జూలై 14న రామ్ ‘ది వారియర్’

రామ్ పోతినేని కెరీర్‌లో ఫస్ట్ టైమ్ పోలీస్ రోల్ చేస్తున్న సినిమా 'ది వారియర్'. తనకు కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందించిన జూలై నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాడు. 'ఇస్మార్ట్ శంకర్' జూలై 18న…

రామ్ పోతినేని కెరీర్‌లో ఫస్ట్ టైమ్ పోలీస్ రోల్ చేస్తున్న సినిమా 'ది వారియర్'. తనకు కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందించిన జూలై నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాడు. 'ఇస్మార్ట్ శంకర్' జూలై 18న విడుదలైంది. 'ది వారియర్' జూలై 14న విడుదలకు రెడీ అయ్యింది. 

లింగుస్వామి దర్శకత్వంలో రామ్ హీరోగా శ్రీనివాసా సిల్వ‌ర్ స్క్రీన్ పతాకంపై తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాను నిర్మిస్తున్న శ్రీనివాసా చిట్టూరి విడుదల తేదీ ప్రకటించారు. ప్రస్తుతానికి జూలై ఫ‌స్టాఫ్‌లో వేరే సినిమా ఏదీ లేదు. మే నెలాఖరు లోపు హీరోలు అందరూ థియేటర్లలోకి వచ్చేస్తున్నారు. సో, తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడులో భారీ సోలో రిలీజ్ ఛాన్స్ ఉంది. 

కర్నూల్ నేపథ్యంలో ఊర మాస్ ఎంటర్టైనర్ గా 'ది వారియర్' తెరకెక్కుతోంది. హీరో పోలీస్, రాయలసీమ బ్యాక్ డ్రాప్ కావడంతో విలన్ గా ఆది పినిశెట్టికి స్ట్రాంగ్ రోల్ లభించింది. ప్రజెంట్ మేడ్చల్ రైల్వే స్టేషన్‌లో విజయ్ మాస్టర్ నేతృత్వంలో ఇంటర్వెల్ ఫైట్ భారీ ఎత్తున చిత్రీకరిస్తున్నారు. 

రామ్ సరసన కృతీ శెట్టి కథానాయికగా, అక్షరా గౌడ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి పవన్ కుమార్ సమర్పణ.