ఆదిపురుష్ రెండో రోజు పాస్

డివైడ్ టాక్, విమర్శల నడుమ థియేటర్లలోకి వచ్చిన ఆదిపురుష్ సినిమా రెండో రోజు కూడా నైజాంలో బాగానే వసూళ్లు సాగించింది. సింగిల్ థియేటర్లలో ఇరవై శాతం డ్రాప్ కనిపించినా, మల్టీ ఫ్లెక్స్ ల డిమాండ్…

డివైడ్ టాక్, విమర్శల నడుమ థియేటర్లలోకి వచ్చిన ఆదిపురుష్ సినిమా రెండో రోజు కూడా నైజాంలో బాగానే వసూళ్లు సాగించింది. సింగిల్ థియేటర్లలో ఇరవై శాతం డ్రాప్ కనిపించినా, మల్టీ ఫ్లెక్స్ ల డిమాండ్ తగ్గలేదు. 

రెండో రోజు నైజాంలో 7.80 కోట్ల రూపాయలు షేర్ వసూలు చేసింది. ఇది మంచి మొత్తమే. ఆదివారం నాడు ఇంకా పెద్ద ఫిగర్ కనిపిస్తుందని టికెట్ బుకింగ్ ట్రెండ్ క్లారిటీ ఇస్తోంది. తొలి వీకెండ్ లో నైజాంలో దగ్గర దగ్గర 27 కోట్లు వసూలు చేస్తుంది అని అంచనా వేస్తున్నారు. నైజాంలో టోటల్ రన్ లో 50 కోట్ల షేర్ వసూలు చేయాల్సి వుంది.

ఇదిలా వుంటే ఆంధ్ర మొత్తం మీద 6.79 కోట్లు రెండో రోజు షేర్ వచ్చింది. కింద సెంటర్లలో కాస్త వసూళ్లు తగ్గాయి కానీ అర్బన్ సెంటర్లు బాగున్నాయి. ఆంధ్రలో కూడా 50 కోట్ల షేర్ ను టోటల్ రన్ లో సాధించాల్సి వుంటుంది. సినిమా సమ్మర్ హాలీడేస్ లో వచ్చినా, లేదా మరొక్కరోజు వీకెండ్ కు సెలవు జత అయినా లెక్కలు, నెంబర్లు చాలా బాగుండేవి.

ఇప్పుడు మండే నుంచి ట్రెండ్ ఎలా వుందో తెలిస్తే, సినిమా కమర్షియల్ సక్సెస్ ఏ మేరకు వుంటుందన్నది అర్థం అవుతుంది. టి సిరీస్, యువి కలిసి నిర్మించిన ఈ సినిమా హక్కులను పీపుల్స్ మీడియా తెలుగు రాష్ట్రాలకు తీసుకుని పంపిణీ చేసింది.