నేను ఎన్ టి ఆర్ గారికి వీరాభిమానిని. వీరాభిమాని ఆంటే అభిమానించే నాయకుడికోసం నటుడు కోసం ఏవేవో కోసుకొనే అభిమానం కాదు.
గత ఏడాది కాలంగా వీలు కుదిరినప్పుడల్లా ఎన్ టి ఆర్ గారి దగ్గర సన్నిహితంగా ఉన్న ఎందరో వ్యక్తిగత సహాయకులు, సిబ్బంది, కార్యకర్తలు, అభిమాన సంఘ నాయకులు, రాజకీయ నాయకులు సమకాలీన సహ నటులు, చంద్రబాబు గారు, లక్ష్మి పార్వతి గారు మరియు ఆమె మొదటి భర్త ఇలా ఎందరివో ఇంటర్వ్యూలు చూసాను. ఎన్ టి ఆర్ గారి జీవితం గురించి అతని చివరి రోజులు గురించి ఆయనకి జరిగిన పరాభవం గురించి చెప్పిన వీడియోలు చూసాను .
ఎన్ టి ఆర్ గారికి కొర్ అభిమానిని అయినా ఒక అభిమానిగా కాకుండా కూడా ఒక రైటర్ గా నిజాయితీగా అలోచించి వాళ్ళందరి అభిప్రాయాలు ప్రత్యక్ష అనుభవాలు క్రోడీకరించి విశ్లేషించి ఒక నిశ్సితాభిప్రాయానికి వచ్చాను అయితే పూర్తిగా ఇది నా వ్యక్తిగత అభిప్రాయం మీరు ఏకీభవించవచ్చు విభేదించవచ్చు.. దానితో నాకు సంబంధం లేదు అందరూ ఏకీభవించాలి అని కోరుకొను కూడా ఎవరు తిట్టుకున్నా పొగిడినా నాకు సంబంధం లేదు
పైన చెప్పినవారిలో కొందరు లక్ష్మిపార్వతి గారికి అనుకూలంగా మాట్లాడారు కొందరు చంద్రబాబు గారికి అనుకూలంగా మాట్లాడారు …కొందరి ఇంటర్వ్యూలు చూస్తే చంద్రబాబు దుర్మార్గుడు కొందరివి చూస్తే లక్ష్మిపార్వతి పక్కా స్వార్ధ పరురాలు అని ఇలా ఎవరి అనుభవాలు వారు చెప్పారు ..నాకు ఈ ఇంటర్వ్యూలు అన్ని చూస్తున్నకొద్దీ ఇంకా కుతూహలం పెరిగిపోయింది మనం ప్రత్యక్షంగా చూడలేదు.
నాది ఆ స్థాయి కూడా కాదు కానీ ఒక నిర్ణయానికి రావాలి ఎన్నో ఏళ్లుగా నా మనసులో అలజడి రేపుతున్న ఈ ఘటనలకి ఒక సరైన సమాధానం దొరకాలి నా మనసుకి ఊరట కలగాలి ..అందుకే చాలా ఓపిగ్గా వీలు దొరికినప్పుడల్లా చూస్తూనే ఉండేవాడిని ఒకానొక సమయంలో వాటి గురించే ఆలోచనలు బహుసా ఒక అభిమానిగా ఇప్పటికీ అతని చివరి రోజులు నన్ను తీవ్రంగా బాధించటం కావచ్చు..
ఒకటి మాత్రం నిజం లక్ష్మిపార్వతి గారు మంచి ఆమె అయినా చెడ్డ ఆమె అయినా స్వార్ధ పరురాలు అయినా కాకున్నా చంద్రబాబు గారిలో దుర్భుద్ధి ఉన్నా లేకున్నా పార్టీని కాపాడుకోవాలనే తాపత్రయం తో ఆ పని చేసినా వీరిద్దరి మూలంగా కోట్లాది మంది ప్రజలకి ఆరాధ్య నటుడు నాయకుడు రాజకీయ సంస్కర్త చైతన్య మూర్తి అయిన ఎన్ టి రామ రావు గారు తీవ్ర మనోవేధనతో జీవితం చాలించారు అనేది వాస్తవం.
అయితే ఇందులో ఎవరి వాదాలు వారికి ఉండవచ్చు ఎవరి స్వార్థం వారికి ఉండవచ్చు కానీ అయన మనోవేదనకు మరియు అయన దుస్థితి చూసి బాధపడిన కోట్లాదిమంది ప్రజల మనోవేదనకు కారణం మాత్రం ముమ్మాటికీ ఎన్ టి ఆర్ గారి స్వయంకృతాపరాధమే.
అవును ఇది ఒక రచయితగా మాత్రమే కాదు ఒక అభిమానిగా చెప్తున్నా ఇది ముమ్మాటికీ అయన స్వయంకృతాపరాధమే. ఎందుకంటే దాదాపు పద్నాలుగేళ్ళ రాజకీయాల్లో ఉన్నా కూడా అయన ఒక మంచి ప్రజా నాయకుడు అయ్యారు తప్పా ఒక చతురత ఉన్న రాజకీయ నాయకుడు కాలేకపోయారు ..అయనది రాజకీయ చతురత ఎత్తులకు పై ఎత్తులు ఇవేమి తెలియని కల్లా కపటం లేని ఒక చిన్న పిల్లాడి మనస్తత్వం.
అంతే కాకుండా దూరద్రుష్టి కొరవడటం ప్రతి ఒక్కరిని నమ్మటం ఎవరిని చేర్చుకోవాలి ఎవరిని దూరంగా పెట్టాలి తెలియని బోళా మనిషి …ఈ గుణాలు లేకుండా ఆయనే కనుక కొంచెం తెలివిగా ప్రవర్తించి ఉంటే ఎవరిని ఎంత దూరంలో ఉంచాలో ఉంచేవారు భారత దేశానికి ఖచ్చితంగా ప్రధాని కూడా అయ్యేవారు. అయన చనిపోయేనాటికి నేషనల్ ఫ్రంట్ చాలా బలం పుంజుకుంటుంది అంతకు ముందు కూడా అయన సారధ్యంలో అధికారం లోకి వచ్చింది కూడా.
ఒకటి లక్ష్మి పార్వతి రెండు ఎన్ టి ఆర్ గారు మూడు చంద్రబాబు గారు ఈ నిజజీవిత కథలో ఇవే ప్రధాన పాత్రలు ..కానీ కథలో హీరో ఆయనే బాధితుడూ ఆయనే చివరికి దానికి కారణం కూడా ముమ్మాటికి ఆయనే అవును అయన అమాయకత్వం నిస్వార్ధం అతిమంచితనం అతిగా నమ్మటం మనుషులను వారి మనస్తత్వాలను సరిగా అంచనా వేయలేకపోవటం.
ఇక్కడ మిగతా క్యారెక్టార్లు వాటి సహజ స్వభావ రీత్యా పరిస్థితులు రీత్యా స్వార్ధం రీత్యా ఆ పాత్రలు జీవించాయి. వాటి గుణగణాలు పరిస్థితులు ఏవైనా అనుకోవచ్చు ….నేను ఈ నిర్ణయానికి రాకముందు ఒక్కో సందర్భంలో ఒకరు మంచివాళ్ళు ఇంకొకరు చెడ్డవాళ్ళు గా అనిపించేవారు కానీ ఇవన్నీ ఆలోచించాక అసలుదోషి
బాధితుడు ముమ్మాటికీ నాలాంటి కోట్లాది మంది ఆరాధ్య అభిమాన నటుడు స్వర్గీయ ఎన్ టి ఆర్ గారే ..దోషి అని ఎందుకు అనాల్సి వచ్చింది అంటే అతని తప్పుడు అమాయక నిర్ణయాలుతో అయన బాధ పడి, కోట్లాదిమంది అభిమానులను బాధ పెట్టటం.
…జోహార్ ఎన్ టి ఆర్ ..ఇట్లు మీ అభిమాని ..ఎం టి ఆర్ (మీగడ త్రినాధ రావు)