వన్ సైడ్ లవ్.. అప్ డేట్ ఏంటి..?

చంద్రబాబు మాది వన్ సైడ్ లవ్ అన్న తర్వాత కొన్నాళ్లు పవన్ స్పందించలేదు. ఇటీవల పవన్ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చను అని స్పష్టం చేసిన తర్వాత బాబు మౌనం వహిస్తున్నారు.  Advertisement కనీసం…

చంద్రబాబు మాది వన్ సైడ్ లవ్ అన్న తర్వాత కొన్నాళ్లు పవన్ స్పందించలేదు. ఇటీవల పవన్ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చను అని స్పష్టం చేసిన తర్వాత బాబు మౌనం వహిస్తున్నారు. 

కనీసం పవన్ కు బహిరంగంగా తన లవ్ ప్రపోజల్ ని యాక్సెప్ట్ చేసినందుకు కృతజ్ఞతలు కూడా చెప్పలేదు. అసలేం జరుగుతోంది. బాబుకి బీజేపీపై అనుమానం ఉందా.. బీజేపీ లేకుండా కేవలం జనసేనతోనే బాబు పొత్తుకి ప్రయత్నిస్తున్నారా..?

బీజేపీతో కొంచె ఇష్టం.. చాలా కష్టం..

2014లో బీజేపీతో పొత్తు పెట్టుకుని ఎన్నికల గోదారిని ఈదిన బాబు, 2019లో పొత్తు లేకుండా బీజేపీని వ్యతిరేకించి ఓడిపోయారు. అయితే ఇక్కడ బీజేపీ గొప్పదనం ఏమీ లేదు. 

ఏపీలో బీజేపీతో చంద్రబాబు పొత్తు పెట్టుకున్నా, పొత్తు పెట్టుకోకపోయినా 2019లో జగన్ సునామీ ముందు గల్లంతయ్యేవారే. కానీ పొత్తులో ఉంటే బాబుపై బీజేపీకి సింపతీ ఉండేది. కేంద్రంలో కొద్దో గొప్పో పలుకుబడి ఉండేది. కానీ బాబు బీజేపీతో తెగతెంపులు చేసుకోవడం వల్ల రెండు విధాలా నష్టపోయినట్టయింది.

2024లో ఎలా..?

2024లో చంద్రబాబు, జనసేన పొత్తు ఖాయం. అయితే ఆటలో అరటిపండులా ఉన్న బీజేపీని ఏం చేయాలి..? బాబు వదిలేసిన తర్వాత పవన్ కు బీజేపీయే ప్యాకేజీ ఇచ్చింది. మరిప్పుడు బాబు ఆఫర్ వల్ల బీజేపీకి హ్యాండిస్తే పవన్ ని ఎవరైనా నమ్ముతారా..? రాజకీయాల్లో ఇవన్నీ సాధారణమే అనుకుంటే బీజేపీని నిర్దాక్షిణ్యంగా పక్కనపెట్టాలనుకుంటున్నారు చంద్రబాబు.

అందుకే ఆయన అంత త్వరగా పవన్ లవ్ ప్రపోజల్ పై స్పందించలేదు. బీజేపీతో పొత్తు పెట్టుకుంటే మైనార్టీ ఓట్లు భారీగా చీలిపోయే ప్రమాదం ఉంది. అందుకే బాబు ఆ పార్టీ అంటే హడలిపోతున్నారు.

ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చీల్చను అంటూ పవన్ స్టేట్ మెంట్ ఇచ్చినంత మాత్రాన వైసీపీ ఓడిపోతుందనుకోవడం వట్టి భ్రమ. అయితే అందరూ మందగా వస్తున్నారు కాబట్టి, జనం ఏదేదో ఊహించుకుంటారనే ఆశ మాత్రం వారిలో ఉంది. అందుకే జట్టు కట్టాలని చూస్తున్నారు. కానీ బీజేపీని పక్కనపెట్టేందుకు చంద్రబాబు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. పవన్ ద్వారా లబ్ధి పొందాలి, బీజేపీ ద్వారా వచ్చే నష్టం మాత్రం తనకి వద్దు అనుకుంటున్నారు చంద్రబాబు. ఈ డైలమా ఎన్నాళ్లు కొనసాగుతుందో చూడాలి.