బాబోయ్‌…ఇదీ జ‌న‌సేన మ్యానిఫెస్టో!

మ‌హానాడులో మినీ మ్యానిఫెస్టోను టీడీపీ విడుద‌ల చేసి దూకుడు ప్ర‌ద‌ర్శిస్తోంది. ద‌స‌రాకు సంపూర్ణ మ్యానిఫెస్టోను విడుద‌ల చేయ‌నున్న‌ట్టు చంద్ర‌బాబునాయుడు ప్ర‌క‌టించారు. ఇంత‌కాలం జ‌గ‌న్ ప్ర‌భుత్వం సంక్షేమ ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తూ, రాష్ట్రాన్ని శ్రీ‌లంక‌, వెనుజులా…

మ‌హానాడులో మినీ మ్యానిఫెస్టోను టీడీపీ విడుద‌ల చేసి దూకుడు ప్ర‌ద‌ర్శిస్తోంది. ద‌స‌రాకు సంపూర్ణ మ్యానిఫెస్టోను విడుద‌ల చేయ‌నున్న‌ట్టు చంద్ర‌బాబునాయుడు ప్ర‌క‌టించారు. ఇంత‌కాలం జ‌గ‌న్ ప్ర‌భుత్వం సంక్షేమ ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తూ, రాష్ట్రాన్ని శ్రీ‌లంక‌, వెనుజులా దేశాల మాదిరిగా త‌యారు చేస్తోందంటూ ప్ర‌తిప‌క్షాలు విమ‌ర్శిస్తుండేవి. కానీ జ‌గ‌న్ సంక్షేమ బాట‌లోనే తాము ప్ర‌యాణిస్తామ‌ని చంద్ర‌బాబు చెప్ప‌డం టీడీపీ మ్యానిఫెస్టో ప్ర‌త్యేకత‌.

ఇక వైసీపీ విష‌యానికి వ‌స్తే, తమ‌కు మ‌ళ్లీ అధికారం అప్ప‌గిస్తే సంక్షేమ ప‌థ‌కాల‌ను కొన‌సాగిస్తామ‌ని చెప్పే అవ‌కాశం ఉంది. ఇక జ‌న‌సేన విష‌యానికి వ‌స్తే… ఇప్పుడిప్పుడే ప‌వ‌న్‌క‌ల్యాణ్ జ‌నంలోకి వ‌స్తున్నారు. తాజాగా ఆయ‌న వారాహి యాత్ర పేరుతో జ‌నంతో మ‌మేకం అవుతున్నారు. ష‌న్ముఖ వ్యూహం అంటూ ఆయ‌న ఏవో చెబుతున్నారు. 1.ప్రజలు 2.అభివృద్ధి 3.సంక్షేమం 4.పర్యావరణం 5.పార్టీ 6.రాజకీయాలు ప్రాతిప‌దిక‌గా ఆంధ్ర‌ప్ర‌దేశ్ భ‌విష్య‌త్‌ను మారుస్తాన‌ని ప‌వ‌న్ న‌మ్మ‌బ‌లుకుతున్నారు.

అయితే సోష‌ల్ మీడియాలో మాత్రం జ‌న‌సేన మ్యానిఫెస్టో అంటూ వ్యంగ్యంగా కొన్ని ప‌థ‌కాల‌ను తీసుకురావ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. జ‌న‌సేన అధికారంలోకి వ‌స్తే విడాకులు తీసుకోకుండానే మ‌గ‌వాళ్లు మూడు పెళ్లిళ్ల వ‌ర‌కూ చేసుకునే వెస‌లుబాటు, విడాకులు తీసుకునే మ‌గ‌వాళ్ల‌కు భ‌ర‌ణం చెల్లించేందుకు ప్ర‌త్యేక కార్పొరేష‌న్ ఏర్పాటు. 

ఒక భార్య‌కు విడాకులు ఇస్తే, ఆమెకు భ‌ర‌ణం చెల్లించేందుకు నెల‌కు రూ.25 వేలు చొప్పున ప్ర‌భుత్వమే చెల్లిస్తుంది. ఒక‌రికంటే ఎక్కువ మంది అయితే నెల‌కు రూ.15 వేలు చొప్పున మ‌హిళ‌ల‌కు భ‌ర్త త‌ర‌పున ప్ర‌భుత్వ‌మే భ‌ర‌ణం చెల్లిస్తుంది. భార్య ఉండ‌గానే, మ‌రొక మ‌హిళ‌తో స‌హ‌జీవ‌నం చేసి, పిల్ల‌ల్ని కంటే ప్ర‌భుత్వ‌మే వారి ఆల‌నాపాల‌న చేసుకునేందుకు ప‌వ‌న్ బాల‌వికాస కేంద్రాల ఏర్పాటు చేస్తారు.

విదేశీ మ‌హిళ‌ల‌ను పెళ్లి చేసుకున్న వారికి ప్ర‌త్యేక ప్రోత్సాహకం కింద రూ.5 ల‌క్ష‌లు అంద‌జేత‌. ప్ర‌త్య‌ర్థుల తాట‌, తోలు తీయ‌డానికి ఉపాధి ప‌థ‌కం కింద తోలు ప‌రిశ్ర‌మ‌ల ఏర్పాటుకు స‌బ్సిడీ కింద రూ.10 ల‌క్ష‌లు అందజేస్తారు. అలాగే ప్ర‌త్య‌ర్థుల‌ను చెప్పుల‌తో కొట్ట‌డానికి పాద‌ర‌క్ష‌ల త‌యారీ ప‌రిశ్ర‌మ‌ల‌ను విస్తృతంగా ఏర్పాటు చేశారు. 

జ‌న‌సేన నాయ‌కులు ప్ర‌త్య‌ర్థుల మ‌క్కులు, కీళ్లు, కాళ్లు, చేతులు విర‌గ్గొడితే, వారికి ప‌వ‌న్ ఆరోగ్య‌శ్రీ ప‌థ‌కం కింద ఉచిత వైద్యం, అలాగే వారికి వైద్యం అందించేందుకు ఆస్ప‌త్రుల ఏర్పాటు చేస్తారు. ఇలా జ‌న‌సేనను అధికారంలోకి తెచ్చుకుంటే అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయ‌ని సోష‌ల్ మీడియాలో నెటిజ‌న్లు త‌మ‌దైన సృజ‌నాత్మ‌క మ్యానిఫెస్టోను ప్ర‌చారం చేయ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మ‌వుతోంది.