జగనన్నా అంటూ గిరిజన మహిళ సంతోషం …!

ఏపీలో అభివృద్ధి లేదు. ఇది రొడ్డకొట్టుడు మాట. విపక్షం నోటికి వచ్చే తొలి మాట. ప్రగతి అన్నది ప్రతీ ప్రభుత్వంలోనూ జరుగుతూనే ఉంటుంది. చూసే కళ్ళను బట్టి అది తెలుస్తుంది. అర్ధమవుతుంది. మేము చూడం,…

ఏపీలో అభివృద్ధి లేదు. ఇది రొడ్డకొట్టుడు మాట. విపక్షం నోటికి వచ్చే తొలి మాట. ప్రగతి అన్నది ప్రతీ ప్రభుత్వంలోనూ జరుగుతూనే ఉంటుంది. చూసే కళ్ళను బట్టి అది తెలుస్తుంది. అర్ధమవుతుంది. మేము చూడం, వినం, మాట్లాడమని ఎవరైనా ఒట్టేసుకుంటే చెప్పేది ఏమీ ఉండదు.

అల్లూరు సీతారామరాజు జిల్లాలోని జి మాడుగుల మండలం కిల్లంకోట పంచాయతీకి చెందిన ఆశా కార్యకర్త వరలక్ష్మి జగన్ పాలన గురించి ఏంటో చెప్పింది. ఆమె జగన్ తో డైరెక్ట్ గా వీడియో సమావేశంలో పాలుపంచుకుని మాట్లాడింది.

గతంలో మా ప్రాంతంలో గ్రామాలలో రోడ్లు అన్నవే ఉండేవి కావు, ఇపుడు కొత్తగా రోడ్లు వచ్చాయి, మారు మూల ప్రాంతాలకు సెల్ టవర్ వచ్చింది. అందుకే మీతో మాట్లాడగలుగుతున్నారు జగనన్నా అంటూ ఆమె సంతోషం వ్యక్తం చేసింది.

తమ కుమార్తెకు అమ్మ ఒడి, తమ అత్తకు పించను, తన భర్తకు రైతు భరోసా తనకు జీతం ఇలా తన ఇంట నాలుగు రకాలైన ఆదాయం వస్తోంది, ఇదంతా జగన్ అన్న పుణ్యమేనని అంటోంది. తమ కుటుంబాన్ని ఇన్ని రకాలుగా ఆదుకున్న సీఎం జగన్ కి ఆమె ధన్యవాదాలు తెలియచేశారు.

ఆశాకార్యకర్త వరలక్ష్మి ఒక్కరే కాదు, ఈ విధంగా ప్రతీ కుటుంబంలో కనీసంగా ముగ్గురు నలుగురుకి జగన్ పధకాలు వరిస్తున్నాయి. అందుకే జగన్ ఒక్కటే మాట అంటున్నారు. నేను చేసిన మేలు మీ ఇంట్లో కనిపిస్తేనే నాకు అండగా ఉండండి అని. ఇంత ఓపెన్ గా జగన్ చెబుతున్నారు అంటే ప్రతీ ఇంట్లో ఆయన పేరుతో పధకాలు ఉన్నాయన్న ధైర్యంతోనే. అందుకే విపక్షాలు కూడా సంక్షేమ పధకాలు మేమూ ఇస్తామని అంటుంది. ఒట్టేసి చెబుతున్నది.