యువగళం అంటూ సుదీర్ఘ పాదయాత్ర చేస్తున్న నారా లోకేష్ ఆ యాత్రలో కచ్చితంగా చేస్తున్నది ఏదైనా ఉంటే, అది ఎక్కడిక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోస్టర్లను, ప్లెక్సీ లను చించి వేయడం! నారా లోకేష్ పాదయాత్ర సాగుతున్న రోడ్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోస్టర్లను, ప్లెక్సీలను చించివేయడాన్ని తమ క్రమం తప్పని పనిగా పెట్టుకున్నారు తెలుగుదేశం శ్రేణులు.
కుప్పం నుంచి ప్రస్తుతం లోకేష్ యాత్ర సాగుతున్నంత వరకూ.. ప్రతి ఊర్లలోనూ, ఆయన పాదయాత్ర సాగుతున్నంత దూరం పోస్టర్లను చింపుకొంటూ వస్తున్నారు. మరి ఈ యువగళం యాత్ర అసలు ఉద్ధేశం ఏమిటో కానీ, ఈ పోస్టర్లను చింపి తృప్తి పొందే ప్రయత్నం మాత్రం గట్టిగా చేస్తున్నట్టుగా ఉన్నారు.
ఈ యాత్రలో లోకేష్ మాట శైలి కూడా ఇలాంటి పనికి ఊతం ఇస్తున్నట్టుగానే ఉంటోంది. వాడు, వీడు అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను మాట్లాడటం లోకేష్ మొదటని చేస్తూ ఉన్నదే. పాదయాత్ర ఆసాంతం ఇదే పొగరే చూపుతూ ఉన్నారు. సగటు కృష్ణా జిల్లా కమ్మ కుర్రాడు ఆకతాయి తనాన్ని చూపితే ఎలా ఉంటుందో లోకేష్ వైఖరి కూడా అలాగే ఉంటోంది.
తనది రాయలసీమ అని, తను సీమ బిడ్డ అంటూ లోకేష్ చెప్పుకుంటూ వస్తున్నాడు. అయితే ఆయన మాట శైలిలో ఎక్కడా రాయలసీమ ధ్వనించదు. ఎంత నచ్చని వ్యక్తిని కూడా వాడూ, వీడూ అంటూ మాట్లాడటం రాయలసీమ శైలి కాదు. అయితే లోకేష్ కు చిన్నాపెద్దా లేదు, తనామనా లేదు. సొంత పార్టీ ఎంపీలు, తన వయసుకు కాస్తా ఇటూ అటూ వాళ్లను కూడా లోకేష్ రేయ్, ఒరేయ్ అంటూ పిలుస్తూ మీడియా వీడియోల్లో కూడా కనిపిస్తున్నారు. ఇదంతా కృష్ణా జిల్లా కమ్మ శైలి తప్ప మరోటి కాదు. లోకేష్ కు అదే అలవాటుగా మారినట్టుగా ఉంది.
ఇక రాజకీయ ప్రత్యర్థులను వాడూ, వీడూ అనేస్తే తన స్థాయి పెరిగిపోయినట్టుగా లోకేష్ భావిస్తున్నాడు! తను అలా మాట్లాడుతున్నాను కాబట్టి తను నాయకుడిని అనే భ్రమలోకి లోకేష్ వెళ్లిపోయాడు. తన ట్రాక్ రికార్డును ఏం పట్టించుకోకుండా జనాలు తన అహంభావాన్నే నాయకత్వం అని అనుకుంటున్నారని లోకేష్ నమ్ముతున్నాడు! మరి ఈ నమ్మకం ఆయనను ఎక్కడకు చేరుస్తుందో కానీ, ఆయన తీరు శ్రేణులను పనికిమాలిన పనులకు పాల్పడేందుకు ఊతం ఇస్తోంది.
ఇష్టానుసారం మాట్లాడటం, అసభ్యకరమైన సైగలను చేయడానికి కూడా లోకేష్ వెనుకాడకపోవడాన్ని చూసి కార్యకర్తలు కూడా చిల్లర పనులకు దిగుతున్నారు. మరి అధికారంలో లేనప్పుడే తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఇంత చిల్లరగా, చెత్తగా ప్రవర్తిస్తున్న నేపథ్యంలో.. ఈ వైఖరితో అధికారాన్ని అందుకుంటే వీరి శైలి మరెంత దుర్మార్గాలను అందుకుంటుందో!