నిఖిల్ లేటెస్ట్ సినిమా స్పై. గ్యారీ దర్శకత్వంలో రాజశేఖర్ రెడ్డి నిర్మించిన సినిమా. సెన్సారు పూర్తయింది. కార్తికేయ 2 తరువాత నిఖిల్ సినిమా అంటే ఇప్పుడు మంచి మార్కెట్ వచ్చింది.
వాస్తవానికి ఈ సినిమాను కూడా చాలా ఎర్లీగానే మంచి రేట్లకు అటు థియేటర్, ఇటు నాన్ థియేటర్ మార్కెట్ చేసేసారు. ఇక నిర్మాత ఫుల్ హ్యాపీ. సినిమా హిట్ అయితే బయ్యర్లు, హీరో నిఖిల్ హ్యాపీ అవుతారు.
ట్రయిలర్, నేతాజీ అన్న పాయింట్, రానా స్పెషల్ రోల్ లో నటించడం, ఇవన్నీ కలిసి సినిమా మీద బజ్ ను తీసుకువచ్చింది. ఆంధ్ర ఏరియాను ఆరు కోట్ల రేంజ్ లో మార్కెట్ చేసేసారు. సినిమాలు లేకపోవడంతో కొన్న వాళ్లంతా కిందకు అమ్మేసారు. దాంతో ముందే సేఫ్ అయిపోయారు. నైజాం కొన్న వాళ్లు దిల్ రాజు కు డిస్ట్రిబ్యూషన్ కు ఇచ్చారు.
స్పై సినిమాతో పాటు సామజవరగన విడుదలవుతోంది. అందువల్ల పెద్దగా కాంపిటీషన్ కూడా లేదనే అనుకోవాలి. సినిమాకు ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఇంకా బకాయి వుంది. అందువల్ల సినిమాకు మరింత బజ్ యాడ్ అవుతుందనే అనుకోవాలి.