ఆగస్ట్ రేసులో ఆ సినిమా కూడా

ఆగస్ట్ నెలలో ఇప్పటికే 2 పెద్ద సినిమాలు షెడ్యూల్ అయ్యాయి. అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప సినిమాను ఆగస్ట్ 13న రిలీజ్ చేయబోతున్నారు. ఇక వెంకటేష్-వరుణ్ తేజ్ కలిసి చేస్తున్న ఎఫ్3 సినిమాను ఆగస్ట్…

ఆగస్ట్ నెలలో ఇప్పటికే 2 పెద్ద సినిమాలు షెడ్యూల్ అయ్యాయి. అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప సినిమాను ఆగస్ట్ 13న రిలీజ్ చేయబోతున్నారు. ఇక వెంకటేష్-వరుణ్ తేజ్ కలిసి చేస్తున్న ఎఫ్3 సినిమాను ఆగస్ట్ 27న రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పుడీ నెలలోకి మరో మల్టీస్టారర్ వచ్చి చేరింది.

శర్వానంద్-సిద్దార్థ్ కలిసి నటిస్తున్న మహాసముద్రం సినిమా కూడా ఆగస్ట్ నెలలోనే షెడ్యూల్ అయింది. ఈ సినిమాను ఆగస్ట్ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్టు తాజాగా ప్రకటించారు. ఆర్ఎక్స్100 ఫేమ్ అజయ్ భూపతి ఈ సినిమాను డైరక్ట్ చేస్తున్నాడు.

తాజా ప్రకటనతో ఆగస్ట్ లో వారానికో పెద్ద సినిమా ఫిక్స్ అయినట్టయింది. రెండో వారంలో పుష్ప, మూడోవారంలో మహాసముద్రం, నాలుగో వారంలో ఎఫ్3 కర్చీఫ్ లు వేసుక్కూర్చున్నాయి. ఆగస్ట్ మొదటి వారానికి కూడా ఏదైనా మరో మంచి సినిమా లాక్ అయితే.. ఇక ఆ నెలంతా ప్యాక్ అయినట్టే.

ఇక మహాసముద్రం షూటింగ్ విషయానికొస్తే.. సైలెంట్ గా ఈ సినిమా షూటింగ్ కొనసాగుతోంది. ఎలాంటి స్టిల్స్ లీక్ అవ్వకుండా మేకర్స్ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మూవీలో అదితిరావు, అను ఎమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై వస్తోంది మహా సముద్రం.

చంద్రబాబుకు ఏజెంట్‌లా పనిచేస్తున్న నిమ్మగడ్డ.. 

చంద్రబాబు వివరణ కోరతారా? లేక ఆ పార్టీపై వేటు వేస్తారా?