ఒక్కోసారి అంతే. ఎవరి కోసమో ఏదో చేస్తే మరెవరికో నచ్చేస్తాయి. రచయిత బెజవాడ ప్రసన్న ఓ పాయింట్ ను పట్టుకుని రావు రమేష్-శ్రీవిష్ణు కాంబినేషన్ కు పనికి వస్తుందని చేసుకున్నారు.
ప్రారంభంలో రావురమేష్-రాజ్ తరుణ్ కు చేసుకున్నట్లుగా అనుకోండి. కానీ పాయింట్ ఎలా విన్నారో, ఎందుకు విన్నారో, మొత్తానికి మెగాస్టార్ చిరంజీవి చెవిన పడింది. నచ్చేసింది.
వాల్తేర్ వీరయ్య మాదిరిగా ఫుల్ ఫన్ సినిమా చేయాలన్నది మెగాస్టార్ సంకల్పం. దాంతో ఈ పాయింట్ ను తీసుకుని, తన రేంజ్ కు తగినట్లు మార్చమని దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కు అప్పగించారు. ఆయన అదే పని చేసారు. దాంతో స్టోరీ రెడీ అయిపోయంది. రావు రమేష్ ప్లేస్ లో మెగాస్టార్..శ్రీవిష్ణు ప్లేస్ లో సిద్దు జొన్నలగడ్డ ఫిక్స్ అయ్యారు. త్రిష్ కూడా మెగాస్టార్ జోడీగా ఫిక్స్ అయ్యారు.
మిగిలిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. మిడ్ ఏజ్ పర్సన్ గా చిరంజీవి కనిపిస్తారు. ఆయన కొడుకుగా సిద్దు జొన్నలగడ్డ వుంటారు. మెగాస్టార్ కుమార్తె ఈ సినిమాను నిర్మిస్తారు. మీడియం బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది.