కుప్పం టికెట్ పై చంద్ర‌బాబు హామీలు?

తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబు నాయుడు వ‌చ్చే ఎన్నిక‌ల్లో నెగ్గినా, నెగ్గ‌క‌పోయినా.. ఆయ‌నకు ఇవి బ‌హుశా చివ‌రి ఎన్నిక‌లు! ఈ మాట ఒకానొక సంద‌ర్భంలో చంద్ర‌బాబు నాయుడే చెప్పారు.  Advertisement త‌న‌కు ఇవే చివ‌రి ఎన్నిక‌లు…

తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబు నాయుడు వ‌చ్చే ఎన్నిక‌ల్లో నెగ్గినా, నెగ్గ‌క‌పోయినా.. ఆయ‌నకు ఇవి బ‌హుశా చివ‌రి ఎన్నిక‌లు! ఈ మాట ఒకానొక సంద‌ర్భంలో చంద్ర‌బాబు నాయుడే చెప్పారు. 

త‌న‌కు ఇవే చివ‌రి ఎన్నిక‌లు అంటూ 2024 ఎన్నిక‌ల గురించి మాట్లాడుతూ చంద్ర‌బాబు నాయుడు వ్యాఖ్యానించారు. అయితే ఆ త‌ర్వాత మాట మార్చే ప్ర‌య‌త్న‌మేదో చేశారు. అయితే చంద్ర‌బాబు నాయుడు ఎన్ని మాట‌లు మార్చినా.. మీద ప‌డుతున్న వ‌య‌సు ఆయ‌న‌ను రాజ‌కీయంగా విశ్రాంతిని తీసుకోనీయ‌కుండా వ‌ద‌ల‌దు. అందులోనూ ఇప్ప‌టికే చాన్నాళ్ల నుంచి త‌నేం మాట్లాడుతున్నారో తెలియ‌ని స్థితిలో క‌నిపిస్తున్నారు చంద్ర‌బాబు నాయుడు.

అమ‌రావ‌తిలో 2018లో ఒలింపిక్స్ నిర్వ‌హించ‌బోతున్న‌ట్టుగా ప్ర‌క‌టించిన ద‌గ్గ‌ర నుంచి చంద్ర‌బాబు నాయుడు మాన‌సిక స్థితి గురించి అనుమానాలు మొద‌ల‌య్యాయి. 2018లో ఒలింపిక్స్ అని, అందులో రాణిస్తే నోబెల్ బ‌హుమ‌తిని త‌నే ఇస్తానంటూ చంద్ర‌బాబు నాయుడు చెప్పుకున్నారు! ఆ మాట విని ఆయ‌న‌కు మ‌తి ఉందో లేదో అనుకోవాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఆ త‌ర్వాత కూడా చంద్ర‌బాబు నాయుడు ఏదేదో మాట్లాడారు చాలా సార్లు.  

చంద్ర‌బాబు నాయుడుకు చాలా యేళ్లుగా ఆల్జీమ‌ర్స్ ఉంద‌ని, గ‌తంలో కాంగ్రెస్ నేత కేవీపీ రామ‌చంద్ర‌రావు చెప్పేవారు. ఆ ప్ర‌భావం ఉన్న వాళ్లు తేడా తేడా గా మాట్లాడ‌టం విచిత్రం ఏమీ కాదు. ఈ మ‌ధ్య‌నే చంద్ర‌బాబు నాయుడు మాట్లాడుతూ.. త‌ను రిగ్గింగ్ చేసుకోవ‌డానికి తిరుప‌తి వెళితే అడ్డుకున్నార‌ని అన‌డం, సైకిల్ పోవాలి.. అంటూ ఒక‌టికి ప‌ది సార్లు నినాదం ఇవ్వ‌డం ఇవ‌న్నీ ఆయ‌నకు మ‌తిస్థిమితం త‌ప్పుతోంద‌నేందుకు దాఖ‌లాలుగా ప్ర‌త్య‌ర్థులు విశ్లేషిస్తూ ఉన్నారు.

ఆ సంగ‌త‌లా ఉంటే.. ఈ సారి ఎలాగైనా కుప్పంలో నెగ్గాల‌నే త‌ప‌న‌తో ఉన్న చంద్ర‌బాబు నాయుడు భ‌విష్య‌త్తులో కుప్పం టికెట్ విష‌యంలో వేరే నేత‌ల‌కు హామీలు ఇస్తున్న‌ట్టుగా వార్త‌లు వ‌స్తున్నాయి. ఎలాగూ త‌న త‌న‌యుడు లోకేష్ కుప్పంలో పోటీ చేయ‌డని, వ‌చ్చే ఎన్నిక‌ల్లో వేరే నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసే లోకేష్, ఆ త‌ర్వాత అక్క‌డే మ‌కాం పెడ‌తాడ‌ని, కుప్పం నుంచి మాత్రం 2024లో త‌నే పోటీ చేసి ఆ త‌ర్వాత మ‌రొకరికి అవ‌కాశం ఉంటుందంటూ చెబుతున్నార‌ట‌. 

ఈ క్ర‌మంలోనే తాజాగా కుప్పం ఒక కాంగ్రెస్ నేత‌, ఒక డాక్ట‌ర్ వ‌చ్చి చేరాడ‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. 2024లో త‌న విజ‌యం కోసం ప‌ని చేస్తే ..2029 నాటికి త‌ను ఎలాగూ పోటీ ఉండ‌టం లేదు కాబ‌ట్టి.. ఆ అవ‌కాశం నీకే అంటూ స‌ద‌రు డాక్ట‌ర్ కు చంద్ర‌బాబు నాయుడు మామీ ఇచ్చార‌ట‌!

ఎలాగైనా వ‌చ్చే ఎన్నిక‌ల్లో కుప్పం నుంచి గెల‌వ‌డం అనేది చంద్ర‌బాబుకు ఉన్న అతి పెద్ద ఛాలెంజ్. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో కుప్పాన్ని కాద‌ని మ‌రో  చోట నుంచి పోటీచేసే అవ‌కాశం చంద్ర‌బాబుకు లేదు. కుప్పంలోనేమో గ‌త ఎన్నిక‌ల్లోనే చాలా వ‌ర‌కూ మెజారిటీ త‌గ్గింది. గ‌తంలో పోలిస్తే చంద్ర‌బాబు నాయుడుకు కుప్పంలో తీవ్ర‌మైన పోటీ ఉంటుంది కుప్పంలో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ మేర‌కు స‌న్నద్ధం అయ్యింది. 

కుప్పంలో చంద్ర‌బాబును ఓడించ‌గ‌ల‌మ‌నే విశ్వాసంతో ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దీంతో త‌న విజ‌యం కోసం తీవ్రంగా క‌ష్ట‌ప‌డాల్సిన ప‌రిస్థితుల్లో ఉన్నారు చంద్ర‌బాబు. దీంతో కుప్పం విష‌యంలో వేరే వాళ్ల‌కు హామీలు సైతం ఇచ్చి త‌న విజ‌యం కోసం ప‌ని చేయించుకుంటున్నార‌ని తెలుస్తోంది. ఇలాంటి హామీలు ఇవ్వ‌డంలో చంద్ర‌బాబుకు మించిన వారు లేర‌ని, త‌న ప‌బ్బం గ‌డుపుకునేందుకు చంద్ర‌బాబు నాయుడుకు ఇలాంటి మాట‌లు చెప్ప‌డం అల‌వాటైన ప‌నే అని కామెంట్ స‌హ‌జంగానే వినిపిస్తోంది.