పవన్ కల్యాణ్ అభిమానులకు గుడ్ న్యూస్. ఓవైపు బ్రో సినిమా విడుదలకు సిద్ధమౌతున్న వేళ, ఓజీ సినిమా నుంచి కూడా క్రేజీ అప్ డేట్ వచ్చింది. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ అప్పుడే సగం పూర్తయిందంట.
పవన్-సుజీత్ ఫ్రెష్ కాంబినేషన్ లో ఈమధ్యే లాంచ్ అయింది ఓజీ సినిమా. ఆ వెంటనే ఫస్ట్ షెడ్యూల్ ప్రారంభించారు. ముంబయి, పూణె పరిసర ప్రాంతాల్లో ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేశారు. సెకెండ్ షెడ్యూల్ ను హైదరాబాద్ లోనే నిర్వహించారు. తాజాగా మూడో షెడ్యూల్ కూడా పూర్తిచేశారు.
ఈ 3 షెడ్యూల్స్ తో ఓజీ సినిమా షూటింగ్ కంప్లీట్ అయినట్టు మేకర్స్ ప్రకటించారు. డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ కల్యాణ్ సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది.
కథకు తగ్గట్టు ఈ సినిమాకు మంచి ఆర్టిస్టుల్ని తీసుకున్నాడు దర్శకుడు సుజీత్. 3 కీలకమైన పాత్రల కోసం ప్రకాష్ రాజ్, శ్రియారెడ్డి, అర్జున్ దాస్ లను తీసుకున్నాడు. వీళ్లలో అర్జున్ దాస్, శ్రియా రెడ్డి.. ఓజీ సినిమాపై ఓ రేంజ్ లో ఎలివేషన్స్ ఇచ్చారు.
ఇక కీలకమైన విలన్ పాత్ర కోసం బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మిని తీసుకున్నారు. తెలుగులో ఇమ్రాన్ కు ఇదే తొలి సినిమా కావడం విశేషం. ఇలా ఇంట్రెస్టింగ్ స్టార్ కాస్ట్ తో తెరకెక్కుతోంది ఓజీ సినిమా.
ఈ సినిమాలో పవన్ పోర్షన్ తక్కువగా ఉంటుందని, తక్కువ కాల్షీట్లతోనే సినిమా పూర్తయిపోతుందనే టాక్ మొదట్నుంచి ఉంది. అందుకు తగ్గట్టుగానే సినిమా షూటింగ్ సగం పూర్తయినట్టు ప్రకటించింది యూనిట్.