్
4).బాలినేని అభిమాని ఆవేదన -మా వాసన్న ఫైర్‌లా వెళ్లి ప్లవర్‌లా తిరిగొచ్చాడు
5). ఒక పెద్దాయన మాట – మా వైసీపీ వాళ్లకి పూర్వజన్మ జ్ఞాపకం వచ్చినట్టుంది. నూటికి 90 మంది కాంగ్రెస్ వాళ్లే కదా
6). సంవత్సరం ధర్నా చేస్తేనే రైతుల్ని లెక్కచేయని మోదీ …కేసీఆర్ ధర్నాకి భయపడుతాడా –టీ అంగడి కామెంట్
7). పవన్ ఎక్కడ? – షాట్ గ్యాప్‌లో వచ్చి సభ పెడతాడు
8). ఈ రోజు పాస్‌వర్డ్స్ -అలక, ఆగ్రహం, రాజీనామా, బుజ్జగింపు
9). రోజా అభిమాని డిమాండ్ -గుళ్లు గోపురాలు తిరిగిన మా మేడంకి దేవాదాయశాఖ ఇవ్వాలి
10). తిరుపతి సామెత –తట్టలెత్తేవాడి పొట్టకి ఢోకాలేదు
(తట్టలెత్తడం అంటే హారతి పళ్లెం విగ్రహం చుట్టూ తిప్పడం. వీఐపీలకి హారతులిప్పించి రాజకీయాల్లో, వ్యాపారాల్లో ఎదగడం తిరుపతిలో మామూలే)