నీ రాష్ట్ర పర్యటన ఏమైంది పవన్ కల్యాణ్?

మాటల రాయుడు పవన్ కల్యాణ్ కి, ఇచ్చిన మాటపై నిలబడతాడనే పేరు ఎప్పుడూ లేదు. కొంతసేపు సినిమాలంటారు, ఇంకొంతసేపు ప్రజాసేవ అంటారు. సినిమాలు, డబ్బు సంపాదన తర్వాతే ప్రజాసేవ అంటూ మరికొన్నాళ్లు సాగదీస్తారు. రాజకీయాల్లోకి…

మాటల రాయుడు పవన్ కల్యాణ్ కి, ఇచ్చిన మాటపై నిలబడతాడనే పేరు ఎప్పుడూ లేదు. కొంతసేపు సినిమాలంటారు, ఇంకొంతసేపు ప్రజాసేవ అంటారు. సినిమాలు, డబ్బు సంపాదన తర్వాతే ప్రజాసేవ అంటూ మరికొన్నాళ్లు సాగదీస్తారు. రాజకీయాల్లోకి వచ్చాక సినిమాలు చేయడానికి కారణం చిరంజీవేనంటూ ఇటీవల మరో షాకింగ్ న్యూస్ చెప్పారు.

సినిమా విషయాలు పక్కనపెడితే.. 2019 ఘోర పరాభవం తర్వాత పవన్ కల్యాణ్ ఓ ప్రకటన చేశారు. ముఖ్యమంత్రిగా జగన్ పాలన బాగుంటే తనకు ప్రశ్నించే అవసరమే రాదని, ఎంచక్కా వెళ్లి సినిమాలు చేసుకుంటానని అన్నారు. అదే టైమ్ లో జగన్ పాలన బాగోలేకపోతే మాత్రం గట్టిగా ప్రశ్నిస్తానని, అవసరమైతే రాష్ట్రమంతా పర్యటించి, జగన్ పాలనను ఎండగడతానని హెచ్చరించారు.

కట్ చేస్తే, 20 నెలలు గడిచిపోయాయి. పవన్ కల్యాణ్ సినిమాల్లోకి వెళ్లారు కానీ, జగన్ పాలన బాగుందని మాత్రం ఒప్పుకోలేదు. జగన్ ప్రభుత్వాన్ని దుయ్యబడుతూ, చీటికీమాటికీ ముఖ్యమంత్రిని విమర్శిస్తూ ప్రెస్ నోట్లు రిలీజ్ చేస్తున్నారు. పనిలోపనిగా ఆ రాష్ట్ర పర్యనట కూడా చేస్తే బాగుంటుంది కదా? అని ఆయన వాలకం తెలియని వాళ్లు అనుకుంటున్నారు.

పర్యటనకు కాల్షీట్లెక్కడ..?

రాష్ట్రవ్యాప్త పర్యటన అంటే సినిమాలు ఆగిపోతాయి. అది పవన్ కు ఇష్టం లేదు. పైగా ఇప్పుడు అలాంటి పర్యటనలకు బీజేపీ అనుమతి కూడా కావాలి. అన్నింటికీ మించి శారీరక శ్రమ చేసే పనులకు పవన్ ఎప్పుడో దూరమయ్యారు. సినిమాల్లో కూడా ఎక్కువ శ్రమ పడకుండా ''సింగిల్ టేక్''తోనే పని కానిచ్చేస్తున్నారు.

సో.. ఇలాంటి నేత నుంచి అలాంటి భారీ పర్యటన ఆశించడం అత్యాశే అవుతుంది. ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్న పవన్ కల్యాణ్, రాష్ట్ర ప్రజల్ని కాదు కదా కనీసం తన పార్టీ మనుషుల్ని కూడా పట్టించుకోవడం మానేశారు.

చంచల మనస్తత్వంతో ఎన్నాళ్లీ రాజకీయాలు..?

రాజకీయాలపై పవన్ కల్యాణ్ మనస్తత్వం మారకపోతే పాతికేళ్ల ప్రస్థానం కూడా బూడిదలో పోసిన పన్నీరుగానే మిగులుతుంది. మూడ్ వస్తే జనాల్లోకి రావడం, మూడ్ లేకపోతే వెళ్లి సినిమాలు చేయడం దీన్ని రాజకీయమని ఎలా అంటారు? పాతికేళ్లు వేచి చూసే సహనం ఉన్నవాళ్లు కూడా తొలి అడుగే బలంగా పడాలనుకుంటారు.

కానీ పవన్ ఇంకా తప్పటడుగుల్లోనే ఉన్నారు. సొంత ఆలోచన లేదు, సొంత అజెండా లేదు, చివరకు సినిమాల్లోకి రీఎంట్రీ కూడా చిరంజీవి చెబితే చేశారని చెప్పుకుంటున్న పవన్ అండ్ బ్యాచ్ అసలు జనసేనాని ఫలానా పని ఆలోచించి చేశారు అని చెప్పగలరా? జగన్ పాలన బాగున్నా లేకపోయినా, బాగుందని పవన్ అనుకున్నా, అనుకోకపోయినా.. జనాల్లో తిరిగితేనే జనసేనకు లాభం.

యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయికి ఎదగాలని కాపులకు హితబోధ చేస్తున్న పవన్, అదే ఉపదేశం తనకి కూడా వర్తిస్తుందని అర్థం చేసుకుంటే మంచిది. ఆ పార్టీ, ఈ పార్టీ అంటూ అందరి దగ్గరకు తిరగడం మానేసి, సొంతంగా పార్టీని పటిష్ట పరచుకుంటే శాసించే స్థాయికి పవన్ ఎదగొచ్చు. అది జీహెచ్ఎంసీ ఎన్నిక అయినా, తిరుపతి బై పోల్ అయినా.. సీటు కోసం ఎవరినీ యాచించే అవసరం ఉండదు. 

నిమ్మ‌గ‌డ్డ టీడీపీ ముద్ర పోగొట్టుకుంటారా ?

రామతీర్థం లోని రాములోరి గుడి…డ్రోన్ కెమెరా