వెన్నెల కిషోర్ తో ఒప్పందం లేదు

వెన్నెల కిషోర్ యూఎస్ఏలో ఉన్నాడు. 2-3 సార్లు మేం రిక్వెస్ట్ చేశాం. కానీ బిజీ షెడ్యూల్స్ వల్ల ఆయన రాలేకపోతున్నాడు.

శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ అనే సినిమాకు సంబంధించి వెన్నెల కిషోర్ పై విమర్శలు చెలరేగిన సంగతి తెలిసిందే. దీనిపై వెన్నెల కిషోర్ పూర్తి క్లారిటీ ఇచ్చాడు. గ్రేట్ ఆంధ్రతో ప్రత్యేకంగా మాట్లాడుతూ.. తను కేవలం 10 కాల్షీట్లు మాత్రమే ఇచ్చానని, తను అందులో హీరో కాదని కూడా స్పష్టం చేశాడు. ప్రచారం టైమ్ కు తను యూఎస్ లో ఉంటాననే విషయం కూడా మేకర్స్ కు తెలుసని, పైగా ప్రచారం చేస్తానంటూ తానేమీ కమిట్ మెంట్ ఇవ్వలేదని కూడా అన్నాడు.

ఇప్పుడు మరోసారి వెన్నెల కిషోర్ వ్యవహారం తెరపైకి వచ్చింది. వెన్నెల కిషోర్ తప్పనిసరిగా ప్రచారానికి రావాలనే ఒప్పందం ఏమీ చేసుకోలేదని మేకర్స్ స్పష్టం చేశారు. పైగా ఈసారి ఎలాంటి వివాదాలు టచ్ చేయకుండా, వెన్నెల కిషోర్ పై చాలా సాఫ్ట్ కార్నర్ తో మాట్లాడారు.

“వెన్నెల కిషోర్ యూఎస్ఏలో ఉన్నాడు. 2-3 సార్లు మేం రిక్వెస్ట్ చేశాం. కానీ బిజీ షెడ్యూల్స్ వల్ల ఆయన రాలేకపోతున్నాడు. పైగా తనకు చాలా మొహమాటమని, ఇలాంటి ప్రచారాలు, ఈవెంట్లకు రావడం ఇష్టం ఉండదని సున్నితంగా చెప్పాడు. దాంతో మేం కూడా బలవంతం చేయలేదు.” అంటూ స్పందించారు మేకర్స్.

తమ సినిమాకు కచ్చితంగా ప్రచారం చేయాలనే ఒప్పందమేమీ వెన్నెల కిషోర్ తో చేసుకోలేదని, ఓ సినిమా అనేది అందరి సమిష్ఠి కృషి అని, కుదిరినవాళ్లు ప్రచారానికొస్తారని అన్నారు. వెన్నెల కిషోర్ విషయంలో తమకు ఎలాంటి కంప్లయింట్స్ లేవని, ఓ నటుడ్ని నమ్ముకోకుండా, కంటెంట్ ను నమ్ముకొని తాము ముందుకెళ్తున్నామని అంటున్నారు.

2 Replies to “వెన్నెల కిషోర్ తో ఒప్పందం లేదు”

  1. ఒప్పందం లేక పోయినా…సినిమా గురించి ఒక నాలుగు ముక్కలు జనాలకు చెప్తే…ఇంకో పది టికెట్లు తెగుతాయిగా # వెన్నెల కిషోర్!!!

Comments are closed.