పెళ్లి ముగిసింది.. పోస్ట్ ఇవ్వాల్సిందే?

తను భార్య కనుక, అర్ధభాగాన్ని కనుక, తనకు భర్త మీడియా సంస్థలో మంచి పదవి ఇవ్వాలని కోరుతున్నట్లు తెలుస్తోంది.

ఆయన ఓ మీడియా మనిషి. వయసు పైన పడింది. ఆలనా పాలనా చూసే వాళ్లు కావాలి. పిల్లలు ఎవరి పనుల్లో వారు బిజీ. అందుకే ఓ మహిళకు దగ్గరయ్యారని వార్తలు వినిపించాయి. అది పెళ్లి వరకు దారి తీసింది. ఇంట్లో కాస్త గడబిడలు తప్పలేదు. అయినా పెళ్లి ఆగలేదు. సిటీకి దూరంగా ఫార్మ్ హౌస్‌లో కాపురం. అంతా బాగానే వుంది. తప్పేమీ లేదు. అసహజం, అన్యాయం కానే కాదు. ఇద్దరికీ ఇష్టపడి పెళ్లి చేసుకుంటే పాయింట్ అవుట్ చేసే అధికారం ఎవరికీ లేదు. అది సీనియర్ ఎన్టీఆర్ అయినా, ఈ మీడియా పెద్ద మనిషి అయినా.

అయితే ఇప్పుడు చిన్న కొత్త తలనొప్పి ప్రారంభమైందనే గ్యాసిప్‌లు కొత్తగా వినిపిస్తున్నాయి. తను భార్య కనుక, అర్ధభాగాన్ని కనుక, తనకు భర్త మీడియా సంస్థలో మంచి పదవి ఇవ్వాలని కోరుతున్నట్లు తెలుస్తోంది.సంస్థలో డైరక్టర్ పదవి ఇస్తే బాగుంటుందని పట్టుపడుతున్నట్లు బోగట్టా. అయితే ఈ పంచాయతీ అంత సులువుగా తెగేది కాదు. డైరక్టర్ పదవి ఇవ్వాలంటే ఇంట్లో జనాలు అంగీకరించాల్సి వుంటుంది. ఎందుకంటే పెళ్లి అంటేనే కాస్త కిందా మీదా అయిన వాళ్లు డైరక్టర్ పదవికి ఓకె అంటారా? పైగా అలా పదవి ఇస్తే బహిరంగంగా చాటింపు వేసినట్లే వుంటుంది.

అందుకే ఇప్పటికి ఈ వ్యవహారం పెద్ద సర్కిళ్లలో గ్యాసిప్ గానే వుండిపోయింది. పెద్ద కుటుంబాలు అంత సులువుగా బయటపడవు. తమలో తాము జాగ్రత్తగా డీల్ చేసుకుంటాయి. ఈ తెలివి తేటలు లేక, పాపం పెద్ద ఎన్టీఆర్ ఓపెన్ గా రెండో పెళ్లి చేసుకుంటున్నట్లు ప్రకటించి, ఇంట్లో వాళ్లకు దూరమై, ఆఖరికి పదవి కూడా పొగట్టుకున్నారు. అదంతా వేరే సంగతి.

8 Replies to “పెళ్లి ముగిసింది.. పోస్ట్ ఇవ్వాల్సిందే?”

  1. ప్లే బాయ్ వర్క్ :- ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు

    1. హెరిటేజ్ కి అనుకుంటా, బెల్లంకొండ ని ఎందుకు కాల్చారంటావ్, బ్రీడ్, బ్లడ్ వేరు కదా అంతా హైబ్రీడే

  2. ప్లే బాయ్ వర్క్ :- తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు

Comments are closed.