చంద్రబాబు లేఖ — జనం కాక!

చంద్ర‌బాబు పేరుతో టీడీపీ ఓ లేఖ‌ను బ‌హిరంగ‌ప‌రిచింది. రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైలు నుంచి చంద్ర‌బాబు ఆ లేఖ‌ను రాయ‌లేద‌ని సంబంధిత అధికారులు తేల్చి చెప్పిన సంగ‌తి తెలిసిందే. తాను జైల్లో కాద‌ని ప్ర‌జ‌ల గుండెల్లో…

చంద్ర‌బాబు పేరుతో టీడీపీ ఓ లేఖ‌ను బ‌హిరంగ‌ప‌రిచింది. రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైలు నుంచి చంద్ర‌బాబు ఆ లేఖ‌ను రాయ‌లేద‌ని సంబంధిత అధికారులు తేల్చి చెప్పిన సంగ‌తి తెలిసిందే. తాను జైల్లో కాద‌ని ప్ర‌జ‌ల గుండెల్లో ఉన్న‌ట్టు ఆ లేఖ‌లో చంద్ర‌బాబు పేర్కొన్నారు. ఇదిలా వుండ‌గా చంద్ర‌బాబు పేరుతో ప్ర‌చార‌మ‌వుతున్న లేఖ‌పై జ‌నం రియాక్ష‌న్ ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. లేఖ‌లో బాబు పేర్కొన్న ఒక్కో అంశాన్ని తీసుకుని ప్ర‌జ‌లు వివిధ వేదిక‌ల్లో ఘాటైన స్పంద‌న వెలిబుచ్చారు. అదేంటో చూద్దాం.

బాబుః నేను జైలులో లేను.. ప్రజ‌ల హృద‌యాల్లో ఉన్నాను. ప్రజ‌ల నుంచి న‌న్ను ఒక్క క్షణం కూడా ఎవ్వరూ దూరం చేయ‌లేరు. 

జ‌నంః మరిచిపోయారేమో అనే భయంతోనే కదా తపేలాలూ, దీపాలూ, బేడీలూ, లేఖలూ అంటూ హాస్యం పండిస్తున్నారు.

బాబుః  45 ఏళ్లుగా నేను కాపాడుకుంటూ వ‌స్తున్న విలువ‌లు, విశ్వస‌నీయ‌త‌ను ఎవరూ చెరిపేయ‌లేరు.

జ‌నంః మనకు లేని దాని గురించే ఎక్కువ ఆలోచిస్తాం కదా! మీరు కూడా విలువల గురించి మాట్లాడడం అంతేకదా!

బాబుః నేను త్వర‌లో బ‌య‌ట‌కొస్తాను. ప్రజ‌ల కోసం, రాష్ట్ర ప్రగ‌తి కోసం రెట్టించిన ఉత్సాహంతో ప‌ని చేస్తాను. 

జ‌నంః ఎవ్వరికీ అభ్యంతరం లేదు, ఎవ్వరికీ ఆశా లేదు, గుంటూరు పొగాకు గూట్లో వుంటే ఏమిటి, నోట్లో వుంటే ఏమిటి?

బాబుః ఓట‌మి భయంతో జైలు గోడ‌ల మ‌ధ్య బంధించి ప్రజ‌ల‌కు న‌న్ను దూరం చేశామ‌నుకుంటున్నారు. 

జ‌నంః భయానికే భయాన్ని పరిచయం చేసే కొడుకు వున్నాడు కదా, అందుకే కదా అందరికీ తడిసిపోతున్నాయి!

బాబుః నేను ప్రస్తుతం ప్రజ‌ల మ‌ధ్యలో లేక‌పోవ‌చ్చు.. అభివృద్ధి రూపంలో ప్రతీ చోటా క‌నిపిస్తాను.

జ‌నంః అవును, ప్రపంచ స్థాయి రాజధాని రూపంలో సింగపూర్‌, టోక్యో ల‌నూ గుర్తు తెస్తూ కలలోనూ, కలవరంలోనూ మీరే కనిపిస్తున్నారు, పెత్తందొర గారూ !

బాబుః జైలు గోడ‌ల మ‌ధ్య కూర్చుని ఆలోచిస్తూ ఉంటే 45 ఏళ్ల ప్రజా జీవితం నా క‌ళ్ల ముందు కదలాడుతోంది. 

జ‌నంః అది భూతంలా భయపెడుతోంది కదూ!

బాబుః నా రాజ‌కీయ ప్రస్థాన‌మంతా తెలుగు ప్రజల అభివృద్ధి.. సంక్షేమమే లక్ష్యంగా సాగింది. సంక్షేమం పేరు వినిపించిన ప్రతీసారి నా పేరే త‌లుస్తారు.

జ‌నంః అదేంది, మీరు సీఈవో కదా, ప్రపంచ బ్యాంకు, మీరు పర్యాయపదాలు కదా ! సంక్షేమం మీకు గోత్రం కదా!

బాబుః కుట్రల‌తో నాపై అవినీతి ముద్ర వేయాల‌ని ప్రయ‌త్నించారు కానీ.. నేను న‌మ్మిన విలువ‌లు, విశ్వస‌నీయ‌త‌ని ఎన్నడూ చెరిపేయ‌లేరు.

జ‌నంః నీ దుర్మార్గాలను ఇతరులకు ఆపాదించడమే నీ విధానం కదా — నీకు విలువలే మిటి ? నవ్వుకే నవ్వొచ్చే సింగారం, ముద్ద మందారం!

బాబుః ఈ చీక‌ట్లు తాత్కాలిక‌మే.. సత్యం అనే సూర్యుడి ముందు కారుమ‌బ్బులు వీడిపోతాయి. 

జ‌నంః మాకు ఏ చీకట్లూ లేవు, ఏ కారు మబ్బులూ లేవు! ఈ వాక్యం మాకు వర్తించదు చీక‌ట్లు వీడి ఇప్పుడిప్పుడే వెలుగులు విర‌జిమ్ముతున్న‌ట్టుంది.

బాబుః సంకెళ్లు నా సంకల్పాన్ని బంధించలేవు. జైలు గోడ‌లు నా ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయలేవు. జైలు ఊచ‌లు న‌న్ను ప్రజ‌ల నుంచి దూరం చేయ‌లేవు. 

జ‌నంః ఇది యోధులకు, త్యాగధనులకు నప్పే భాష. మ్యానిపులేటర్లు, పైరవీకారులు కూడా ఇదే భాష మాట్లాడితే డోకొస్తుంది !

బాబుః నేను తప్పు చేయను.. చేయనివ్వను. 

జ‌నంః ఇంతకుముందు నిద్రపోను, నిద్ర పోనివ్వను అన్నట్టు గుర్తు !

బాబుః ఈ దసరాకి పూర్తిస్థాయి మ్యానిఫెస్టో విడుదల చేస్తానని రాజ‌మ‌హేంద్రవ‌రం మహానాడులో ప్రకటించాను. అదే రాజ‌మ‌హేంద్రవ‌రం జైలులో న‌న్ను ఖైదు చేశారు. త్వరలో బయటకొచ్చి పూర్తిస్థాయి మ్యానిఫెస్టో విడుద‌ల చేస్తాను.

జ‌నంః మేనిఫెస్టో అంటే మ‌భ్య‌పెట్టేద‌నే క‌దా మీ అర్థం. ఔను 2014 మేనిఫెస్టో మీ పార్టీ వెబ్‌సైట్‌లో క‌నిపించ‌దేం.

బాబుః నా ప్రజ‌ల కోసం, వారి పిల్లల భ‌విష్యత్తు కోసం రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తాను. 

జ‌నంః మా మానాన మమ్మల్ని వదిలిపెట్టు స్వామీ. మీ ఏడుపు లోకేశ్‌, దేవాన్ష్ కోస‌మ‌ని మాకు తెలుసులే.

బాబుః ఎప్పుడూ బ‌య‌ట‌కు రాని స్వర్గీయ శ్రీ నంద‌మూరి తార‌క‌రామారావు గారి బిడ్డ, నా భార్య భువ‌నేశ్వరిని నేను అందుబాటులో లేని ఈ కష్టకాలంలో ప్రజ‌ల్లోకి వెళ్లి వారి త‌ర‌ఫున పోరాడాల‌ని నేను కోరాను. ఆమె అంగీక‌రించింది. నా అక్రమ అరెస్టుతో త‌ల్లడిల్లి మృతి చెందిన వారి కుటుంబాల‌ని ప‌రామ‌ర్శించి, అరాచ‌క‌ పాల‌నను ఎండ‌గ‌ట్టడానికి ‘నిజం గెల‌వాలి’ అంటూ మీ ముందుకు వ‌స్తోంది.

జ‌నంః మాకు కష్టాలు లేవు, పరామర్శలు అక్కర్లేదు. ఇక్కడ కూడా ఎన్టీఆర్ కూతురు అని ఆవిడ గురించి గుర్తు చేయాల్సిరావడమే నీ నిస్సహాయతనూ, ఓటమినీ ఒప్పుకున్నట్టు, సార్! ఎన్టీఆర్ నీకు ఇక ఎంత మాత్రం ఊత కర్ర కాదు, ఆయన నిన్ను పరుగెత్తించే ఛర్నాకోలా ! 

బాబుః జ‌న‌మే నా బ‌లం, జనమే నా ధైర్యం.

జ‌నంః వాళ్లెప్పుడో నిన్ను మర్చిపోయారు, తీరం దాటారు! అందుకేగా ఈ లేఖా నాటకం!

బాబుః దేశ‌విదేశాల‌లో నా కోసం రోడ్డెక్కిన ప్రజ‌లు వివిధ రూపాల్లో మ‌ద్దతు తెలుపుతున్నారు. 

జ‌నంః జీవితంలో భ్రమ భాగం కావచ్చు, కానీ జీవితమే భ్రమ కారాదు. అలా రోడ్డెక్కి ఆందోళన చేస్తున్న వారిలో లేనిదల్లా ప్రజలే! ఉన్న‌ద‌ల్లా మీ కుల‌పోళ్లే.

బాబుః నా క్షేమం కోసం కుల‌, మ‌త‌, ప్రాంతాల‌కు అతీతంగా మీరు చేసిన ప్రార్థన‌లు ఫ‌లిస్తాయి.

జ‌నంః ప్రార్థనాలయాలను కూల్చిన నీకు ప్రార్థనల మీద నమ్మకం వుందా? కుల, మత, ప్రాంతాలకు అతీతంగా ఏమీ జరగలేదు, అదంతా కళాకారుల అభినయమే, ఫోటోగ్రాఫర్ల కౌశలమే !

బాబుః న్యాయం ఆల‌స్యం అవ్వొచ్చునేమో కానీ, అంతిమంగా గెలిచేది మాత్రం న్యాయ‌మే. 

జ‌నంః Yes, agreed ! మీ విష‌యంలో అదే నిరూపిత‌మైంది.

బాబుః మీ అభిమానం, ఆశీస్సుల‌తో త్వర‌లోనే బయటకి వ‌స్తాను.

జ‌నంః నువ్వు బయటకు వస్తే రావచ్చు. కానీ అందుకు మా అభిమానం, ఆశీస్సులు కారణం కాదు. మా దృష్టిలో అదో జ్యుడీషియల్ ప్రక్రియ మాత్రమే!

బాబుః అంత‌వ‌ర‌కూ నియంత పాల‌న‌పై శాంతియుత పోరాటం కొన‌సాగించండి. 

జ‌నంః ప్రశ్నించే వాళ్ళ తోకలు కత్తిరిస్తానన్న నువ్వే కదా నియంతవి. నీవు కాక ఇక నియంతలెక్కడ దొరబాబు గారూ!

బాబుః చెడు గెలిచినా నిల‌వ‌దు.. మంచి తాత్కాలికంగా ఓడినట్లు కనిపించినా కాల‌ప‌రీక్షలో గెలిచి తీరుతుంది. 

జ‌నంః 45 ఏళ్ల‌ నీ దుష్ట రాజకీయానికి ఏపీ 2019లో చరమగీతం పాడినప్పుడే ఇది మాకు అర్థమైంది.

బాబుః త్వర‌లోనే చెడుపై మంచి విజ‌యం సాధిస్తుంది.

జ‌నంః అది ఏపీలో 2019 లోనే మొదలైంది. మరో 25 ఏళ్ల‌ వరకూ నిరాటంకంగా కొనసాగుతుంది 

బాబుః తెలుగు ప్రజలంద‌రికీ ద‌స‌రా శుభాకాంక్షలు.

జ‌నంః హ్యాపీ జైల్ లైఫ్‌