హనుమాన్ కు చెవుడా.. ఓం రౌత్ పాత ట్వీట్ వైరల్

ఆదిపురుష్ సినిమాతో విపరీతంగా ట్రోలింగ్ ఎదుర్కొంటున్నాడు దర్శకుడు ఓం రౌత్. రామాయణం పేరు చెప్పి యాక్షన్-యానిమేషన్ సినిమా తీశాడని కొందరు, రామాయణాన్ని వక్రీకరించాడని మరికొందరు, డైలాగ్స్ పై ఇంకొందరు తమ అసంతృప్తిని తెలియజేస్తున్నారు. Advertisement…

ఆదిపురుష్ సినిమాతో విపరీతంగా ట్రోలింగ్ ఎదుర్కొంటున్నాడు దర్శకుడు ఓం రౌత్. రామాయణం పేరు చెప్పి యాక్షన్-యానిమేషన్ సినిమా తీశాడని కొందరు, రామాయణాన్ని వక్రీకరించాడని మరికొందరు, డైలాగ్స్ పై ఇంకొందరు తమ అసంతృప్తిని తెలియజేస్తున్నారు.

ఈ క్రమంలో గతంలో ఓం రౌత్ చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది. హనుమంతుడ్ని ఉద్దేశించి, ఓం రౌత్ చేసిన ట్వీట్ అది. పైగా 8 ఏళ్ల కిందటి ట్వీట్ అది.

హనుమాన్ జయంతి సందర్భంగా ఓం రౌత్ బిల్డింగ్ లో అంతా పెద్ద శబ్దాలతో పాటలు పెట్టారట. పైగా ఆ పాటలు సందర్భానుసారంగా కూడా లేవంట. దీంతో “హనుమంతుడికి చెవుడా.. ఎందుకు అంత పెద్ద శబ్దం” అంటూ ట్వీట్ వేశాడు ఓం.

అప్పటి ఆ ట్వీట్ ను తాజాగా వెలికితీశారు నెటిజన్లు. హనుమంతుడిపై ఓం రౌత్ కు అస్సలు భక్తిలేదంటూ ఆ ట్వీట్ ను వైరల్ చేస్తున్నారు. ఇలా భక్తిలేని దర్శకుడు రామాయణం తీస్తే ఆదిపురుష్ లా ఉంటుందంటూ కామెంట్స్ చేస్తున్నారు.

తన పాత ట్వీట్ వివాదాస్పదం అవ్వడంతో వెంటనే ఓం రౌత్ రియాక్ట్ అయ్యాడు. అంతా వైరల్ చేస్తున్న ఆ పాత ట్వీట్ ను వెంటనే డిలీట్ చేశాడు. అయితే అప్పటికే ఆ ట్వీట్ స్క్రీన్ షాట్ ను చాలామంది లాగేశారు. దీంతో ట్వీట్ డిలీట్ అయినా, ఆ స్క్రీన్ షాట్ మాత్రం సోషల్ మీడియాలో తిరుగుతూనే ఉంది.

మరోవైపు ప్రభాస్ కు సంబంధించి కూడా ఓ చిన్న మీమ్ వైరల్ అవుతోంది. గతంలో ఆదిపురుష్ టీజర్ పై తీవ్ర విమర్శలు చెలరేగిన విషయం తెలిసిందే. ఆ టైమ్ లో ప్రభాస్ ఓంను తన రూమ్ లోకి రమ్మంటాడు. అది కెమెరాలో రికార్డ్ అయింది కూడా. ఆ క్లిప్ ను ఇప్పుడు మరోసారి వైరల్ చేస్తున్నారు నెటిజన్లు.

టీజర్ ఫెయిల్ అయినందుకు దర్శకుడికి క్లాస్ పీకడానికి ఒకసారి రూమ్ లోకి పిలిచిన ప్రభాస్.. సినిమా ఇలా తీసినందుకు, ఎన్నిసార్లు తన రూమ్ లోకి పిలిచి ఉంటాడో అంటూ సెటైర్లు వేస్తున్నారు.