బాబు నోట ప‌చ్చి బూతులు

గుడివాడ ఎమ్మెల్యే, మంత్రి కొడాలి నానీని ప్ర‌త్య‌ర్థులు బూతుల మంత్రిగా పిలుస్తుండ‌డం తెలిసిందే. అయితే టీడీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు మాట్లాడే బూతుల ముందు నాని బూతులు ఏపాటి అని చెప్ప‌క త‌ప్ప‌దు.…

గుడివాడ ఎమ్మెల్యే, మంత్రి కొడాలి నానీని ప్ర‌త్య‌ర్థులు బూతుల మంత్రిగా పిలుస్తుండ‌డం తెలిసిందే. అయితే టీడీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు మాట్లాడే బూతుల ముందు నాని బూతులు ఏపాటి అని చెప్ప‌క త‌ప్ప‌దు. అయితే బూతులు అంటే కేవ‌లం తిట్లు అనే కోణంలోనే అర్థం చేసుకోకూడ‌దు. 

ప‌చ్చి అబ‌ద్ధాల‌ను నిజాలుగా న‌మ్మించేందుకు లేనివి ఉన్న‌ట్టు, ఉన్న‌వి లేన‌ట్టు భ్ర‌మింప‌జేయ‌డం కంటే బూతు మ‌రొక‌టి లేదు. ఈ విద్య‌లో చంద్ర‌బాబు ఎంత ప్రావీణ్యుడో మ‌రోసారి ఆయ‌న రుజువు చేసుకున్నారు. బండ బూతుల‌ను కూడా సంస్కార‌వంత‌మైన భాష‌లో చెప్ప‌డం ఒక్క చంద్ర‌బాబుకే సాధ్యం.

మ‌రో రెండు మూడు నెల‌ల్లో తిరుప‌తి లోక్‌స‌భ స్థానానికి ఉప ఎన్నిక జ‌ర‌గ‌నుంది. అక్క‌డ స‌త్తా చాటేందుకు అన్ని రాజ‌కీయ పార్టీలు ఇప్ప‌టి నుంచే క‌స‌రత్తు ప్రారంభించాయి. ఈ నేప‌థ్యంలో తిరుప‌తి లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని టీడీపీ గ్రామ‌స్థాయి నేత‌ల‌తో చంద్ర‌బాబు వీడియో కాన్ఫ‌రెన్స్‌లో మాట్లాడారు. 

ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట‌లు ప‌చ్చిబూతులే అని చెప్ప‌క త‌ప్ప‌దు. త‌న మాట‌లే త‌న‌కే అస‌హ్యం క‌లిగే స్థాయిలో అబద్ధాల‌ను నిజ‌మ‌ని న‌మ్మించే ప్ర‌యత్నం చేశారు.

“అధికారంలోకి రాగానే పింఛ‌న్ రూ.3 వేలు చేస్తామ‌ని చెప్పి రూ.250 పెంచిన పార్టీకి వేస్తారా? ముంపు భూముల్లో, శ్మశానాల్లో, ఊళ్లకు దూరంగా  ఇళ్ల స్థలాలు ఇచ్చిన పార్టీకి వేస్తారా? తిరుమ‌ల‌ ఏడు కొండలను రెండు కొండలు చేయాలనుకుంటే ప్రజలు వ్య‌తిరేకించారు. 

ఇప్పుడు భార్య బైబిల్‌ పట్టుకుని తిరిగే వ్యక్తిని టీటీడీ చైర్మన్‌ను చేశారు. ఆర్టీసీ టికెట్లపై జెరూసలేం యాత్ర విశేషాలు ముద్రించడం, తిరుమల కొండపై శిలువ గుర్తులు పెట్టడం, అక్కడ అన్యమత ప్రచారం చేయడం వంటి వాటితో తిరుమల పవిత్రతను తగ్గిస్తున్నారు. రాష్ట్రంలో అధికారం అండగా బలవంతపు మత మార్పిళ్లు జరుగుతున్నాయి. పాస్టర్ల వ్యాఖ్యలే దీనికి నిదర్శనం.  

రైతు భరోసా రూ.6 వేలు, ఉద్యానవన సబ్సిడీలు ఎగ్గొట్టిన పార్టీకి ఓటేస్తారా? గుడివాడలో మంత్రి పేకాట దందాను పట్టుకున్న ఒక ఎస్ఐ మరణం అనుమానం కలిగిస్తోంది. అది ఆత్మహత్యా.. హత్యా.. అనుమానాస్పద మరణమా అన్నది తేలాలి.  ఇరవై నెలల్లో రెండు వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. రోడ్డు వేయలేదని ఎమ్మెల్యేను ప్రశ్నించిన జనసేన కార్యకర్త శవంగా మారాడు” అని చంద్ర‌బాబు చెప్పుకెళ్లారు. ఇవే అంశాల్ని జ‌నంలోకి తీసుకెళ్లి …ఇలాంటి పార్టీకి ఓట్లు వేస్తారా? అని ప్ర‌శ్నించాల‌ని కోరారు.

వివాహేత‌ర సంబంధం, కుటుంబ స‌మ‌స్య‌ల‌తో ఎస్ఐ ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డితే దాన్ని కూడా జ‌గ‌న్ ప్ర‌భుత్వ ఖాతాలో వేయ‌డ మేనా?  టీటీడీ చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి భార్య స్వ‌ర్ణను కూడా క్రిస్టియ‌న్ మ‌తంలోకి బాబు మార్చ‌డ‌మా? ఇంత‌కూ మ‌త మార్పిడులు జ‌గ‌న్ చేస్తున్నారా?  లేక ప్ర‌తిప‌క్షాలు చేస్తున్నాయా?.

చివ‌రికి ఏడుకొండ‌ల‌ను కూడా రెండు కొండ‌లుగా వైఎస్సార్ మార్చాల‌ని య‌త్నించార‌ని ప‌చ్చి అబ‌ద్ధాలా? ద‌శ‌ల వారీగా పింఛ‌న్‌ను రూ.3 వేల‌కు పెంచుతూ పోతాన‌ని మ్యానిఫెస్టోలో జ‌గ‌న్ స్ప‌ష్టంగా చెప్పినా , దానిపై కూడా అస‌త్య ప్ర‌చారాలా?

ఒక‌సారి వైసీపీ మ్యానిఫెస్టో చూస్తే …నిజానిజాలేంటో తెలుస్తాయి క‌దా! తిరుమ‌ల‌లో అన్య‌మ‌త ప్ర‌చారం అంటూ త‌ప్పుడు ప్ర‌చారం చేయ‌డం బాబు పెద్ద‌రికానికి త‌గిందేనా? ఇలాంటి ఛీప్ పాలిటిక్స్ త‌న‌కు అధికారం తెచ్చి పెడుతుంద‌ని న‌మ్మ‌డం కంటే ఆత్మ వంచ‌న మ‌రొక‌టి ఉందా? ఆ దిశ‌గా బాబు ఎందుకు ఆలోచించ‌డం లేదు. ఇక త‌న‌కు అధికారం ద‌క్క‌ద‌నే అభ‌ద్ర‌తా భావంతో ఆయ‌న నుంచి ఇలాంటి మాట‌లు వ‌స్తున్నాయా? 

రాజకీయ కామెడీ స్టార్ గా పవన్ కళ్యాణ్

కామెడీ ఒక్కటే కాదు నాకు సీరియస్ రోల్స్ చాలా ఇష్టం