పవన్ డెడికేషన్.. అంత జర్వంలోనూ డ‌బ్బింగ్!

తీవ్ర జ్వరంతో బాధపడుతూ రెండు రోజులపాటు బస్సు యాత్రను వాయిదా వేసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. తన వల్ల టీజర్ ఆలస్యం కాకూడదని త‌న సినిమాకు డబ్బింగ్ చెప్పేసారు. స్వయంగా ఆ సినిమా…

తీవ్ర జ్వరంతో బాధపడుతూ రెండు రోజులపాటు బస్సు యాత్రను వాయిదా వేసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. తన వల్ల టీజర్ ఆలస్యం కాకూడదని త‌న సినిమాకు డబ్బింగ్ చెప్పేసారు. స్వయంగా ఆ సినిమా డైరెక్టర్ సముద్ర ఖ‌ని ప్ర‌తేక్య బృందంతో ప‌వ‌న్ విశ్రాంతి తీసుకుంటున్న చోటుకే వెళ్లి మ‌రి డ‌బ్బింగ్ చెప్పించుకున్నారు.

ప‌వ‌న్ గ‌త రెండు వారాలుగా రాజ‌కీయాల‌తో బిజీ బిజీగా ఉన్నారు. ఇలాంటి టైమ్‌లో ఆయన లేటెస్ట్ సినిమా బ్రో టీజర్ విడుదల ప్లాన్ చేసారు. 29న టీజర్ విడుదల కావాల్సి వుంది. కానీ టీజర్ కు పవన్ డబ్బింగ్ బకాయి వుంది. ఇప్ప‌ట్లో ప‌వ‌న్ హైద‌రాబాద్‌కు వ‌చ్చే ప‌రిస్థితి లేక‌పోవ‌డంతో ద‌ర్శ‌కుడు ఓ మొబైల్ డ‌బ్బింగ్ యూనిట్ తీసుకుని ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లి మ‌రి డ‌బ్బింగ్ పూర్తి చేయించుకున్నారు.

కాగా ప‌వ‌న్, సాయిధ‌ర‌మ్ తేజ ప్ర‌ధాన పాత్ర‌ల్లో.. సముద్రఖని దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై తెరకెక్కుతోంది బ్రో. తమిళ్ లో వచ్చిన వినోదాయశితం సినిమాకు రీమేక్ ఇది. పవన్ ను దృష్టిలో పెట్టుకొని, ఈ సబ్జెక్టును పూర్తిగా మార్చేశాడు రచయిత త్రివిక్రమ్. సినిమాకు స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించిన విష‌యం తెలిసిందే.

మొత్తానికి అనారోగ్యం వ‌ల్ల రాజ‌కీయ‌ల‌కు విరామం ప్ర‌క‌టించిన విశ్రాంతి తీసుకోకుండా త‌న వ‌ల్ల సినిమా టీజ‌ర్ ఆల‌స్యం కాకూడ‌ద‌నే ఉద్దేశ్యంతో ప‌వ‌న్ క‌ళ్యాణ్ డ‌బ్బింగ్ చెప్పడం విశేషం. త‌ను రాజ‌కీయాలు చేయ‌లంటే సినిమాల్లో త‌ప్పాకుండా న‌టించాల‌ని చెప్పిన విష‌యం తెలిసిందే.