మందు తాగితే నిజాలు బయటకు వస్తాయి అంటారు.. ఇప్పుడు ఓ వ్యక్తి విషయంలో అది నిజమైంది. ఎప్పుడో 30 ఏళ్ల క్రితం హత్య చేసిన విషయాన్ని మందు పార్టీలో వాగడంతో ఓ వ్యక్తి కటకటాల పాలయ్యారు. ముంబయి సమీపంలోని లోనావాలాలో అవినాశ్ పవార్ అనే వ్యక్తి ఓ వృద్ధ జంటను తన స్నేహితులతో కలిసి హతమార్చి పోలీసులు దొరక్కుండా కొన్ని రోజుల పాటు ఢిల్లీకి పారిపోయాడు.
కొన్ని రోజులు పాటు ఢిల్లీలో ఉండి తిరిగి మహారాష్ట్రలోని ఔరంగబద్‌కు తిరిగి వచ్చి.. పేరు అవినాశ్ పవార్‌ను కాస్తా అమిత్ పవర్‌గా మార్చుకుని ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్ కూడా పొందాడు. అటు తిరిగి ఇటు తిరిగి ముంబయిలోని విక్రోలిలో స్థిరనివాసం ఏర్పాటు చేసుకోని, తన భార్యను రాజకీయాల్లో సైతం దింపాడు.
అంత సెట్ అయిందనుకున్నాడో.. లేక ఎప్పుడో 30 ఏళ్ల కిందట జరిగిన విషయం కదా ఎవరు పట్టించుకోరాని మందు తాగి నిజం చెప్పడంతో.. మందు పార్టీలోని కొందరు ఆ విషయం పోలీసులకు చెప్పడంతో పోలీసులు రంగంలోకి దిగి అరెస్ట్ చేశారు.