ఆరు నెల‌లుగా పోరాడుతున్నా ద‌య‌చూప‌ని కూట‌మి స‌ర్కార్‌

ఎన్నిక‌ల‌కు ముందు ఎన్నో హామీలిచ్చి, అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత త‌మ‌ను మోస‌గించ‌డం న్యాయ‌మా?

వాలంటీర్ల ప‌రిస్థితి ద‌య‌నీయంగా మారింది. అస‌లు వాలంటీర్ల వ్య‌వ‌స్థే లేద‌ని ఒక‌వైపు కూట‌మి స‌ర్కార్ చ‌ట్ట‌స‌భ‌ల్లో స్ప‌ష్టం చేసినా, పోరాటాల‌కు ప్ర‌భుత్వం త‌లొగ్గ‌క‌పోతుందా? అనే న‌మ్మ‌కం వాళ్ల‌లో క‌నిపిస్తోంది. మ‌రీ ముఖ్యంగా వాలంటీర్ల‌కు రూ.5 వేలు కాదు, రూ.10 వేల గౌర‌వ వేత‌నం ఇస్తామ‌ని చంద్ర‌బాబు ఎన్నిక‌ల‌కు ముందు హామీ ఇవ్వ‌డంతో ఆశ రెట్టింపు అయ్యింది. చాలా మంది వాలంటీర్లు కూట‌మికి ఎన్నిక‌ల్లో మ‌ద్ద‌తుగా నిలిచారు.

కూట‌మి ప్ర‌భుత్వం కొలువుదీరింది. దీంతో త‌మ‌కు నెల‌నెలా రూ.10 వేలు గౌర‌వ వేత‌నం వ‌స్తుంద‌ని ధీమాగా ఉన్నారు. కానీ ఆశ‌ల‌న్నీ అడియాస‌ల‌య్యాయి. వాలంటీర్ల‌ను తీసుకునే ఉద్దేశమే లేద‌ని సీఎం చంద్ర‌బాబు మిన‌హా, కేబినెట్‌లోని కీల‌క మంత్రులంతా చెప్పారు. అయిన‌ప్ప‌టికీ వాలంటీర్లు ఆశ‌ను , చంద్ర‌బాబుపై న‌మ్మ‌కాన్ని చంపుకోలేక‌పోతున్నారు.

ఈ నేప‌థ్యంలో విజ‌య‌వాడ గాంధీన‌గ‌ర్ ధ‌ర్నాచౌక్‌లో వాలంటీర్లు ధ‌ర్నాకు దిగారు. వాలంటీర్ల వ్య‌వ‌స్థ‌ను కొన‌సాగించాల‌ని, ఉద్యోగ భ‌ద్ర‌త క‌ల్పించాల‌ని వారు డిమాండ్ చేయ‌డం గ‌మ‌నార్హం. రాష్ట్ర వ్యాప్తంగా 2.60 ల‌క్ష‌ల మంది వాలంటీర్లు ఉన్నార‌ని, ఆరు నెల‌లుగా పోరాటాలు చేస్తున్నా కూట‌మి ప్ర‌భుత్వం స్పందించ‌డం లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఎన్నిక‌ల ముందు వాలంటీర్ల వ్య‌వ‌స్థ‌ను కొన‌సాగిస్తామ‌నే హామీని వారు గుర్తు చేశారు. మ‌హిళ‌ల‌కు అన్యాయం జ‌ర‌గ‌కూడ‌ద‌ని చెబుతున్న పాల‌కులే, నేడు త‌మ‌కు న్యాయం చేయ‌డం లేద‌ని మ‌హిళా వాలంటీర్లు వాపోయారు.

ఆరు నెల‌లుగా త‌మ‌కు జీతాలు కూడా ఇవ్వ‌డం లేద‌ని వాలంటీర్లు అన్నారు. ఎన్నిక‌ల‌కు ముందు ఎన్నో హామీలిచ్చి, అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత త‌మ‌ను మోస‌గించ‌డం న్యాయ‌మా? అని వాలంటీర్లు ప్ర‌శ్నించారు. ఇప్ప‌టికైనా సీఎం చంద్ర‌బాబు స్పందించాల‌ని వాలంటీర్లు డిమాండ్ చేశారు.

24 Replies to “ఆరు నెల‌లుగా పోరాడుతున్నా ద‌య‌చూప‌ని కూట‌మి స‌ర్కార్‌”

    1. If the previous government cheated volunteers, why can’t current government can do justice for volunteers, they can pass a new GO and continue their services, they also favored and voted to the current government for toll promises given by these leaders. Idi NAMMAKA DROHAM to all volunteers. people are already under the impression that baboru has patent for nammaka droham. Adi povali ante volunteers li nyayam cheyali.

      1. Volunteers only cast votes for YCP; they did not cast their own votes. and they also put the case on Pavan. As I stated, there are some consequences to deal with, and they will then see what they can do.

      2. Volunteers did not vote, but solely voted for ycp. They also brought an instance against Pawan. As I stated, there are some consequences that must be addressed…then they will decide what can be done.

        1. they are also common people bro… 2.5 lakhs families. 10000rs ante evaru vadulukuntaru.. evaru YCP ki votesi untaru. nijalu matladadham. At least a favorable statement should come from the government to look into the issue and do the justice.

        2. they are also common people bro… 2.5 lakhs families. 10000rs ante evaru vadulukuntaru.. evaru YCP ki votesi untaru. nijalu matladadham. At least a favorable statement should come from the government to look into the issue and do the justice.

        3. they are also common people bro… 2.5 lakhs families. 10000rs ante evaru vadulukuntaru.. evaru YCP ki votesi untaru. nijalu matladadham. At least a favorable statement should come from the government to look into the issue and do the justice.

        4. they are also common people bro… 2.5 lakhs families. 10000rs ante evaru vadulukuntaru.. evaru Y C P ki votesi untaru. nijalu matladadham. At least a favorable statement should come from the government to look into the issue and do the justice.

  1. పావని , చంద్రిక లకు మోసం చెయ్యడం రాదు.

    వెన్నుపోటు పొడవడం మాత్రం చాల బాగా తెలుసు.

  2. అయిదు ఏళ్ళు అమరావతి రైతులని చేసిన మోసం గురించి ఎప్పుడు రాయలేదీ?

  3. వాలంటీర్స్ ఆంధ్ర ప్రదేశ్ కాకుండా ఇంకా ఏ రాష్ట్రం లోను లేరు.

    అది ఒక అనవసరపు వ్యవస్థ.

    సంవత్సరానికి 2 వేల కోట్లు వ్యర్థం.

    జగన్ తన కోసం నిర్మించుకున్న వ్యవస్థ.

    2,6 లక్షల్లో ఆల్రెడీ సగం మంది YCP పార్టీ కోసం ఎన్నికల్లో పని చేస్తానికి రాజీనామా చేసారు.

    మిగతా వారు ఇంకొన్ని నెలల్లో విసుగు చెంది వేరే పనులు చూసుకుంటారు.

    నీతివంతమైన గౌరవ ప్రదమైన పనులు వెతుక్కుంటారు

    వైసీపీ లాంటి లుచ్చా పార్టీ కి ప్రైవేట్ ఆర్మీ లాగ పని చెయ్యాల్సిన అవసరరం ఉండదు.

  4. వాలంటీర్స్ ఆంధ్ర ప్రదేశ్ కాకుండా ఇంకా ఏ రాష్ట్రం లోను లేరు.

    అది ఒక అనవసరపు వ్యవస్థ.

    సంవత్సరానికి 2 వేల కోట్లు వ్యర్థం.

    జగన్ తన కోసం నిర్మించుకున్న వ్యవస్థ.

    1. 2,6 లక్షల్లో ఆల్రెడీ సగం మంది పార్టీ కోసం ఎన్నికల్లో పని చేస్తానికి రాజీనామా చేసారు.

      మిగతా వారు ఇంకొన్ని నెలల్లో విసుగు చెంది వేరే పనులు చూసుకుంటారు.

      నీతివంతమైన గౌరవ ప్రదమైన పనులు వెతుక్కుంటారు

      వైసీపీ లాంటి లుచ్చా పార్టీ కి ప్రైవేట్ ఆర్మీ లాగ పని చెయ్యాల్సిన అవసరరం ఉండదు

    2. 2,6 లక్షల్లో ఆల్రెడీ సగం మంది పార్టీ కోసం ఎన్నికల్లో పని చేస్తానికి రాజీనామా చేసారు.

      మిగతా వారు ఇంకొన్ని నెలల్లో విసుగు చెంది వేరే పనులు చూసుకుంటారు.

      1. ee matram papam baboriki and P star ki teliyadu, elections before 10000rs every month istam ani nammaka droham chesaru.. ippudu chetulu dolupukune pani chestunnaru. Ippatikaina chepochukada Volunteers vyavasta danaga ani.

        1. Let these useless Volunteer fellows wait.

          The term is for 5 years.

          Maybe Babu wil retain 10000 volunteers.

          They are probably filtering out the p-s-ycho party workers out.

Comments are closed.