హీరోయిన్ కు వేధింపులు.. కేసు నమోదు

నిధి అగర్వాల్ పోలీసుల్ని ఆశ్రయించింది. తనకు ఎదురవుతున్న బెదిరింపులతో ఫిర్యాదు చేసింది

ఓవైపు హనీ రోజ్ వివాదం నడుస్తూనే ఉంది. ఆమె పెట్టిన కేసు ఆధారంగా సదరు వ్యాపారవేత్తతో పాటు, పదుల సంఖ్యలో నిందితుల్ని అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు. అదింకా కొనసాగుతుండగానే ఇప్పుడు నిధి అగర్వాల్ తెరపైకొచ్చింది. ఈమె కూడా సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేసింది.

కొన్ని రోజులుగా ఓ వ్యక్తి నిధి అగర్వాల్ ను సోషల్ మీడియాలో వేధిస్తున్నాడు. ఇదేదో టీజింగ్ టైపు అయితే నిధి అగర్వాల్ కూడా లైట్ తీసుకునేది. కానీ ఆ వ్యక్తి రేప్ చేస్తానని, మర్డర్ చేస్తానని బెదిరించడం మొదలుపెట్టాడు. అక్కడితో ఆగలేదు. నిధి అగర్వాల్ కుటుంబ సభ్యుల్ని కూడా బెదిరించడం ప్రారంభించాడు.

దీంతో నిధి అగర్వాల్ పోలీసుల్ని ఆశ్రయించింది. తనకు ఎదురవుతున్న బెదిరింపులతో ఫిర్యాదు చేసింది. తన ఫిర్యాదుకు బెదిరింపులు స్క్రీన్ షాట్స్ కూడా జోడించింది. పోలీసులు కేసును విచారణకు తీసుకున్నారు.

ప్రస్తుతం 2 భారీ సినిమాలతో బిజీగా ఉంది నిధి అగర్వాల్. ఇలాంటి టైమ్ లో సదరు వ్యక్తి తనను మానసికంగా వేధిస్తున్నాడని, అతడిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని తన ఫిర్యాదులో కోరింది నిధి.

ఈ ఏడాది నిధి అగర్వాల్ కు చాలా కీలకం. పవన్ కల్యాణ్ సరసన ఆమె నటించిన హరిహర వీరమల్లు సినిమా, ప్రభాస్ తో కలిసి చేస్తున్న రాజాసాబ్ సినిమా ఈ ఏడాదిలోనే థియేటర్లలోకి రాబోతున్నాయి. ఈ రెండు సినిమాలతో తన కెరీర్ పీక్ స్టేజ్ కు వెళ్తుందని ఆమె ఆశ పడుతోంది. ప్రస్తుతం ఇనస్టాగ్రామ్ లో ఆమెకు 30 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు.

3 Replies to “హీరోయిన్ కు వేధింపులు.. కేసు నమోదు”

  1. తొమ్మిది, మూడు ఎనిమిది, సున్నా, ఐదు, మూడు, ఏడు, ఏడు, నాలుగు, ఏడు. వీసీ

Comments are closed.