సూపర్ హిట్టయిన ఎఫ్2 సినిమాకు సీక్వెల్ గా ఇప్పుడు ఎఫ్3 మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. వెంకటేష్-వరుణ్ తేజ్ హీరోలుగా అనీల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకు సంబంధించి 2 కీలకమైన డీల్స్ క్లోజ్ చేశారు. అవే డిజిటల్ రైట్స్, శాటిలైట్ రైట్స్.
ఎఫ్3 సినిమాకు కొబ్బరికాయ కొట్టినప్పుడే డిజిటల్ రైట్స్ డీల్ క్లోజ్ అయింది. అమెజాన్ ప్రైమ్ వీడియోస్ సంస్థ మరో ఆలోచన లేకుండా ఈ సినిమాను ఔట్ రేట్ కు కొనేసింది. ఇప్పుడు జీ తెలుగు ఛానెల్ ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ను దక్కించుకుంది.
ఎఫ్3 మూవీ డిజిటల్ రైట్స్ 12 కోట్ల రూపాయలకు, శాటిలైట్ రైట్స్ కూడా 12 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయినట్టు తెలుస్తోంది. దీంతో రిలీజ్ కు ముందే 24 కోట్ల రూపాయల మేర ఈ సినిమా ఆర్జించినట్టయింది.
దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. రీసెంట్ గా ఓ భారీ షెడ్యూల్ పూర్తిచేశారు. వెంకటేష్, వరుణ్ తో పాటు సునీల్ కూడా ఇందులో పాల్గొన్నాడు. ఫిబ్రవరిలో మరో కొత్త షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు.
ఆగస్ట్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలకాబోతోంది ఎఫ్3 సినిమా. మెహ్రీన్, తమన్న హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.